నెట్రికన్‌ 2021లో తమిళంలో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమా కొరియన్ చిత్రం ‘బ్లైండ్’కు రీమేక్‌గా నిర్మించారు. రౌడీ పిక్చర్స్, క్రోస్ పిక్చర్స్ బ్యానర్ల పై విఘ్నేష్‌ శివన్‌ నిర్మించిన ఈ సినిమాకు మిలింద్‌ రావ్‌ దర్శకత్వం వహించాడు. నయనతార పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 18న చిత్ర యూనిట్ నయనతార ఫస్ట్ లుక్ మరియు జులై 29, 2021న ట్రైలర్‌ను విడుదల చేశారు.[1] నయనతార, అజ్మల్‌, కె.మణికందన్‌, శరణ్‌శక్తి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2021 ఆగస్టు 13న డిస్నీ+ హాట్‌స్టార్ లో విడుదలైంది.[2]

నెట్రికన్‌
దర్శకత్వంమిలింద్ రావ్‌
రచనమిలింద్ రావ్‌
నవీన్ సుందరమూర్తి
నిర్మాత
నటవర్గం
ఛాయాగ్రహణంఆర్.డి.రాజశేఖర్
సంగీతంగిరీష్‌ గోపాలకృష్ణన్‌
నిర్మాణ
సంస్థలు
 • రౌడీ పిక్చర్స్
 • క్రోస్ పిక్చర్స్
పంపిణీదారులుడిస్నీ+ హాట్‌స్టార్
విడుదల తేదీలు
2021 ఆగస్టు 13 (2021-08-13)
నిడివి
145 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతమిళ్

కథసవరించు

దుర్గ (నయనతార) సీబీఐ ఆఫీసర్‌ ఓ ప్రమాదంలో కంటి చూపును కోల్పోతుంది. నగరంలో వరుసగా అమ్మాయిలు అపహరణకు గురవుతుంటారు. అందమైన అమ్మాయిల్ని కిడ్నాప్‌ చేసి చిత్రహింసలు పెట్టి వాళ్ల చావును కళ్లారా చూసి ఆనందించే జేమ్స్‌(అజ్మల్‌) ఓ సైకో. పోలీసులకు చిక్కకుండా తిరిగే ఈ సైకో జేమ్స్‌ ను అంధురాలైన దుర్గ ఎలా పట్టుకుంది అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

 • బ్యానర్: రౌడీ పిక్చర్స్ , క్రోస్ పిక్చర్స్
 • నిర్మాత: విఘ్నేష్ శివన్
 • దర్శకత్వం: మిలింద్‌ రావ్‌
 • సంగీతం: గిరీష్‌ గోపాలకృష్ణన్‌
 • సినిమాటోగ్రఫీ: ఆర్.డి.రాజశేఖర్
 • ఎడిటింగ్‌: లారెన్స్‌ కిషోర్‌

మూలాలుసవరించు

 1. TV9 Telugu (30 July 2021). "క్రైమ్ థ్రిల్లర్‌‌‌‌గా రానున్న 'నెట్రికన్'.. ఆకట్టుకొంటున్న నయనతార మూవీ ట్రైలర్." Archived from the original on 19 August 2021. Retrieved 19 August 2021.
 2. Suryaa (13 August 2021). "నేటి నుంచే ఓటిటీ లో స్ట్రీమింగ్.. నయనతార క్రైమ్ థ్రిల్లర్ 'నెట్రికన్'". Archived from the original on 19 August 2021. Retrieved 19 August 2021.
 3. Eenadu (15 August 2021). "నయనతార 'నెట్రికన్‌' రివ్యూ". Archived from the original on 19 August 2021. Retrieved 19 August 2021.