పగ సాధిస్తా (1970 సినిమా)

తను స్నేహితుడిగా నమ్మి అతని కోసం చెయ్యని నేరాన్ని తనమీద వేసుకుని జైలుకు వెళతాడు నాయకుడు. కానీ ఆ స్నేహితుడే అతనిని మోసం చేసి, అతని కుటుంబం నాశనం కావడానికి కారకుడౌతాడు. నాయకుడు జైలు నుండి బయటకు వచ్చే సరికి ఆ స్నేహితుడు సంఘంలో చాలా పెద్ద వ్యక్తి అయిపోతాడు. పరిస్థితులను ఎదుర్కొని అతని మీద పగ ఎలా సాధిస్తాడు అనేది ఈ చిత్ర కథాంశం.

పగసాధిస్తా
(1970 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.వి.ఎస్.కుటుంబరావు
నిర్మాణం వై.వి.రావు
తారాగణం కృష్ణ,
విజయనిర్మల
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ రవి చిత్ర ఫిల్మ్స్
విడుదల తేదీ మే 28,1970
భాష తెలుగు

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

పాటలు మార్చు

  1. అమ్మో ఓ శమ్మో ఓ శమ్మో శూశావా ఓయబ్బో అబ్బబ్బో - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
  2. ఈబిగువు ఈ తగవు కొత్తది కాదయ్యా మగువల మనసు - పి.సుశీల - రచన: వీటూరి
  3. ఓ మై డార్లింగ్ నన్ను విడిచి - పిఠాపురం నాగేశ్వరరావు, స్వర్ణలత, బి.వసంత - రచన: అప్పలాచార్య
  4. చిట్టి చిట్టి పాపా నా చిన్నారి పాపా చందమామకంటె - పి.సుశీల - రచన: దాశరథి
  5. నే ముద్దాడనా నీ తనివి తీర్చనా కోరే నిషాలో కులికే - ఎస్. జానకి - రచన: ఆరుద్ర
  6. మనసు ఉయ్యాల తనువు జంపాలా మధువు కావాలా - పి.సుశీల - రచన: డా.సి.నారాయణరెడ్డి

బయటి లింకులు మార్చు