పందెం కోడి 2 2018లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాలో విశాల్‌ , కీర్తి సురేష్‌, రాజ్‌ కిరణ్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 18 అక్టోబర్ 2018న విడుదలైంది.[1]

పందెం కోడి -2
దర్శకత్వంఎన్‌. లింగుస్వామి
నిర్మాతవిశాల్‌, దవళ్‌ జయంతిలాల్‌ గడా, అక్షయ్‌ జయంతిలాల్‌ గడా
తారాగణంవిశాల్‌ , కీర్తి సురేష్, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్
ఛాయాగ్రహణంకేఏ శ‌క్తివేల్
కూర్పుప్రవీణ్ కె. ఎల్.
సంగీతంయువ‌న్ శంక‌ర్ రాజా
నిర్మాణ
సంస్థలు
లైట్‌హౌస్‌ మూవీ మేకర్స్‌ ఎల్‌ఎల్‌పి, విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్, పెన్‌ స్టూడియోస్
విడుదల తేదీ
2018 అక్టోబరు 18 (2018-10-18)
సినిమా నిడివి
160 నిముషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ సవరించు

రాయ‌ల‌సీమ‌లోని ఒక ప్రాంతంలోని వాళ్లంతా క‌ల‌సి ప్ర‌తీ యేడూ వీర‌భ‌ద్రుడి జాత‌ర జ‌రుపుకోవ‌డం ఆన‌వాయితీ. ఓ జాత‌ర‌లో జ‌రిగిన చిన్న‌ గొడ‌వ‌ ఆ ఊర్ల మ‌ధ్య చిచ్చు రేపుతుంది. భ‌వానీ (వ‌ర‌ల‌క్ష్మి) త‌న భ‌ర్త‌ని కోల్పోతుంది. దాంతో ప‌గ‌తో ర‌గిలిపోయిన భ‌వానీ త‌న భ‌ర్త‌ని చంపిన గోపీనీ, అత‌ని వంశాన్నీ నాశ‌నం చేయాల‌ని శ‌ప‌థం పూనుతుంది. ఏడేళ్ల నుంచి వీర‌భ‌ద్రుని జాత‌ర జ‌ర‌క్కుండా ఆపేస్తుంది.రాయ‌ల‌సీమ క‌రువుతో అల్లాడిపోతుంది. అక్క‌డ వ‌ర్షాలు ప‌డాలంటే వీర‌భ‌ద్రుణ్ని శాంతింప‌జేయాల‌ని, అలా జ‌ర‌గాలంటే జాత‌ర చేయాల‌ని రాజారెడ్డి (రాజ్ కిరణ్) నిర్ణ‌యించుకుంటాడు.ఇలాంటి సమయంలో అతని కొడుకు బాలు (విశాల్) తిరిగి సొంత ఊరికి వస్తాడు. మ‌రి ఈసారైనా జాత‌ర స‌వ్యంగా జరిగిందా? లేదా అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు సవరించు

సాంకేతిక నిపుణులు సవరించు

 • బ్యాన‌ర్స్‌: లైట్‌హౌస్‌ మూవీ మేకర్స్‌ ఎల్‌ఎల్‌పి
  విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ
  లైకా ప్రొడక్షన్స్‌
  పెన్‌ స్టూడియోస్
 • నిర్మాతలు: విశాల్‌
  దవళ్‌ జయంతిలాల్‌ గడా
  అక్షయ్‌ జయంతిలాల్‌ గడా
 • రచన & దర్శకత్వం: ఎన్‌.లింగుస్వామి
 • సంగీతం: యువ‌న్ శంక‌ర్ రాజా
 • ఛాయాగ్రహణం : కేఏ శ‌క్తివేల్
 • ఎడిటింగ్: ప్రవీణ్ కె. ఎల్
 • స‌మ‌ర్ప‌ణ‌: ఠాగూర్ మ‌ధు [4]
 • మాటలు: రాజేష్ ఏ. మూర్తి

మూలాలు సవరించు

 1. Deccan Chronicle (21 October 2018). "Pandem Kodi 2 Impresses". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 17 June 2021. Retrieved 17 June 2021.
 2. Sakshi (18 October 2018). "'పందెం కోడి 2‌' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 18 October 2018. Retrieved 17 June 2021.
 3. The Times of India (18 October 2018). "Varalaxmi dubs in Telugu for the first time - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 30 October 2018. Retrieved 17 June 2021.
 4. Telangana Today (15 October 2018). "'I am a Pandem Kodi fan'". archive.telanganatoday.com. Archived from the original on 17 June 2021. Retrieved 17 June 2021.