పంచరత్న కృతులు

ఐదు కృతుల కలయిక

పంచరత్న కృతులు త్యాగరాజు కర్ణాటాక సంగీతానికి అందించిన ఐదు రత్నాల వంటి కీర్తనలు.శ్రీత్యాగరాజస్వామి స్వరపరచిన ఈ ఐదు కృతులను పంచరత్న కృతులను "త్యాగరాజ పంచ రత్నాలు" అనడం కూడా కద్దు. 19 వ శతాబ్దంలో శాస్త్రీయ సంగీతానికి ప్రాణం పోసిన త్రిమూర్తి వాగ్గేయకారులలో ఒకడైన త్యాగయ్య అందించిన వేలాది కీర్తనలలో రత్నాల వంటివి. ఈ వేలాది కీర్తనలలో 750 కీర్తనలు లభించుచున్నాయి. త్యాగరాజు కీర్తనలు తేలికైన తేట తెలుగున పండిత పామురులకు అర్థం అయ్యే రీతిన కూర్చిన శ్రీరామ కీర్తనలు.

Tyagaraja.jpg
శ్రీత్యాగరాజస్వామి

పంచరత్న కీర్తనలు మార్చు

ఐదు పంచ రత్న కీర్తనలు ఆది తళానికి కూర్చబడ్డాయి. పంచరత్న కీర్తనలు పాడే రాగం వాటి సాహిత్యం, భావాన్ని అనుసరించి ఉంటాయి. ఈ ఐదు కీర్తనలు సంగీత కచేరి లొని రాగం , తానం , పల్లవి పాడేందుకు వీలుగా సంగీత ఉద్ధండులు కల్పనా స్వరాలు పాడేందుకు వీలుగా ఊంటాయి.

త్యాగయ్య వారి పంచ రత్న కీర్తనలు వరుసలో
  1. జగదానందకారక - నాట రాగం
  2. దుడుకుగల నన్నే - గౌళ రాగం
  3. సాధించనే ఓ మనసా - అరభి రాగం
  4. కనకనరుచిరా - వరాళి రాగం
  5. ఎందరోమహానుభావులు - శ్రీ రాగం

పంచరత్న కృతులు పాడే నట గౌళ అరభి వరాళి శ్రీ రాగాలను గాన పంచక రాగాలు అని పిలుస్తారు. వీటికి సంబంధించిన తానం వీణ పై వాయించడానికి చాలా అనువుగా ఉంటాయి. నాట, వరాళి రాగాలకు 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నది.

పంచరత్న కృతుల ప్రత్యేకతలు మార్చు

జగదానంద కారక: పంచరత్నాలలో మొదటిది-నాట రాగకృతి. ఇది 36వమేళకర్త రాగమైన చలనాట జన్యం. శారంగదేవుని సంగీత రత్నాకరం పేర్కొన్న గొప్పరాగాలలో ఇది ఒకటి. ఈ రాగంలో షడ్జ, పంచమాలతో పాటు షట్ శృతి దైవతం, కాకలి నిషాదం ఉన్నాయి.
ఈ కృతికి ఎన్నుకున్న భాష -సంస్కృతం.భావం:జగదానంద కారకుడైన శ్రీరాముని వర్ణనం. ధీరోదాత్త గుణశోభితుడైన శ్రీరాముని సంబోధనాత్మక కృతి ఇది.నాట రాగ అనువుగా-ఎంతో హృద్యంగా అమరింది.
దుడుకుగల నన్నే: పంచరత్నాలలో రెండవది-గౌళ రాగంలోని కృతి. ఇది 15వ మేళకర్త మాయామాళవగౌళ జన్యం. షడ్జ, పంచమాలతో పాటు శుద్ధ రిషభం ,అంతర గాంధారం ,శుద్ధ మధ్యమం ,శుద్ధ దైవతం ,కాకలి నిషాదం గల రాగం. దీనిలో రిషభం రాగచ్ఛాయగల ఏకశృతిరిషభం. పాడేటప్పుడు దీన్ని ప్రత్యేకంగా పలుకుతారు. కనుక దీనిని గౌళ రిషభం అని అంటారు.
సాహిత్యం చూస్తే, దుడుకు చేష్టలున్న అనే పద ప్రయోగం; ఆ వెంటనే ఏ దొర కొడుకు బ్రోచు? అనే పదప్రయోగం నవ్వు పుట్టిస్తాయి. కాని, ఇదొక ఆత్మ విమర్శా ‍‍జ్ఞానం. దీనిలో చరణాలు కూడా అదే ధోరణిలో సాగుతాయి.

మూలాలు మార్చు

  • శ్రీ త్యాగరాజస్వామి ఘనరాగ పంచరత్న కీర్తనలు (ప్రతిపదార్థ తాత్పర్య స్వరసాహిత్య సహితము), మహామహోపాధ్యాయ డా. నూకల చిన్నసత్యనారాయణ, హైదరాబాదు, 2003.