దర్బార్ (సినిమా)

దర్బార్ 2020లో తమిళంలో విడుదలై.. తెలుగులోకి డబ్బింగ్ చేసిన సినిమా. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రజనీకాంత్‌, నయనతార, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 9 జనవరి 2020న విడుదలైంది.[2]

దర్బార్
Darbar release poster.jpg
దర్శకత్వంఏఆర్‌ మురుగదాస్‌
స్క్రీన్ ప్లేఏఆర్‌ మురుగదాస్‌
నిర్మాతఎ.సుభాస్కరన్
తారాగణం
ఛాయాగ్రహణంసంతోష్ శివ‌న్‌
కూర్పుఅక్కినేని శ్రీకర్ ప్రసాద్
సంగీతంఅనిరుద్ రవిచందర్
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లురిలయన్స్ ఎంటర్టైన్మెంట్
విడుదల తేదీs
9 జనవరి, 2020
సినిమా నిడివి
150 మినిషాలు[1]
దేశం భారతదేశం
భాషతెలుగు

కథసవరించు

ముంబై పోలీసు కమిషనర్‌ ఆదిత్య అరుణాచ‌లం (ర‌జ‌నీకాంత్‌) ఎన్‌కౌంట‌ర్లకి పెట్టింది పేరు. ఒక్కసారిగా ఆవేశానికిలోనై.. రౌడీలను, గ్యాంగ్‌స్టర్‌లను విచ్చలవిడిగా కాల్చిచంపుతుంటాడు. అతని ఎన్‌కౌంటర్లపై విచారణ జరపడానికి వచ్చిన మానవహక్కుల కమిషన్‌ సభ్యులను కూడా బెదిరిస్తాడు. మాద‌క ద్రవ్యాలు, మ‌హిళ‌ల అక్రమ ర‌వాణా ముఠాల్ని అంతం చేసే క్రమంలో కిరాతకుడైన విక్కీ మల్హోత్రా కొడుకు అజయ్‌ మల్హోత్రాను అరెస్టు చేసి అనూహ్య పరిస్థితుల నడుమ జైల్లోనే అజయ్‌ ను హతమారుస్తాడు. డ్రగ్‌లార్డ్‌, మొబ్‌స్టర్‌ అయిన హరిచోప్రా (సునీల్‌ శెట్టి) ప్రతీకారానికి తెగబడి ఆదిత్య కూతురు వ‌ల్లి (నివేదా థామ‌స్) తో పాటు విక్కీ మల్హోత్రాని కూడా చంపుతాడు. అతనెందుకు ఈ హత్యలు చేశాడు. గతంలో పోలీసులను సజీవదహనం చేసి ముంబై పోలీసుల ప్రతిష్టను దెబ్బతీసిన హరిచోప్రా అసలు ఎవరు? ఈ చిక్కుముడులను ఆదిత్య అరుణాచలం ఎలా విప్పాడు? ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నది మిగతా కథ.[3]

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

మూలాలుసవరించు

  1. "Darbar (2019)". British Board of Film Classification. Retrieved 4 January 2020.
  2. Sakshi (9 January 2020). "దర్బార్‌ : మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 18 మే 2021. Retrieved 18 May 2021.
  3. Eenadu (9 January 2021). "రివ్యూ: ద‌ర్బార్‌". www.eenadu.net. Archived from the original on 18 మే 2021. Retrieved 18 May 2021.