న్యూ మార్కెట్ మెట్రో స్టేషను
న్యూ మార్కెట్ మెట్రో స్టేషను, హైదరాబాదులోని న్యూ మార్కెట్ ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను 2018లో ప్రారంభించబడింది.[2][3] సుశ్రుత హాస్పిటల్, పాల్టన్ రోడ్, మలక్‌పేట్ గంజ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్సార్ పెట్రోల్ పంప్, విజయ బ్యాంక్, జామియా మసీదు వీధికి సమీపంలో ఈ మెట్రో స్టేషను ఉంది.
న్యూ మార్కెట్ మెట్రో స్టేషను | |
---|---|
హైదరాబాదు మెట్రో స్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | 16-2-689/3, జాతీయ రహదారి 65, పాల్టన్ రోడ్, దయానంద్ నగర్, న్యూ మలక్‌పేట్, హైదరాబాదు, తెలంగాణ- 500036[1] |
లైన్లు | ఎరుపురంగు లైను |
ఫ్లాట్ ఫారాలు | 2 |
పట్టాలు | 2 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | పైకి |
Platform levels | 2 |
History | |
Opened | సెప్టెంబరు 24, 2018 |
చరిత్ర
మార్చు2018, సెప్టెంబరు 24న ఈ మెట్రో స్టేషను ప్రారంభించబడింది.
స్టేషను వివరాలు
మార్చునిర్మాణం
మార్చున్యూ మార్కెట్ ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉంది.
సౌకర్యాలు
మార్చుస్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.[4]
స్టేషను లేఔట్
మార్చు- కింది స్థాయి
- ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[5]
- మొదటి స్థాయి
- టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, శౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[5]
- రెండవ స్థాయి
- ఇది రెండు ప్లాట్‌ఫారమ్‌లను కలిగి ఉంటుంది. ఇక్కడి నుండి రైళ్ళు ప్రయాణికులను తీసుకువెళతాయి.[5]
జి | స్థాయి | నిష్క్రమణ/ప్రవేశం |
ఎల్ 1 | మెజ్జనైన్ | ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్ |
ఎల్ 2 | సైడ్ ప్లాట్‌ఫాం తలుపులు ఎడమవైపు తెరుచుకుంటాయి | |
సౌత్‌బౌండ్ | → ముసారంబాగ్ → → ఎల్.బి. నగర్ → వైపు | |
నార్త్‌బౌండ్ | → వైపు ← మియాపూర్ ← మలక్‌పేట ← | |
సైడ్ ప్లాట్‌ఫాం తలుపులు ఎడమవైపు తెరుచుకుంటాయి | ||
ఎల్ 2 |
రైలు సర్వీసులు
మార్చుఈ స్టేషన్ గుండా మియాపూర్ - ఎల్.బి. నగర్ ల మధ్య ప్రతి 3.5 - 7 నిమిషాలకు మూడు కోచ్ రైళ్ళు నడుస్తాయి.
మూలాలు
మార్చుఇతర లంకెలు
మార్చువికీమీడియా కామన్స్‌లో Hyderabad Metro Railకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
- హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ Archived 2018-11-03 at the Wayback Machine
- అర్బన్ రైల్. నెట్ - ప్రపంచంలోని అన్ని మెట్రో వ్యవస్థల వివరణలు, అన్ని స్టేషన్లను చూపించే స్కీమాటిక్ మ్యాప్.