నెల్లిమర్ల

ఆంధ్ర ప్రదేశ్, విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలం లోని జనగణన పట్టణం

నెల్లిమర్ల (ఆంగ్లం: Nellimarla), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా,నెల్లిమర్ల మండలానికి చెందిన గ్రామం.[1]

పట్టణ స్వరూపం, జనాభాసవరించు

నెల్లిమర్ల పట్టణం చంపావతి నది వడ్డున ఉంది. దీని భౌగోళిక స్థానం 18.1667° N 83.4333° E.[2]సముద్ర మట్టం నుండి యెత్తు 190 మీటర్లు (626 అడుగులు).

2001 జనాభా లెక్కల ప్రకారం నెల్లిమర్ల పట్టణ జనాభా 19,352. ఇందులో పురుషుల సంఖ్య 48% మరియుస్త్రీల సంఖ్య 52%. పట్టణ అక్షరాస్యత 62% ఉంది. దేశపు సగటు అక్షరాస్యత అయిన 59.5% కంటే ఇది మెరుగు. నెల్లిమర్ల పట్టణపు పురుషుల అక్షరాస్యత 70%, స్త్రీల అక్షరాస్యత 54%. మొత్తం జనాభాలో 8% వరకు ఆరు సంవత్సరాలలోపు బాలబాలికలు ఉన్నారు.

 
నెల్లిమర్ల వద్ద తూర్పు కనుమలు

వ్యవసాయం, నీటి వనరులుసవరించు

చంపావతి నదిపై "డెంకాడ ఆనకట్ట" 1965-68 కాలంలో నిర్మించబడింది. ఈ ప్రాజెక్టు సరిపల్లి గ్రామం వద్ద ఉంది.[3] లభ్యమైన నీటిలో 0.640 టి.యమ్.సి. నీరు ఈ ప్రాజెక్టు ద్వారా వినియోగం అవుతుంది. ఇందువల్ల డెంకాడ, భోగాపురం మండలాలలో 5,153 ఎకరాల ఆయకట్టు స్థిరపడింది.

పరిశ్రమలుసవరించు

నెల్లిమర్ల జూట్‌మిల్లు రాష్ట్రంలో పెద్దదైన జనుపనార పరిశ్రమలలో ఒకటి. అకారణంగా అనేక సార్లు మూత పడడం వలన చెడ్డ పేరు గడించింది.

విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలుసవరించు

  • సి.కె.ఎమ్.జి కాలేజి చుట్టుప్రక్కల ప్రసిద్ధి చెందింది.
  • మహారాజా వైద్య విద్యా సంస్థ 2003లో స్థాపించబడింది.

ఇతర విశేషాలుసవరించు

  • చంపావతి నది వడ్డున ఒక క్రీడా మైదానం ఉంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో నెల్లిమర్ల మంచి క్రీడా కేంద్రంగా ప్రసిద్ధం. వెల్లిమర్ల నుండి మంచి ఫుట్‌బాల్ క్రీడాకారులు వచ్చారు.
  • నెల్లిమర్ల సమీంలోని మోడా గ్రామం ఇదివరకు పెన్మత్స జమీందారుల పాలనలో ఉండేది. ఇక్కడినుండి పెన్మత్స సాంబశివరాజు పలుమార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
  • బ్యాంకులు - స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
  • నెల్లిమర్లలో శ్రీ ఛక్ర జూనియర్ కాలేజ్ 2004 లో స్థాపించబడెను, దానికి ప్రిన్షపాల్ కనకల రాంబాబు ఎమ్.ఎస్.సి, బి.ఈడి

Andhra bank (ramatheerdham in)

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలు, వనరులుసవరించు

  1. "Mandals in Vizianagaram district". Archived from the original on 2006-11-15. Retrieved 2007-02-26.
  2. Fallingrain.com Nellimarla
  3. "Irrigation profile of Vizianagaram district". Archived from the original on 2007-09-28. Retrieved 2008-07-01.

వెలుపలి లంకెలుసవరించు