నిమ్మకాయల చినరాజప్ప భారత దేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకులు. ఈయన ప్రస్తుతం నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగానూ, హోం మంత్రిగాను యున్నారు.[1]

నిమ్మకాయ చినరాజప్ప

హోంమంత్రి & డిప్యూటీ సీఎం ఆంధ్ర ప్రదేశ్
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార కాలం
8 జూన్ 2014
నియోజకవర్గము పెద్దాపురం (తూర్పుగోదావరి జిల్లా )

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ తెలుగు దేశం పార్టీ
జీవిత భాగస్వామి అనురాధ
మతం హిందూ

జీవిత విశేషాలుసవరించు

నిమ్మకాయల చినరాజప్ప 1953, అక్టోబరు 1వ తేదీన కీ.శే. వెంకట రంగయ్య, కొండమ్మ దంపతులకు జన్మించారు. రాజప్ప జన్మస్థలం పెదగాడవల్లి, ఉప్పలగుప్తం మండలం, తూర్పుగోదావరి జిల్లా. రాజప్పకు భార్య, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన రాజప్ప తన తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన వ్యవసాయాన్ని కొనసాగిస్తూ... ఎం.ఏ వరకూ చదివివారు. తరువాత 1983లో స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి క్రియాశీలక సభ్యునిగా కొనసాగారు. 1986 లో తూర్పుగోదావరి జిల్లా పార్టీ ఉపాధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1987 లో ఉప్పలగుప్తం మండలం ఎమ్.పి.పి.గా ఎన్నికై మండలాన్ని జిల్లాలోనే ఉత్తమ మండలంగా తీర్చి దిద్దిన ఘనత వహించారు. 1992లో తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా ఎన్నికై 2014 వరకూ సుదీర్ఘ కాలం ఆ పదవిలో కొనసాగి తన సమర్థతను నిరూపించుకున్నారు. 1995లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ ఛైర్మన్ గా, 1998 లో సివిల్ సప్లైస్ ఛైర్మన్ గా, 2001లో కెనరా బ్యాంక్ డైరెక్టర్ గా వివిధ పదవులను అధిరోహించి ఆయా సంస్థలను సమర్థవంతంగా పాలించారు. 2007 నుండి 2013 వరకూ ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. 2014 సాధారణ ఎన్నికలలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అదేశానుసారం మెట్ట ప్రాంతమైన పెద్దాపురం నియోజకవర్గం నుండి పోటీ చేసి భారీ ఆధిక్యంతో గెలుపొందారు. విశ్వసనీయతకు మారుపేరుగా సాధారణ కార్యకర్త స్థాయి నుండి అనేక పదవులు చేపట్టి పార్టీ జయాపజయాలలో కీలక పాత్ర పోషించిన రాజప్ప మొదటి నుండి పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి పనిచేసారు. రాజప్ప విశ్వనీయత, సమర్ధతే ఆయనకు మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికలలో భారీ విజయాన్ని అదించడంతో పాటు అదినేత నుండి ప్రశంసలనూ కురిపించింది.

దీంతో పాటే ఆయనను నవ్యాంధ్రప్రదేశ్ మొదటి ప్రభుత్వంలో రెండు కీలక పదవులు వరించాయి. రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా, విపత్తు నివారణ శాఖా మాత్యులుగా కీలక పదవులు ఆయనకు లభించాయి. కోనసీమ ముద్దుబిడ్డగా, కీ.శే. బాలయోగి రాజకీయ వారసుడిగా కోనసీమతో పాటు తనకు ఇంతటి విజయాన్ని అందించిన పెద్దాపురం నిజయక వర్గం కూడా అన్ని రంగాలలో ముందుకు నడిపిస్తాను అని ఇచ్చిన మాటకు... తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నారు. తనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది కోనసీమ అయితే... ఎక్కడ నుండో వచ్చి ఇక్కడ పోటీ చేసిన తనను గుండెల్లో పెట్టుకుని భారీ విజయాన్ని అందించిన పెద్దాపురం నియోజకవర్గం ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నప్పుడు ఆయన వినమ్రత, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం కనిపిస్తుంది. రాష్ట్ర హోంమంత్రి అయినా తనకు ఇంతటి విజయాన్ని అందించిన పెద్దాపురంలో మాత్రం రాజప్ప సాధారణ శాసనసభ్యుని వలె మెలుగుతూ... అందరినీ ఎంతో ఆప్యాయతతో పలుకరిస్తారు.

మూలాలుసవరించు

  1. "Council of Ministers of Andhra Pradesh". మూలం నుండి 12 జూన్ 2014 న ఆర్కైవు చేసారు. Retrieved 11 June 2014. Cite web requires |website= (help)