నీతూ శెట్టి (జననం 1988 సెప్టెంబరు 2) ప్రధానంగా కన్నడ భాషా చిత్రాలు, కొన్ని తుళు, మలయాళ చిత్రాలలో కూడా నటించిన భారతీయురాలు.[1] జోక్ ఫాల్స్ (2004), బేరు (2005), ఫోటోగ్రాఫర్ (2006), కోటి చెన్నయ (2007), గాలిపట (2008), కృష్ణ నీ లేట్ ఆగి బారో (2009) వంటి అనేక చిత్రాలకు ఆమె ప్రశంసలు అందుకుంది.

నీతూ
జననం
నీతా

(1988-09-02) 1988 సెప్టెంబరు 2 (వయసు 36)
ఇతర పేర్లునీత
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2004–ప్రస్తుతం

ఆమె అభినేత్రి (2015), ఫెయిర్ & లవ్లీ (2014) వంటి విజయవంతమైన చిత్రాలలో అతిథి పాత్రలు చేసింది. తన 20 ఏళ్ల కెరీర్‌లో, ఆమె 35కు పైగా సినిమాలు, అనేక టెలివిజన్ ప్రాజెక్ట్‌లలో భాగమైంది.

తుళు సినిమా కోటి చెన్నయ (2007)కు గాను తనకు ఉత్తమ సహాయ నటిగా కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డు వరించింది. గాలిపట (2008) చిత్రంలో తన నటనుకు సువర్ణ ఫిల్మ్ అవార్డ్స్, దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలలో ఉత్తమ సహాయ నటిగా నామినేట్ చేయబడ్డాయి.

ప్రారంభ జీవితం

మార్చు

నీతు కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో జన్మించింది. ఆమె తండ్రి మంజునాథ్ శెట్టి, బంట్ కమ్యూనిటీకి చెందినవాడు, కాగా తల్లి మోహినిది కొంకణి మాట్లాడే కుటుంబం. నీతుకు ఒక చెల్లెలు ఉంది.

కెరీర్

మార్చు

నీతు శెట్టి నాగతిహళ్లి చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన పుణ్య అనే సీరియల్‌లో నటించింది. జగ్గేష్, కోమల్ నటించిన గోవింద గోపాల చిత్రం ద్వారా ఆమె అరంగేట్రం చేసింది. ఆ తరువాత యాహూ (2004) అనే భయానక చిత్రంలో ఆమె నటించింది, ఇది సగటు వసూళ్లు సాధించింది. అయితే, వాణిజ్యపరంగా విజయవంతమైన తన చిత్రం జోక్ ఫాల్స్ (2004). ఇది సానుకూల సమీక్షలనందుకుంది. ఇందులో ఆమె రమేష్ అరవింద్‌తో జతకట్టింది. ఆ తర్వాత ఆమె పి. శేషాద్రి దర్శకత్వం వహించిన బేరు (2005) చిత్రంలో నటించింది, ఇది కన్నడలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డు, ఉత్తమ చిత్రంగా కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డు వంటి అనేక ప్రశంసలను అందుకుంది.

ఆమె మలయాళ చిత్రం ఫోటోగ్రాఫర్‌ (2006)లో మోహన్‌లాల్‌తో జతకట్టింది. తుళు భాషా చిత్రం కోటి చెన్నయలో ఆమె నటనకు ఉత్తమ సహాయ నటిగా కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డు దక్కింది. ఆమె తదుపరి చిత్రం పూజారి (2007), ఇందులో తన నటనతో కన్నడ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. మల్టీ స్టారర్, బ్లాక్ బస్టర్ హిట్ అయిన 2008 చిత్రం గాలిపటలో ఆమె నటనకు పలువురి ప్రశంసలు పొందింది. దీనికిగాను ఆమె ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు నామినేట్ చేయబడింది. ఆమె తర్వాత కృష్ణ నీ లేట్ ఆగి బారో, అభినేత్రి వంటి విజయవంతమైన చిత్రాలలో నటించింది.

ఆమె బిగ్ బాస్ కన్నడ 2లో కంటెస్టెంట్‌గా హౌజ్ లో 80 రోజులు ఉంది, ఆమె అక్కడ సీక్రెట్ రూమ్ లో ఉంచబడిన మొదటి కంటెస్టెంట్ అయ్యింది. ఆమె అరుణ్ సాగర్‌తో కలిసి బెంగుళూరు బెన్నె దోసె అనే కామెడీ షోలో భాగమైంది. ఆమె తర్వాత బిగ్ బాస్ కన్నడ 4లో రిషికా సింగ్, సునామీ కిట్టి, ఎన్. సి. అయ్యప్ప, బిగ్ బాస్ కన్నడ 3 విజేత శ్రుతితో కలిసి అతిథిగా కనిపించింది. ఆమె బాక్స్ క్రికెట్ లీగ్‌లో కూడా భాగమైంది, అక్కడ ఆమె దావంగెరె లయన్స్ జట్టుకు క్రీడాకారిణిగా ఉంది, ఇది రన్నరప్‌గా నిలిచింది.

మూలాలు

మార్చు
  1. "Neethu Shetty: Movies, Photos, Videos, News, Biography & Birthday | eTimes". web.archive.org. 2023-12-26. Archived from the original on 2023-12-26. Retrieved 2023-12-26.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)