నీలం పాంచల్

గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన టివి, సినిమా నటి

నీలం పాంచాల్ గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన టివి, సినిమా నటి. హమారీ దేవ్రాణి, రుక్ జానా నహిన్, ఏక్ వీర్ కి అర్దాస్, వీర, లాజ్వంతి, ఇష్క్బాజ్, వంటి అనేక టెలివిజన్ ధారావాహికలలో నటించింది. 2019లో హెల్లారో సినిమాలో అనే గుజరాతీ సినిమాలో నటించి, 66వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ప్రత్యేక జ్యూరీ అవార్డును గెలుచుకుంది.[1]

నీలం పాంచల్
నీలం పాంచల్ (2019)
జననం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2003–ప్రస్తుతం
పురస్కారాలు(2019)లో హెల్లారో సినిమాకు ప్రత్యేక జ్యూరీ అవార్డున

జీవిత చరిత్ర మార్చు

నీలం పాంచాల్ గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ పట్టణంలో జన్మించింది. అహ్మదాబాద్‌లోని హెచ్‌ఎల్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో చదివింది.

నటనారంగం మార్చు

దూరదర్శన్‌లోని ఏక్ దాల్ నా పంఖీ, పతి పత్నీ అనే వావజోడు, గీత్ గుంజన్, యువ సంగ్రామ్, పర్ణ్య అట్లే పతి గయా, సరస్వతీచంద్ర వంటి పలు గుజరాతీ భాషా టెలివిజన్ కార్యక్రమాలలో నటించింది. 

2007లో వచ్చిన స్నేహ నా సగ్పన్‌ అనే గుజరాతీ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది.[2] 2019లో గుజరాతీ పీరియడ్ డ్రామా సినిమా హెల్లారోలో నటించింది, ఇది 66వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది,[3] తన నటనకు ప్రత్యేక జ్యూరీ అవార్డును పొందింది. ఈ సినిమా 2019 నవంబరు 8న విడుదలై సానుకూల సమీక్షలను పొందడంతోపాటు తన నటనకు ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంది.[4][5]

హమారీ దేవ్రాణి, రుక్ జానా నహిన్, ఏక్ వీర్ కి అర్దాస్, వీర, లజ్వంతి, ఇష్క్‌బాజ్ వంటి అనేక హిందీ టివి సీరియళ్ళలో నటించింది.[6] 2020లో మరాఠీ భాషా టెలివిజన్ సీరియల్ వైజు నంబర్ 1లో గుజరాతీ స్త్రీగా నటించింది.[7]

భారత భాగ్యవిధాత నాటకంలో కస్తూర్బా గాంధీగా నటించింది.[1] 2017లో విడుదలైన కాబిల్ సినిమాతో హిందీ సినిమారంగంలోకి అడుగుపెట్టింది.[1][2][8]

నటించినవి మార్చు

సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా దర్శకుడు పాత్ర భాష
2017 కాబిల్ సంజయ్ గుప్తా జాఫర్ భార్య హిందీ
2019 హెల్లారో అభిషేక్ షా లీల గుజరాతీ
2021 21మి టిఫిన్ విజయగిరి బావ నీతల్ అమ్మ గుజరాతీ
2022 రాదో కృష్ణదేవ్ యాగ్నిక్ భూషణ్ భార్య గుజరాతీ
2023 వశ్ కృష్ణదేవ్ యాగ్నిక్ బిన గుజరాతీ

టెలివిజన్ మార్చు

సంవత్సరం శీర్షిక పాత్ర ప్రస్తావనలు
2008–2012 హమారీ దేవరాణి రాజేశ్వరి గౌతమ్ నానావతి [6]
2011–2012 రుక్ జానా నహీం మాల్తీ దేవి సింగ్ [6]
2012 క్రైమ్ పెట్రోల్ న్యాయవాది గాయత్రి [9]
2012–2015 ఏక్ వీర్ కి అర్దాస్. . . వీర అమృత్ కౌర్ [6]
2015–2016 లజ్వంతి శకుంత కిషన్ లాల్ భరద్వాజ్ [6]
2016–2019 ఇష్క్బాజ్ సాహిల్ తల్లి [10]
2016 మన్ మే హై విశ్వాస్ రాసిలా [11]
2020 వైజు నం.1 పరుల్ [7]

వెబ్ సిరీస్ మార్చు

  • 2021: యమ్‌రాజ్ కాలింగ్
  • 2022: రీనాస్ బ్యూటీ స్టూడియో

అవార్డులు మార్చు

సంవత్సరం అవార్డు విభాగం సినిమా ఫలితం మూలాలు
2019 జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రత్యేక జ్యూరీ అవార్డు హెల్లారో' విజేత [12]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 "National award winning actress Niilam Paanchal to make her debut in Marathi". MarathiMovieWorld. 2020-02-17. Retrieved 2023-01-14.
  2. 2.0 2.1 Rathod, Vaishali (2020-06-04). "First Day-First Shot! Being on a film set for the first time was like 'Alice in Wonderland': Niilam Paanchal". The Times of India. Retrieved 2023-01-14.
  3. Scroll Staff (9 August 2019). "National Awards: Aditya Dhar gets best director for 'Uri', Gujarati movie 'Hellaro' wins Best Film". Scroll.in. Retrieved 2023-01-14.
  4. "Hellaro, a celluloid celebration of breaking free". timesofindia.indiatimes.com.
  5. "Hellaro, National Award-winning Gujarati film, is a beautiful ode to female desire and defiance". www.firstpost.com.
  6. 6.0 6.1 6.2 6.3 6.4 "Neelam Panchal is a part of Zee Tv's upcoming show Lajwanti!". Bollywood Dhamaka. 2015-06-30. Archived from the original on 2020-12-01. Retrieved 2023-01-14.
  7. 7.0 7.1 Gavankar, Vaishnavi (2020-03-12). ""I'm ashamed that I can't speak Marathi fluently", says Vaiju No. 1 actress Niilam Paanchal". The Times of India. Retrieved 2023-01-14.
  8. "हृतिक रोशनच्या 'काबिल' सिनेमातील अभिनेत्री करतेय मराठीत पदार्पण". Divya Marathi. 2020-02-08. Retrieved 2023-01-14.
  9. "Nilam Panchal shoots for Crime Patrol". The Times of India. 2012-05-18. Retrieved 2023-01-14.
  10. Maheshwri, Neha (2018-06-17). "'Lajwanti' actress Niilam Paanchal joins 'Ishqbaaaz'". The Times of India. Retrieved 2023-01-14.
  11. "Nilam Panchal to feature in Sony TV's Mann Mein Vishwaas Hai". Tellychakkar.com. 2016-04-13. Retrieved 2023-01-14.
  12. "66th National Film Awards" (PDF). dff.gov.in. Archived from the original (PDF) on 2019-08-09.

బయటి లింకులు మార్చు