సఖియా 2004, డిసెంబరు 2న విడుదలైన తెలుగు చలన చిత్రం. జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తరుణ్, నౌహీద్, లక్ష్మి, రంగనాథ్, ఆలీ, ఎమ్.ఎస్.నారాయణ, రాజా రవీంద్ర దువ్వాసి మోహన్ ముఖ్యపాత్రలలో నటించగా, మణిశర్మ సంగీతం అందించారు.[1][2]

సఖియా
దర్శకత్వంజయంత్ సి పరాన్జీ
రచనజయంత్ సి పరాన్జీ
పరిచూరి బ్రదర్స్
నిర్మాతఆర్. అప్పలరాజు, ఎకె అశోక్ కుమార్
తారాగణంతరుణ్, నౌహీద్, లక్ష్మి, రంగనాథ్, ఆలీ, ఎమ్.ఎస్.నారాయణ, రాజా రవీంద్ర
ఛాయాగ్రహణంజవహార్ రెడ్డి
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంమణిశర్మ
పంపిణీదార్లుసౌందర్య అర్ట్స్
విడుదల తేదీ
డిసెంబర్ 2
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ సవరించు

హరి అనే కుర్రాడు (తరుణ్‌) దుర్గాదేవి (లక్ష్మి)ని రైలులో దుండగుల నుంచి రక్షించే ప్రయత్నంలో అతని యాక్షన్‌ చూసి ముచ్చట పడి, అతనికి ఒక ఆసైన్‌మెంట్‌ అప్పగిస్తుంది. స్విట్జర్లాండ్‌లో ఉన్న తన కూతురు చందనను (నౌహిద్‌) తెసుకొచ్చి ఆమెకు అప్పగించడం ఆ అసైన్‌మెంట్‌. కుటుంబపరంగా డబ్బు అవసరమైన హరి ఆ పని ఒప్పుకుని రంగంలోకి దిగుతాడు. స్విట్జర్లాండ్‌ వెళ్లి రకరకాల నాటకాలాడి ఆ అమ్మాయిని ప్రేమలో పడేసి ఇండియాకు తీసుకొస్తాడు. అంత కష్టపడి తీసుకువచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఎవరో తెలిసుకుని హీరో ఆశ్చర్యపోతాడు. ఆమె దుర్గాదేవి కూతురు కాదు, ఆమె శత్రువు సిద్ధప్పనాయుడి కూతురు. దుర్గాదేవి తన కొడుక్కి ఆ అమ్మాయితో పెళ్ళి జరిపించడానికి ఆ పథకం వేసిందని గ్రహించడంతో ఇంటర్వెల్‌ పడుతుంది. చందనను దుర్గాదేవి బారి నుంచి రక్షించి తన ప్రేమను నిరూపించుకునే ప్రయత్నయే మిగిలిన కథ.[3]

నటవర్గం సవరించు

మూలాలు సవరించు

  1. తెలుగు ఫిల్మీబీట్. "సఖియా". telugu.filmibeat.com. Retrieved 25 March 2018.
  2. ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Sakhiya". www.idlebrain.com. Retrieved 25 March 2018.
  3. తెలుగు ఫిల్మీబీట్, సమీక్ష. "సఖియా సమీక్ష: సగటు సినిమా". telugu.filmibeat.com. జోశ్యుల సూర్యప్రకాష్‌. Retrieved 25 March 2018.

ఇతర లంకెలు సవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=సఖియా&oldid=3474927" నుండి వెలికితీశారు