నివేదితా జైన్ (1979 జూన్ 9 - 1998 జూన్ 10) ఒక భారతీయ అందాల పోటీదారు, కన్నడ చిత్రాలలో కనిపించిన నటి. ఆమె 1994లో మిస్ బెంగళూరు కిరీటాన్ని గెలుచుకుంది.[1] ఆమె 1996లో శివరంజినీ చిత్రంలో నటిగా అరంగేట్రం చేసింది.

నివేదిత
జననం(1979-06-09)1979 జూన్ 9
బెంగళూరు, కర్ణాటక, భారతదేశం
మరణం1998 జూన్ 10(1998-06-10) (వయసు 19)
బెంగళూరు, కర్ణాటక, భారతదేశం
జాతీయతభారతీయురాలు
ఇతర పేర్లునివేదిత రింకీ
వృత్తినటి, మోడల్
తల్లిదండ్రులుకెప్టెన్ రాజేంద్ర జైన్ (తండ్రి)
గౌరీ ప్రియ (తల్లి)

కెరీర్

మార్చు

నివేదితా జైన్ తన 16 సంవత్సరాల వయస్సులోనే తన నటనా వృత్తిని ప్రారంభించింది. 1997లో రాజ్‌కుమార్ సొంత నిర్మాణ సంస్థ రెండు చిత్రాల ప్రతిపాదనతో ఆమెను సంప్రదించింది. మొదటి చిత్రం రాఘవేంద్ర రాజ్‌కుమార్ సరసన శివరంజినీ, రెండవ చిత్రం శివరాజ్ కుమార్ సరసన శివ సైన్యా విడుదలయ్యాయి. ఈ చిత్రం విజయవంతమైంది. దీంతో, ఆమెకు అనేక ఇతర నిర్మాణ సంస్థల నుండి ఆఫర్లు రావడం ప్రారంభించాయి. అమృత వర్షిని అనే హిట్ చిత్రంలో రమేష్ అరవింద్ తో కలిసి ఆమె అతిధి పాత్రలో నటించింది. అర్జున్ సర్జా, టబు నటించిన తమిళ చిత్రం థాయిన్ మణికోడి లో కూడా ఆమె కీలక పాత్ర పోషించింది.

ఫిల్మోగ్రఫీ

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర గమనిక
1996 శివరంజని
1996 శివ సైన్య శీల
1997 నీ ముడిదా మల్లిగే
1997 బాలిదా మనే
1997 తోకలేని పిట్ట తెలుగు సినిమా
1997 అమృత వర్షిణి శృతి అతిధి పాత్ర
1997 ప్రేమ రాగ హాదు గెలాతి
1998 తాయిన్ మణికోడి ఆశ తమిళ సినిమా
1998 బాలిన దారి
1998 సూత్రధార

1998 మే 17 రాత్రి, బెంగళూరు శివారు రాజరాజేశ్వరి నగర్ లో ఉన్న తన ఇంటి రెండవ అంతస్తులోని టెర్రస్ పారాపెట్ గోడ నుండి పడిపోవడంతో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి.[2] ఆ సమయంలో, ఆమె మిస్ ఇండియా అందాల పోటీకి సన్నాహకంగా క్యాట్ వాక్ సాధన చేస్తోంది.[3][4][5][6] ఆమె కోమాలోకి వెళ్లి, బెంగళూరులోని మాల్యా ఆసుపత్రిలో 24 రోజులు లైఫ్ సపోర్ట్ తో ఉండిపోయింది.[3] ఆసుపత్రిలో ఉన్నప్పుడు, నివేదితా జైన్ తండ్రి, ఆమె కోమా నుండి కోలుకోవడానికి సహాయపడుతుందని ఆశించి, ఆమెకు నివేదితా రింకీ అని పేరు మార్చాడు.[5]

కానీ, 1998 జూన్ 10న ఉదయం ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.[7]

పురస్కారాలు

మార్చు
  • 1994, మిస్ బెంగళూరు టైటిల్ గెలుచుకుంది.[1]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Miss Bangalore Hall Of Fame: Nivedita Jain – Miss Bangalore '94". missbangalore.in. Retrieved 17 September 2011. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "title" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. "Fall of a rising star". India Today. 8 June 1998. Retrieved 9 March 2016.
  3. 3.0 3.1 Express News Service (12 June 1998). "Death ends Nivedita's yearning for extremes". The Indian Express. Retrieved 17 September 2011.
  4. Times of India News Service (25 June 1998). "Was Nivedita Driven To Suicide?". The Times of India. CSCS. Archived from the original on 5 April 2012. Retrieved 17 September 2011.
  5. 5.0 5.1 B.R. Srikanth (22 June 1998). "Catwalk To Death". Outlook India. Retrieved 17 September 2011.
  6. staff (20 May 1998). "Nivedita Jain recovering". Deccan Herald. CSCS. Archived from the original on 5 April 2012. Retrieved 17 September 2011.
  7. "Nivedita Jain dead". The Hindu. 11 June 1998. Archived from the original on 14 May 2011. Retrieved 9 March 2016.