నేరం నాది కాదు ఆకలిది
ఇది 1976 లో విడుదలైన తెలుగు చిత్రం. హిందీలో విజయవంతమైన 'రోటీ' (రాజేష్ ఖన్నా, ముంతాజ్) చిత్రం ఆధారంగా నిర్మితమైనది. క్రైమ్ అండ్ పనిష్మెంట్ తరహాలో కథ సాగుతుంది. మంచి కథనం, అభినయాలతో సాగే చిత్రం. మంచిని సమాధి చేస్తారా, పబ్లిక్ రా ఇది అన్నీ తెలిసిన పబ్లిక్ రా, హైదరబాద్ బుల్ బుల్ మొదలైన పాటలున్నాయి.
నేరం నాది కాదు ఆకలిది (1976 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎస్.డి.లాల్ |
---|---|
తారాగణం | ఎన్.టి. రామారావు, మంజుల, లత, మురళీమోహన్, గుమ్మడి వెంకటేశ్వరరావు, సుజాత |
సంగీతం | సత్యం |
నేపథ్య గానం | పి.సుశీల, ఎస్.పీ.బాలసుబ్రమణ్యం, ఎస్.జానకి |
నిర్మాణ సంస్థ | రవీంద్ర ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చుచిత్రకథ
మార్చురామారావుకు ఒక నేరం వల్ల జైలు శిక్ష విధించబడుతుంది. చేతులకు బేడీలతొనే తప్పించుకుని ఒక రైలు ఎక్కుతాడు. రైల్లో మురళీ మోహన్ పరిచయమౌతాడు. ఐతే రామారావు చేతులకున్న బేడీలు చూసి మురళి మోహన్ రైలు చైను లాగబోతాడు. పెనుగులాటలో మురళీ మొహన్ చనిపోతాడు. తర్వాత రామారావు గుడ్డి వాళ్ళైన మురళి మోహన్ తల్లి తండ్రులను (గుమ్మడి, ---) కలుస్తాడు. ఆ వూరిలోనే మంజుల ఉంటుంది. అక్కడి వ్యాపారస్తుడి దుర్మార్గాలు, అతన్ని రామారావు ఎదుర్కోవడం, రామారావు కోసం పోలీసుల గాలింపు, మరణించాడనుకున్న మురళీమోహన్ కాలుపోగొట్టుకుని తిరిగిరావడం, గుమ్మడికి నిజం తెలియడం .. ఇవి కథాంశాలు.
పాటలు
మార్చు- ఓ హైదరాబాద్ బుల్ బుల్ హే చార్మినార్ చంచాల్ - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: డా.సినారె
- చెకుముకి రవ్వ చినబోయింది ఓ యమ్మా అది గుప్పున - పి.సుశీల బృందం - రచన: డా.సినారె
- డైమండ్ రాణి గులాబీ బుగ్గ నీదే హాయ్ ఆటేన్ రాజ - ఎస్.జానకి - రచన: ఆరుద్ర
- పబ్లిక్ రా ఇది అన్నీ తెలిసిన పబ్లిక్ రా అహ అసలు తెలుసు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: డా.సినారె
- మంచిని సమాధి చేస్తారా ఇది మనుషులు చేసే పనియేనా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: డా.సినారె
మూలాలు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)