నివేదా థామస్

భారతదేశానికి చెందిన నటి

నివేదా థామస్ భారతీయ నటి, మోడల్. ఎక్కువగా మలయాళం, తమిళ, తెలుగు సినిమాల్లో నటించింది. మలయాళ చిత్రం వెరుథె ఒరు భార్య  సినిమాలోని ఆమె నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు పొందారు. ఆ సినిమాలోని నటనకు కేరళ రాష్ట్ర ఉత్తమ యువ నటి పురస్కారం అందుకుంది. తెలుగులో ఆమె చేసిన మొదటి సినిమా జెంటిల్ మేన్ లో కూడా తన నటనతో ప్రశంసలు అందుకుంది నివేదా.[2]

నివేదా థామస్
నివేదా థామస్
జననం (1995-11-02) 1995 నవంబరు 2 (వయసు 28)[1]
జాతీయతభారతీయరాలు
ఇతర పేర్లునివేదా
విద్యాసంస్థఎస్.ఆర్.ఏం విశ్వవిద్యాలయం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2008–ప్రస్తుతం

సినీ మజిలీ

మార్చు

2002లో మలయాళ చిత్రం ఉత్తరతో బాలనటిగా తెరంగేట్రం చేసింది నివేదా.[3] సన్ టీవీలో ప్రసారమయ్యే బాలల సీరియల్ మై డియర్ బూతంలో కూడా నటించింది. మలయాళం సినిమా 'వెరుథె ఒరు భార్య' సినిమాలో జయరాం కుమార్తెగా నటించింది. . ఈ చిత్రంలోని ఆమె నటనకు ప్రశంసలు లభించాయి.[4] ఆ తరువాత నివేదా చాలా తమిళ, మలయాళ చిత్రాల్లో సహాయ నటిగా నటించింది. చాప్పా కురిష్, తట్టతిన్ మరయతు వంటి విజయవంతమైన సినిమాల్లో నటించింది.[5] సముద్ర ఖని దర్శకత్వంలో 2011లో పొరాలీ అనే సినిమాలో పెట్రోల్ బంక్ ఉద్యోగినిగా చేసింది..[6] అంతకు ముందే అరసి అనే డ్రామా సిరీస్ లో సముద్రఖని తో కలసి పనిచేసింది.

నటించిన చిత్రాలు

మార్చు
సంవత్సరం చలన చిత్రం పాత్ర భాష గమనికలు
2008 వెరుథె ఒరు భార్య అంజనా సుగునన్ మలయాళం బాలనటిగా
కురివి వెట్రివేల్ చెల్లెలు తమిళం బాలనటిగా
2009 మధ్య వెనాల్ మనికుట్టి మలయాళం బాలనటిగా
2011 ప్రణయం గ్రేస్ చిన్ననాటి పాత్ర మలయాళం
చప్ప కురిష్ నఫిజా మలయాళం
పొరాలి తమిళ్సెల్వి తమిళం
2012 తట్టతిన్ మరయాతు ఫాతిమా మలయాళం
2013 రొమన్స్ ఎలీనా మలయాళం
నవీన సరస్వతి సబతమ్ జయశ్రి తమిళం
2014 జిల్లా మహాలక్ష్మి తమిళం
మనీరత్నం పియా మమ్మెన్ మలయాళం
2015 పాపనాసం సెల్వి సుయంబులింగం తమిళం
2016 జెంటిల్ మేన్ కేతరిన్ తెలుగు తొలి తెలుగు చిత్రం
2017 నిన్ను కోరి పల్లవి తెలుగు
జై లవకుశ సిమ్రన్ తెలుగు
జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్[7] జూలి తెలుగు
2019 118 ఆధ్యా తెలుగు
బ్రోచేవారెవరురా మిత్ర తెలుగు [8]
2020 దర్బార్ వాళ్ళిక్కన్ను (వళ్ళి) తమిళం [9]
వి అపూర్వ రామానుజన్ తెలుగు అమెజాన్‌ ప్రైమ్‌ [10]
2021 వకీల్‌ సాబ్ వేముల పల్లవి తెలుగు
2021 మీట్ క్యుట్ తెలుగు చిత్రికరణ జరుగుతుంది
2022 శాకిని డాకిని తెలుగు
2024 ఎంతాడ సాజి సాజిమోల్ థామస్ మలయాళం
35 చిన్న కథ కాదు పార్వతి తెలుగు [11]

పురస్కారాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. Sakshi (15 అక్టోబరు 2017). "అదే రోజు.. అదే తప్పు!". Archived from the original on 25 ఫిబ్రవరి 2022. Retrieved 25 ఫిబ్రవరి 2022.
  2. Deccan Chronicle, Entertainment (15 నవంబరు 2017). "Taking Tollywood by storm" (in ఇంగ్లీష్). Meera Manu. Archived from the original on 22 మార్చి 2018. Retrieved 23 మార్చి 2020.
  3. കടപ്പാട്: ചിത്രഭൂമി (26 ఆగస్టు 2009). "Interview – Mathrubhumi Movies". Mathrubhumi.com. Archived from the original on 19 డిసెంబరు 2013. Retrieved 15 ఏప్రిల్ 2014.
  4. "Kerala State Film Awards announced". sify.com (originally Moviebuzz). 4 జూన్ 2009. Retrieved 12 ఏప్రిల్ 2011.
  5. "Kerala Box-Office (June–July 2012)". Sify.com. 1 ఆగస్టు 2012. Archived from the original on 7 ఆగస్టు 2012. Retrieved 15 ఏప్రిల్ 2014.
  6. Nayar, Parvathy (11 నవంబరు 2011). "Niveda: Battling against all odds". The Times of India. Archived from the original on 8 జూలై 2012. Retrieved 7 జనవరి 2017.
  7. Telangana Today, Entertainment (15 డిసెంబరు 2017). "Nivetha's 'Juliet Lover of Idiot' to release on Dec 15". Ranjith Gabbeta. Archived from the original on 23 మార్చి 2020. Retrieved 23 మార్చి 2020.
  8. "'Brochevarevarura': Makers unveil Nivetha Thomas' first look as Mithra". Times of India. 30 మార్చి 2019. Retrieved 18 నవంబరు 2019.
  9. "Darbar: Nivetha Thomas reveals her character in Rajinikanth's film". Times of India. 18 అక్టోబరు 2019. Retrieved 18 నవంబరు 2019.
  10. "Nivetha Thomas confirmed for Indraganti's multi-starrer with Nani and Sudheer Babu". Times of India. 15 ఏప్రిల్ 2019. Retrieved 18 నవంబరు 2019.
  11. NT News (17 జూలై 2024). "సంప్రదాయ చీరకట్టులో నివేదా థామస్.. 35 చిన్న కథ కాదు సరస్వతి గ్లింప్స్‌". Archived from the original on 27 జూలై 2024. Retrieved 27 జూలై 2024.