మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ తెలుగులో విడుదలైన రొమాంటిక్ కామెడీ ప్రేమ కథ సినిమా. అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు భాస్కర్ దర్శకత్వం వహించాడు. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే, ఆమని, మురళి శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబర్ 15న విడుదలైంది.[1]మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాను నవంబర్ 19న ఆహా ఓటీటీలో విడుదల చేశారు.[2]

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌‌‌ల‌ర్
దర్శకత్వంభాస్కర్
కథా రచయితభాస్కర్
నిర్మాతబన్నీ వాసు
వాసు వర్మ
అల్లు అరవింద్ (సమర్పణ)
తారాగణంఅఖిల్ అక్కినేని
పూజా హెగ్డే
ఛాయాగ్రహణంప్రదీష్ వర్మ
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంగోపి సుందర్
నిర్మాణ
సంస్థ
జీఏ2 పిక్చ‌ర్స్
విడుదల తేదీ
15 అక్టోబర్ 2021
దేశం భారతదేశం
భాషతెలుగు

చిత్ర నిర్మాణంసవరించు

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌‌‌‌‌‌లర్ సినిమా షూటింగ్ జులై 2019లో హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ సినిమాలో సిద్ శ్రీరామ్ పాడిన ‘మనసా మ‌న‌సా’ పాటను 2 మార్చి 2020న విడుదల చేశారు. క‌రోనా వైర‌స్ కార‌ణంగా షూటింగ్ ను మార్చి 2020లో ఆపేసి తిరిగి సెప్టెంబర్ 2020లో షూటింగ్ ప్రారంభించారు.ఈ సినిమా టీజర్ ను 25 అక్టోబర్ 2020న, గుచ్చే గులాబీ పాటను ఫిబ్రవరి 13, 2021న,[3] ‘ఏ జిందగీ’ లిరికల్‌ పాటను ఏప్రిల్ 5,[4] 2021న విడుదల చేశారు.

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

మూలాలుసవరించు

  1. TV9 Telugu (31 March 2021). "అఖిల్ -పూజల మధ్య కెమిస్టీ క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్ లీగా ఉండనుందట." Archived from the original on 3 August 2021. Retrieved 3 August 2021.
  2. News18 Telugu (18 November 2021). "ఓటీటీలో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్.. రేపటి నుంచి స్ట్రీమింగ్." Retrieved 18 November 2021.
  3. Sakshi (16 February 2021). "మ్యూజిక్‌ ఓ హైలైట్‌: బొమ్మరిల్లు భాస్కర్‌". Archived from the original on 3 August 2021. Retrieved 3 August 2021.
  4. Namasthe Telangana (5 April 2021). "అఖిల్‌-పూజా యే జింద‌గీ లిరిక‌ల్ వీడియో సాంగ్‌". Archived from the original on 3 August 2021. Retrieved 3 August 2021.

బయటి లింకులుసవరించు