పంజాబ్ లో క్రీడలు
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
పంజాబ్ ప్రజలు కొత్తగా పుట్టిన హాకీ, క్రికెట్ మొదలుకొని భారతదేశ ప్రాచీన ఆటలైన కబడ్డీ, కుస్తీ మొదలైన అనేక రకాలైన ఆటలు ఆడతారు. పంజాబ్ లో కనీసం వందకు పైగా సాంప్రదాయ ఆటలున్నాయి.[1]
పంజాబ్ సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించేందుకు వారి ప్రభుత్వం 2014 నుంచి అనేక ప్రయత్నాలు చేపడుతోంది. ఇందులో కుస్తీ పోటీల్లాంటి ఎన్నో ఆటలున్నాయి.[2]
క్రికెట్
మార్చుపంజాబ్ లోని క్రికెట్ బాగా ప్రాచుర్యం పొందిన క్రీడ. రాష్ట్రస్థాయిలో పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ క్రీడను నిర్వహిస్తుంటుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఈ రాష్ట్రం నుంచి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఆడుతుంది. ఇక్కడి మొహాలీ స్టేడియంలో జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్ లు నిర్వహించబడుతూ ఉంటాయి.
గట్కా
మార్చుగట్కా అనేది సిక్కులు తయారు చేసి, అభివృద్ధి చేసిన ప్రాచీన యుద్ధ శిక్షణా క్రీడ. ఇది దక్షిణ ఆసియాలో చాలా ప్రసిద్ధమైనది. కొన్ని చోట్ల కత్తులకు బదులు కర్రలు వాడి శిక్షణ ఇస్తారు.[3] ఉత్తర భారతంలోని వాయువ్య రాష్ట్రాల శస్త్ర విద్య ఇది. వేర్వేరు ప్రాంతాల్లో దాడి, ప్రతిదాడులు మారతాయిగానీ, ప్రాథమిక టెక్నిక్ మాత్రం మారదు.
కబడ్డీ
మార్చుపంజాబ్ వలయాకార కబడ్డీ
మార్చువలయాకారంలో ఆడే కబడ్డీ పంజాబ్ రాష్ట్ర క్రీడ. ఇది కబడ్డీలో ఒక రకం.
కబడ్డీ వరల్డ్ కప్
మార్చువలయాకార పంజాబీ స్టైల్ లో పంజాబ్ రాష్ట్రం 2010 నుండి కబడ్డీ వరల్డ్ కప్ ను నిర్వహిస్తోంది. 2014 పురుషుల కబడ్డీ వరల్డ్ కప్ ఫైనల్ లో భారత్, పాకిస్థాన్ జట్లు ఆడాయి. 45-42 తేడాతో భారత్ ఈ ఫైనల్స్ లో గెలిచింది.[4] స్త్రీల ఫైనల్ లో భారత్, న్యూజిల్యాండ్ పోటీపడగా, 36-27 తేడాతో భారత జట్టు గెలిచింది.
ముగింపు కార్యక్రమం శ్రీ ముక్త్ సర్ సాహిబ్ లోని గురు గోబింద్ సింగ్ స్టేడియంలో జరిగాయి. పంజాబీ సినిమా తారలు ఆరిఫ్ లోహర్, మిస్ పూజ, గిప్పీ గ్రెవల్, సతిందెర్ సట్టి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అమెరికన్ మోటార్ సైకిల్స్ ప్రదర్శన కూడా జరిగింది.[5]
పంజాబ్ ప్రముఖ క్రీడాకారులు
మార్చుఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Khed ate sehat varta by Sarwan Singh Sangam Publications ISBN 93-82804-98-6
- ↑ Times of India 30 08 2014
- ↑ Donn F. Draeger and Robert W. Smith (1969). Comprehensive Asian Fighting Arts. Kodansha International Limited.
- ↑ "Zee News 20 12 2014". Archived from the original on 2016-07-23. Retrieved 2016-08-02.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-02-26. Retrieved 2016-08-02.