నేహా శెట్టి
నేహా శెట్టి భారతదేశానికి చెందిన సినిమా నటి, మోడల్. ఆమె 2016లో కన్నడ సినిమా ముంగారు మలే 2తో సినీరంగంలోకి ఆడుగుపెట్టి తెలుగులో మెహబూబా, గల్లీ రౌడీ, డీజే టిల్లు సినిమాల్లో నటించింది.
నేహా శెట్టి | |
---|---|
జననం | |
విద్యాసంస్థ | న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2016–ప్రస్తుతం |
జీవిత విశేషాలు
మార్చునేహా శెట్టి కర్నాటకలోని మంగళూరులో పుట్టి బెంగళూరులో పెరిగింది. తల్లి దంతవైద్యురాలు, ఆమె తండ్రి వ్యాపారవేత్త. ఈమెకు ఒక చెల్లెలు ఉన్నది.[1] [2]
సినిమారంగం
మార్చుమోడలింగ్ లోకి వచ్చిన నేహా, 2014లో మిస్ మంగళూరు అందాల పోటీతో గెలిచింది. మిస్ సౌత్ ఇండియా 2015 రన్నరప్‌గా నిలిచింది.[3] దర్శకుడు శశాంక్ తీసిన కన్నడ చిత్రం ముంగారు మలే 2లో నటించింది.[4] [5] ఈ చిత్రం మిశ్రమ సమీక్షలను పొందినప్పటికీ, నేహా నటనకు ప్రశంసలు లభించాయి.[6]
తరువాత, పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం మెహబూబా (2018)లో నటించింది. ఈ సినిమా కోసం తెలుగు భాష నేర్చుకున్నది. [7] మెహబూబా తరువాత, నేహా న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో యాక్టింగ్ కోర్సును అభ్యసించడానికి ఆరు నెలల విరామం తీసుకున్నది.[8] [9]
2021లో నేహా రెండు సినిమాల్లో నటించింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌లో చిన్న పాత్రతోపాటు గల్లీ రౌడీలో ప్రధాన పాత్ర పోషించింది.[10] 2022లో, డిజే టిల్లు సినిమాలో నటించింది.[11]
నటించిన సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | గమనికలు | మూలాలు |
---|---|---|---|---|
2016 | ముంగారు మగ 2 | నందిని | కన్నడ సినిమా | [12] |
2018 | మెహబూబా | అఫ్రీన్ / మదిర | [13] | |
2021 | గల్లీ రౌడీ | పాతపగలు సాహిత్యం | [14] | |
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ | మేఘా | [14] | ||
2022 | డిజే టిల్లు | రాధిక | [15] | |
2023 | బెదురులంక 2012 | చిత్ర | [16] | |
రూల్స్ రంజన్ | సనా | [17] | ||
2024 | టిల్లు స్క్వేర్ | రాధిక | DJ టిల్లు నుండి అతిధి పాత్రను తిరిగి పోషిస్తోంది | |
గ్యాంగ్స్ అఫ్ గోదావరి | బుజ్జి | చిత్రీకరణ | [18][19] |
మూలాలు
మార్చు- ↑ Pecheti, Prakash (2022-02-07). "Neha Shetty is in a celebratory mood". Telangana Today.
- ↑ SM, Shashi Prasad (2015-07-22). "Meet Neha Shetty, the newbie in town". Deccan Chronicle.
- ↑ SM, Shashi Prasad (2015-07-22). "Meet Neha Shetty, the newbie in town". Deccan Chronicle.
- ↑ "Neha Shetty is 'Mungaru Male 2' heroine 1". Sify. Archived from the original on 2015-07-14. Retrieved 2022-04-18.
- ↑ "Shashank Finds his Mungaru Male Girl in Neha Shetty". The New Indian Express. 11 July 2015.
- ↑ SM, Shashiprasad (2016-09-21). "It's 'raining' praise for Neha Shetty". Deccan Chronicle.
- ↑ George, Nina C (2018-01-19). "'I am a very hyper person'". Deccan Herald.
- ↑ Pecheti, Prakash (2022-02-07). "Neha Shetty is in a celebratory mood". Telangana Today.
- ↑ "I am ready to press the refresh button for my acting career, says Neha Shetty". The New Indian Express. 13 June 2020.
- ↑ Pecheti, Prakash (2022-02-07). "Neha Shetty is in a celebratory mood". Telangana Today.
- ↑ Pathi, Thadhagath (2022-02-12). "DJ Tillu Movie Review: Siddhu Jonnalagadda and Neha Shetty steal the show". The Times of India.
- ↑ S, Shyam Prasad (10 September 2016). "Movie Review | Mungaru Male 2". Bangalore Mirror.
- ↑ Kumar, Hemanth (2018-05-11). "Mehbooba movie review : Puri Jagannadh's latest film starring Akash Puri, Neha Shetty is a giant catastrophe-Entertainment News, Firstpost". Firstpost.
- ↑ 14.0 14.1 Pecheti, Prakash (2022-02-07). "Neha Shetty is in a celebratory mood". Telangana Today.
- ↑ "డిజె టిల్లు చూస్తే నవ్వులతో పాండమిక్ ఒత్తిడి అంతా మర్చిపోతారు" (in ఇంగ్లీష్). 5 February 2022. Archived from the original on 26 October 2022. Retrieved 26 October 2022.
- ↑ "Neha Shetty's First Look As Chitra From Bedurulanka 2012 Unveiled". 6 December 2022.
- ↑ "Kiran Abbavaram 'రూల్స్ రంజన్' షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన డైరెక్టర్ క్రిష్". Samayam Telugu.
- ↑ Chitrajyothy (28 May 2024). "పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తా". Archived from the original on 28 May 2024. Retrieved 28 May 2024.
- ↑ EENADU (28 May 2024). "ఆ పాత్రది ప్రత్యేక స్థానం". Archived from the original on 28 May 2024. Retrieved 28 May 2024.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో నేహా శెట్టి పేజీ