న్యాలకొండ రామ కిషన్ రావు
న్యాలకొండ రామ కిషన్ రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్వపు మంత్రి, శాసనసభ్యుడు. అతను చొప్పదండి శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా మూడు సార్లు ఎన్నికయ్యాడు.[1] రాష్ట్ర ప్రభుత్వంలో అడవులు, పర్యావరణం, కాలుష్య నియంత్రణ శాఖా మంత్రిగా పనిచేసాడు.[2][3] అతను 1985 లో రికార్డు స్థాయిలో దాదాపు 42,000 మెజారిటీతో గెలిచాడు, ఇది రాష్ట్రమంతటా అత్యధిక మెజారిటీలో ఒకటిగా ఉంటూ 1994 వరకు కొనసాగింది.[4]
ఎన్.రామ కిషన్ రావు | |
---|---|
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, శాసన సభ్యుడు | |
వ్యక్తిగత వివరాలు | |
జననం | గంగాధర, కరీం నగర్, హైదరాబాదు రాష్ట్రం (ప్రస్తుతం తెలంగాణ, భారతదేశం) | 1940 మే 9
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ (1982–2004) |
ఇతర రాజకీయ పదవులు | భారత జాతీయ కాంగ్రెస్ (2005–2009) |
జీవిత భాగస్వామి | సుకన్యారావు |
సంతానం | ఎ.అనుపమారెడ్డి జె.అనురాధా రెడ్డి ఇ.అరవిందరెడ్డి |
కళాశాల | ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాదు |
అతను 1999 లో చాలా తక్కువ తేడాతో (1918 ఓట్లు) ఓడిపోయాడు, తరువాత 1999 తరువాత కరీంనగర్ జిల్లా బాధ్యతలు నిర్వర్తించినప్పటికీ అతను మళ్లీ పోటీ చేయలేదు. 2004 ఎన్నికలకు అభ్యర్థుల జాబితా నుండి ఆయనను మినహాయించడాం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఏర్పడి చర్చనీయాంశమైంది . పేదల సాధికారత పట్ల ఆయన దృఢమైన వైఖరి, అవినీతి రహిత ప్రజల నాయకుడిగా ఆయనకు ఉన్న గుర్తింపు, కరీంనగర్‌లో ఆయనపై పెరుగుతున్న ప్రజాభిమానం వంటి విషయాలు మొత్తం రాష్ట్ర రాజకీయాలు అన్నీ ఆయనను బహిష్కరించడానికి ఒక పాత్ర పోషించాయని చాలా మంది స్థానికులు పేర్కొన్నారు. అతను సూటిగా, నిజాయితీగా, ధైర్యంగా ఉండడం వల్ల పేద ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేయడం వల్ల తన సొంత పార్టీ నాయకుడిని వ్యతిరేకించే అవకాశం ఉందని చాలా మంది రాజకీయ ప్రతినిధుల అభిప్రాయం. ఇది అతను రాజకీయంగా పక్కకు తప్పుకోవడానికి ప్రధాన కారణం.
ఏది ఏమయినప్పటికీ, తన జీవితాంతం ప్రజా సేవ కోసం గడిపిన వ్యక్తి కావడంతో అతను 2004 వరకు ప్రజలకు చురుకుగా సేవలను కొనసాగించాడు. అతని ప్రజాదరణ, బలమైన ప్రజానుసరణ వంటివి చొప్పదండి స్థానిక అభ్యర్థి కాని సన మారుతికి (2004) సులువుగా ఎన్నికలలో గెలవడానికి దోహదం చేసింది, 2009 లో తన సొంత నియోజకవర్గం చోప్పదండికి రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల చివరకు ఆయన పూర్తిగా క్రియాశీల రాజకీయాల నుండి విరమించుకున్నాడు. 1994 లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడటంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. పార్టీ, దాని అధికారాన్ని ఎన్.టి.రామారావు నుండి ఎన్.చంద్రబాబు నాయుడుకు బదిలీ చేసిన కోర్-కమిటీ బృందానికి ఆయన నాయకత్వం వహించాడు. అతను ఎన్. టి. రామారావు. ఎన్. చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలలో వివిధ ముఖ్యమైన కమిటీల కొరకు పనిచేశాడు. రాజకీయాల నుండి నిష్క్రమించిన తరువాత కూడా ఆయన ప్రజా సేవా రంగంలో కొనసాగాడు. చోప్పదండి నియోజకవర్గ ఓటర్లను ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అతను గోనుకొండ బాబుపై విజయం సాధించటానికి 2009 లో సుద్దల దేవయ్యకు బహిరంగంగా మద్దతు ఇచ్చాడు. 2004 లో అవకాశం ఇచ్చిన సనా మారుతి, చోప్పదండి నియోజకవర్గంలో అతను ఎంత ప్రభావవంతమైన వ్యక్తి అనేదానికి ఒక ఉదాహరణ కూడా. ఎల్.రమణ, సాయి రెడ్డి, సనా మారుతి తదితరులకు ఆయన రాజకీయాలకు పరిచయం చేశాడు.
నిర్వహించిన పదవులు
మార్చు- సర్పంచ్ (1973-1978)
- సమితి ఉపాధ్యక్షుడు (1978-1983)
- ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ శాసనసభ్యుడు (1985-1989)
- ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ శాసనసభ్యుడు (1989-1994)
- అడవులు, పర్యావరణం, కాలుష్య నియంత్రణ శాఖా మంత్రి (1997-1999)
- ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ శాసనసభ్యుడు (1994-1999)
- కరీం నగర్ జిల్లా ఎన్నికల ఎన్ ఛార్జి (1999-2004) [5]
వ్యక్తిగత జీవితం
మార్చుకిషన్ రావు 1940 మే 9న తెలంగాణ రాష్ట్రంలోని కరీం నగర్ జిల్లాకు చెంచిన గంగాధర గ్రామంలో న్యాలకొండ జనార్థనరావు బహదూర్ రెడ్డి, సునందారావు బహదూర్ రెడ్డి దంపతులకు జన్మించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డిగ్రీని పూర్తి చేసి తెలంగాణ ఉద్యమంలో పనిచేసాడు. అతను సుకన్యారెడ్డిని వివాహమాడాడు. అతనికి ముగ్గురు కుమార్తెలు: అనుపమారెడ్డి, అనురాధారెడ్డి, అరవిందరెడ్డి. అతని చిన్నాన్న న్యాలకొండ శ్రీపతి రావు కూడా 1978 నుండి 1983 వరకు శాసనసభ్యునిగా పనిచేసాడు.
మూలాలు
మార్చు- ↑ "Choppadandi Vidhan sabha assembly election results in Andhra Pradesh". elections.traceall.in. Retrieved 2016-05-18.[permanent dead link]
- ↑ "TDP men on Rampage". The Hindu. 30 March 2004. Retrieved 9 June 2019.[dead link]
- ↑ Eenadu. "ఇద్దరికి అమాత్యయోగం". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ "Election report of Andhra Pradesh". Election.in. 17 December 2013. Archived from the original on 8 నవంబరు 2017. Retrieved 7 November 2017.
- ↑ "Irrigation expert makes political debut". The Hindu. 2004-04-02. Retrieved 26 May 2016.[dead link]