నౌహీద్ సైరూసి
నౌహీద్ సైరూసి (ఆంగ్లం: Nauheed Cyrusi) ఒక భారతీయ నటి, మోడల్.[1] ఆమె వీడియో జాకీ కూడా.
నౌహీద్ సైరూసి | |
---|---|
జననం | 1983/1984 (age 40–41)[1] బెల్ఫాస్ట్, నార్తర్న్ ఐర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్ |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1999–2015, 2021-ప్రస్తుతం |
ప్రారంభ జీవితం
మార్చునౌహీద్ సైరూసి ఉత్తర ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్ట్‌లో భారతీయ పార్సీ జొరాస్ట్రియన్ కుటుంబంలో జన్మించింది. అయితే, ఆమె ముంబైలో పెరిగింది. ఆమె జె.బి. వాచా గర్ల్స్ హై స్కూల్ నుండి పాఠశాల విద్యను అభ్యసించింది. అలాగే, ఆమె జై హింద్ కళాశాల నుండి వ్యాపార నిర్వహణలో పట్టభద్రురాలైంది.[2]
కెరీర్
మార్చుఆమె పాఠశాల విద్యను అభ్యసిస్తున్నప్పుడు ధారా రిఫైన్డ్ ఆయిల్ వాణిజ్య ప్రకటనతో మోడల్ గా కెరీర్ మొదలుపెట్టింది. ఆ తరువాత, ఆమె హెడ్ & షోల్డర్స్, బ్రిటానియా లిటిల్ హార్ట్స్ బిస్కెట్స్, ఆయుర్వేద కాన్సెప్ట్స్ (ఇప్పుడు హిమాలయా) వంటి వివిధ ప్రకటనలు చేసింది.
అదే సమయంలో, ఆమె అనేక మ్యూజిక్ వీడియోలలో కూడా కనిపించింది, ముఖ్యంగా "పియా బసంతి" పాటతో ఆమె ప్రసిద్దిచెందింది.[3]
2003లో ఉదయ్ చోప్రా నటించిన పదమ్ కుమార్ హిందీ చిత్రం సుపారీతో ఆమె రంగప్రవేశం చేసింది. ఆ తరువాత, విక్రమ్ భట్ ఆమెను అష్మిత్ పటేల్ సరసన ఇంతేహా కోసం ఎంచుకున్నాడు. ఆమె యూత్-ఓరియెంటెడ్ టెలి-సిరీస్ హిప్ హిప్ హుర్రేలో కనిపించింది. 2004లో, ఆమె తెలుగులో తరుణ్ కుమార్‌తో సఖియా చిత్రంలో నటించింది.
ఆమె తోటి నటి కోయెల్ పూరీతో కలిసి ఇండియా ఫ్యాషన్ వీక్, అలెన్ సోలీ ఫ్యాషన్ షోలకు హాజరయింది. 2007లో, ఆమె లైఫ్ మే కభీ కభీ, ADA...ఎ వే ఆఫ్ లైఫ్, మనీష్ ఝా దర్శకత్వం వహించిన అన్వర్ అండ్ లకీర్‌లో కూడా కనిపించింది.
ఆమె 2009లో కిసాన్, కుర్బాన్, 2012లో పురబ్ కోహ్లీ, కవిష్ మిశ్రాతో కలిసి కుచ్ స్పైస్ టు మేక్ ఇట్ మీఠాలో నటించింది.
వ్యక్తిగత జీవితం
మార్చుఆమె 2017 జనవరి 5న రుస్తోమ్ కాంట్రాక్టర్‌ని వివాహం చేసుకుంది.[4]
ఫిల్మోగ్రఫీ
మార్చుసినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | భాష |
---|---|---|---|
2003 | సుపారీ | దిల్నవాజ్ 'దిల్లు' | హిందీ |
ఇంతేహా | టీనా సక్సేనా | హిందీ | |
2004 | లకీర్ | బండియా | హిందీ |
సఖియా | చందన | తెలుగు | |
2006 | హాలిడే | సమర | హిందీ |
రాకింగ్ మీరా | మీరా | ఆంగ్ల | |
2007 | అన్వర్ | మెహ్రీన్ "మెహ్రూ" | హిందీ |
లైఫ్ మే కభీ కభీ | మోనికా సేథ్ | హిందీ | |
అగ్గర్ | రీతూ చౌదరి | హిందీ | |
2008 | సిర్ఫ్ | శాలు | హిందీ |
భూతనాథ్ | టీనా | హిందీ | |
రఫూ చక్కర్: ఫన్ ఆన్ ది రన్ | జూలీ విపున్ పటేల్ | హిందీ | |
2009 | 42 కి.మీ | దివ్య | హిందీ |
ఆస్మా: ది స్కై ఈజ్ ది లిమిట్ | దియా | హిందీ | |
లవ్ కా తడ్కా | హిందీ | ||
మీటింగ్ సే మీటింగ్ టాక్ | హిందీ | ||
బెట్చలర్ పార్టీ | తనూ | హిందీ | |
కిసాన్ | తిత్లీ కౌర్ | హిందీ | |
మెయిన్ ఔర్ శ్రీమతి ఖన్నా | నినా | హిందీ | |
కుర్బాన్ | సల్మా | హిందీ | |
2010 | అదా... ఎ వే ఆఫ్ లైఫ్ | గుల్ | హిందీ |
2012 | షిరిన్ ఫర్హాద్ కీ తో నికల్ పాడి | అనహిత | హిందీ |
కుచ్ స్పైస్ టు మేక్ ఇట్ మీఠా | తరానా | హిందీ | |
2014 | జై హో | సిమ్రాన్ చౌదరి | హిందీ |
2015 | జాన్ కీ బాజీ | హిందీ |
టెలివిజన్
మార్చుYear | Title | Role |
---|---|---|
1999 | హిప్ హిప్ హుర్రే | మీరా |
2000 | జస్ట్ మొహబ్బత్ | అతిథి పాత్ర |
2009 | ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి (సీజన్ 2) | |
2013 | వెల్కమ్ - బాజీ మెహమాన్-నవాజీ కి |
వెబ్ సిరీస్
మార్చుసంవత్సరం | టైటిల్ | పాత్ర |
---|---|---|
2021 | దేవ్ డిడి 2 | అదితి కపాడియా |
బొంబాయి బేగమ్స్ | పియా పున్వానీ | |
సిక్స్ | ఓర్వనా జోసెఫ్ |
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 Monika Baldwa, "'My idols are Kajol and Madhuri'" (June 05, 2003).
- ↑ Singh, Dipti (2023-11-05). "Sau saal pehle..." Mid-day (in ఇంగ్లీష్). Retrieved 2024-01-20.
- ↑ Sharma, Saubhagya (5 October 2019). "Remember Piya Basanti girl Nauheed Cyrusi? The actress hasn't aged at all and these photos are proof!". Timesnow news (in ఇంగ్లీష్). Retrieved 2019-10-10.
- ↑ "Popular VJ and Hip Hip Hurray actress Nauheed Cyrusi ties the knot". The Times of India (in ఇంగ్లీష్). 6 January 2017. Retrieved 2019-10-10.