1941 ఏప్రిల్ 1ముంబాయిలో జన్మించిన అజిత్ లక్ష్మణ్ వాడేకర్ (Ajit Laxman Wadekar) భారతదేశపు మాజీ టెస్ట్ క్రికెట్ కెప్టెన్. దేశవాళీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అతడు ముంబాయి తరఫున ఆడినాడు. గణిత శాస్త్రము నేర్చుకొని ఇంజనీయరు కావాలని అతని తండ్రి అభిలాషించిననూ అజిత్ క్రికెట్ వైపే మొగ్గుచూపాడు. ఎడమచేతి బ్యాటింగ్ శైలి కల అజిత్ వాడేకర్ 1958-59 లో మొదటిసారిగా ముంబాయి రతఫున ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో ప్రాతినిధ్యం వహించాడు . తొలి తెస్ట్ మ్యాచ్ ను స్వంత మైదానంలో 1966లో వెస్ట్‌ఇండీస్ పై ఆడినాడు. అప్పటి నుంచి 1974 వరకు భారత జట్టు తరఫున మొత్తం 37 టెస్టులలో ప్రాతినిధ్యం వహించి 2113 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 4 అర్థ్ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్ లో అతని అత్యధిక స్కోరు 143 పరుగులు.

అజిత్ వాడేకర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అజిత్ లక్ష్మణ్ వాడేకర్
పుట్టిన తేదీ(1941-04-01)1941 ఏప్రిల్ 1
బాంబే, బాంబే ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా
మరణించిన తేదీ2018 ఆగస్టు 15(2018-08-15) (వయసు 77)
ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
బ్యాటింగుఎడమ చేతివాటం
బౌలింగులెఫ్ట్ ఆర్మ్ మీడియం
స్లో లెఫ్ట్ ఆర్మ్‌ ఆర్థొడాక్స్
పాత్రబ్యాట్స్‌మాన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 112)1966 13 డిసెంబర్ - వెస్ట్ ఇండీస్ తో
చివరి టెస్టు1974 4 జూలై - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 11)1974 13 జూలై - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే1974 15 జూలై - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1959–1974బాంబే
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ ODI FC LA
మ్యాచ్‌లు 37 2 237 5
చేసిన పరుగులు 2,113 73 15,380 192
బ్యాటింగు సగటు 31.07 73.00 47.03 63.33
100లు/50లు 1/14 0/1 36/84 0/2
అత్యుత్తమ స్కోరు 143 67* 323 87
వేసిన బంతులు 51 1,622
వికెట్లు 0 21
బౌలింగు సగటు 43.23
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 2/0
క్యాచ్‌లు/స్టంపింగులు 46/– 1/– 271/– 3/–
మూలం: ESPNcricinfo, 2012 28 సెప్టెంబర్
"విజయ్ బల్లా" ఇంగ్లాండ్ (1971), గ్యారీ సోబర్స్ వెస్టిండీస్ (1972) టెస్ట్ సిరీస్ గెలిచిన భారత జట్టు ఆటగాళ్ల పేర్లతో కాంక్రీట్‌తో తయారు చేయబడింది. ఇండోర్‌

ముంబాయి కెప్టెన్ గా ఉంటూ 1971లో భారత జట్టు కెప్టెన్ గా నియమించబడ్డాడు. ఇంగ్లాండు, వెస్ట్‌ఇండీస్ పై సీరిస్ విజయం సాధించి కెప్టెన్ గా సఫలుడైనాడు. ఆ రెండు దేశాలపై కూడా 1-0 తో సిరిస్ గెల్చి ఆ దేశాలపై సిరిస్ గెలిపించిన తొలి భారత కెప్టెన్ గా గుర్తించబడ్డాడు. 1972-73 లో ఇంగ్లాండు పై కూడా 2-1 తో సిరీస్ విజయం సాధించి సారథిగా తన మూడవ సిరిస్ ను గెలిపించాడు. కాని ఆ తర్వాత 1974లో ఇంగ్లాండు వెళ్ళిన భారత జట్టు అతని నాయకత్వంలో సీరీస్ లోని మొత్తం 5 మ్యాచ్‌లలోనూ పరాజయం పొందింది. దెబ్బపై దెబ్బ అన్నట్లు ఇటు స్వదేశంలో కూడా అతని నాయకత్వంలోని ముంబాయి జట్టు రంజీ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ, దులీప్ ట్రోఫి, లలో కూడా పరాజయం పొదడంతో అతను తీవ్ర విమర్శల పాలయ్యాడు. తత్ఫలితంగా కెప్టెన్ పదవికి రాజీనామా చేయడమే కాకుండా ఏకంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచే నిష్క్రమించాడు.

1990 దశాబ్దంలో అజహరుద్దీన్ కెప్టెన్ ఉన్న సమయంలో వాడేకర్ భారత క్రికెట్ జట్టు మేనేజర్ గా పనిచేశాడు. భారత క్రికెట్ ఆటగాడిగా, కెప్టెన్ గా, కోచ్ లేదా మేనేజర్‌గా, సెలెక్షన్ టీం చైర్మెన్ గా పనిచేసిన అతి కొద్దిమందిలో అజిత్ వాడేకర్ ఒకరు. లాలా అమర్‌నాథ్ ఈ ఘనత సాధించిన వారిలో ప్రప్రథముడు.[1] అతని తర్వాత చందూ బొర్డే కూడా ఈ ఘనతను సాధించాడు.[2] 1972 లో భారత ప్రభుత్వం అతన్ని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

2018 ఆగస్టు 15, స్వాతంత్ర్య దినం రోజున ముంబైలో చనిపోయాడు.

మూలాలు

మార్చు
  1. http://content-www.cricinfo.com/ci/content/story/84833.html
  2. http://www.rediff.com/sports/1999/sep/28borde.htm Borde Shares Wadekar's Distinction

బయటి లింకులు

మార్చు