నోంగ్‌పొ
నోంగ్‌పొ, మేఘాలయ రాష్ట్రంలోని రి-భోయ్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. నాంగ్‌పొ పట్టణం 40వ జాతీయ రహదారిలో, రాష్ట్ర రాజధాని షిల్లాంగ్ నుండి 52 కిలోమీటర్లు, అసోం రాష్ట్రంలోని గువహాటి నుండి 48 కిలోమీటర్ల దూరంలో ఉంది.
నోంగ్‌పొ | |
---|---|
పట్టణం | |
Coordinates: 25°54′N 91°53′E / 25.9°N 91.88°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మేఘాలయ |
జిల్లా | రి-భోయ్ |
Elevation | 485 మీ (1,591 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 17,055 |
భాష | |
• అధికారిక | ఇంగ్లీష్[2] |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
Vehicle registration | ఎంఎల్ - 10 |
వాతావరణం | Cwa |
భౌగోళికం
మార్చునాంగ్పొ పట్టణం 25°54′N 91°53′E / 25.9°N 91.88°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[3] ఇది సముద్రమట్టానికి 485 మీటర్ల (1,591 అడుగుల) ఎత్తులో ఉంది. బ్రహ్మపుత్రా నదికి దగ్గరగా ఉండడంవల్ల ఇక్కడ వేసవికాలంలో వాతావరణం తేమగా, వేడిగా.. శీతాకాలంలో వెచ్చగా ఉంటుంది. ఈ ప్రాంతంలో పైనాపిల్స్, అరటి, బొప్పాయి, లిచి వంటి పండ్లను పండిస్తారు. నాంగ్‌పొ నుండి గువహాటికి వెళ్ళే రోడ్డమార్గంలో తమలపాకు గింజ చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి .
జనాభా
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం, నాంగ్‌పొ పట్టణంలో 17,055 జనాభా ఉంది. ఇందులో 8,536 మంది పురుషులు, 8,519 మంది స్త్రీలు ఉన్నారు. ఈ మొత్తం జనాభాలో 2,993 మంది 0 నుండి 6 సంవత్సరాల వయస్సు గలవారు ఉన్నారు. పట్టణంలోని అక్షరాస్యుల సంఖ్య 11,610 (68.1%) గా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 68.8% కాగా, స్త్రీల అక్షరాస్యత 67.3% గా ఉంది. నాంగ్‌పొలో 3160 గృహాలు ఉన్నాయి.[1] ఇక్కడ షెడ్యూల్డ్ కులాల వారు 30 మంది, షెడ్యూల్డ్ తెగల వారు 14,206 మంది ఉన్నారు.
2001 భారత జనాభా లెక్కల ప్రకారం,[4] నాంగ్‌పొ పట్టణంలో13,165 జనాభా ఉంది. ఈ జనాభాలో 51% మంది పురుషులు, 49% మంది స్త్రీలు ఉన్నారు. నాంగ్‌పొ సగటు అక్షరాస్యత రేటు 61% కాగా, ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 63% కాగా, స్త్రీల అక్షరాస్యత 59% గా ఉంది. ఈ మొత్తం జనాభాలో 21% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.
మతం
మార్చునాంగ్పొ పట్టణంలో క్రైస్తవులు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ హిందువులు, ముస్లింలు కూడా ఉన్నారు.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Census of India: Nongpoh". www.censusindia.gov.in. Retrieved 2 January 2021.
- ↑ "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 మే 2017. Retrieved 2 జనవరి 2021.
- ↑ Falling Rain Genomics, Inc - Nongpoh
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 2 January 2021.
- ↑ "C-1 Population By Religious Community". census.gov.in. Retrieved 2 January 2021.