న్యూఢిల్లీ కాళిబరి దేవాలయం

న్యూఢిల్లీలో ఉన్న కాళీకాదేవి దేవాలయం.

న్యూఢిల్లీ కాళిబరి దేవాలయం, న్యూఢిల్లీలో ఉన్న కాళీకాదేవి దేవాలయం. 1930లలో స్థాపించబడిన ఈ దేవాలయం, లక్ష్మీనారాయణ దేవాలయానికి (బిర్లా మందిర్) సమీపంలో ఉంది.

న్యూఢిల్లీ కాళిబరి దేవాలయం
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:న్యూఢిల్లీ
జిల్లా:ఢిల్లీ
ప్రదేశం:ఢిల్లీ

చరిత్ర మార్చు

దేశ రాజధాని న్యూఢిల్లీలో బెంగాలీ జనాభా పెరుగుతున్న నేపథ్యంలో అనేక సంవత్సరాల అభ్యర్థనల తరువాత, లక్ష్మీనారాయణ దేవాలయం పక్కన దేవాలయ రహదారిలో ఒక ఎకరం భూమి కేటాయించబడింది. కొల్‌కత్తాలోని కాళీఘాట్ కాళీ ఆలయంలో ఉన్న ప్రతిమ (విగ్రహం)తో కాళీ దేవి రూపంలో దేవి విగ్రహాన్ని రూపొందించారు. మందిరం కమిటీ 1935లో సుభాష్ చంద్రబోస్ మొదటి అధ్యక్షుడిగా అధికారికీకరించబడింది.[1] మొదటి మందిర భవనాన్ని సర్ జస్టిస్ మన్మథ నాథ్ ముఖర్జీ ప్రారంభించాడు. కొంతకాలం తరువాత అధికార యంత్రాంగం మరో భవనాన్ని ఏర్పాటు చేసింది. బెంగాలీ పర్యాటకులు అక్కడ బస చేయడానికి వసతి గదులు ఉన్నాయి. ఇందులో ఒక గ్రంథాలయం కూడా ఉంది.

దుర్గా పూజ మార్చు

ఈ దేవాలయంలో జరుపుకునే దుర్గా పూజ, నగరంలోని పురాతన దుర్గా పూజలలో ఒకటి. ఇది 1925లో ప్రారంభమైంది. కాళిబరి అసలు దేవాలయం బైర్డ్ రోడ్ (నేటి బంగ్లా సాహిబ్ రోడ్)లో ఉంది, ఇక్కడ స్థానిక బెంగాలీ సంఘం వార్షిక దుర్గా పూజల కోసం వస్తారు. 1931 తర్వాత ప్రస్తుత దేవాలయం వచ్చిన తర్వాత అది ఇక్కడికి మార్చబడింది. ఢిల్లీలోని వందలాది పూజా కమిటీలకు ఇది నోడల్ పాయింట్‌గా కొనసాగుతోంది, ఢిల్లీ బెంగాలీలలో విస్తృతంగా గౌరవించబడుతుంది.[2][3] 1910లో ప్రారంభమైన ఢిల్లీ దుర్గా పూజా సమితి నిర్వహించే కాశ్మీరీ గేట్ వద్ద ఢిల్లీలోని పాత పూజలు మాత్రమే జరుగుతున్నాయి. తిమార్‌పూర్ లో 1914లో సివిల్ లైన్స్ పూజా సమితి ద్వారా నిర్వహించబడిన తిమార్‌పూర్ పూజ.[4] 1936 నుండి పూజ ఆచారాలు కూడా మారలేదు. రవీంద్ర సంగీతం, పారాయణంలో సాంప్రదాయ పోటీలు ఇప్పటికీ నిర్వహించబడుతున్నాయి. పూజా పండల్‌ను నిర్మించేందుకు కోల్‌కతా నుండి కళాకారులను రప్పిస్తారు.[5][6]

ప్రదేశం మార్చు

న్యూఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌కు పశ్చిమంలో ఈ దేవాలయం ఉంది. స్థానికంగా ఉండే బస్సులు, టాక్సీలు, ఆటో-రిక్షాల ద్వారా ఢిల్లీ నగరం నుండి సులభంగా చేరుకోవచ్చు. సమీపంలోని ఢిల్లీ మెట్రో స్టేషన్ నుండి సుమారు 2 కి.మీ.ల దూరంలో ఉంది.

మూలాలు మార్చు

  1. "Archived copy". Archived from the original on 1 November 2011. Retrieved 2022-06-20.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  2. "Kali Bari website to help old bond with the new". Hindustan Times. 21 February 2011. Archived from the original on 25 January 2013.
  3. "Delhi's old timers remember as another Durga Puja dawns". Monsters and Critics. 16 October 2007.[permanent dead link]
  4. "How community pujas came about". India Today. 25 September 2009.
  5. "Tradition fuses with modernity". The Times of India. 3 October 2011. Archived from the original on 14 December 2013.
  6. "Festive spirit pervades the Capital". The Hindu. 15 October 2007. Archived from the original on 17 October 2007.

బయటి లింకులు మార్చు