పచ్చని కాపురం 1985 లో వచ్చిన రొమాంటిక్ డ్రామా చిత్రం. తాతినేని రామారావు దర్శకత్వంలో శ్రీ రాజా లక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ కోసం మిద్దే రామారావు నిర్మించాడు. ఇందులో కృష్ణ, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించగా,[1] కొంగర జగ్గయ్య, కాంతారావు, షావుకారు జానకి, మాస్టర్ అర్జున్ ఇతర ఇతర పాత్రలను పోషించారు. ఈ చిత్రం 1985 లో వచ్చిన బాలీవుడ్ సినిమా ప్యార్ ఝుక్తా నహీకి రీమేక్.

పచ్చని కాపురం
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం తాతినేని రామారావు
నిర్మాణం మిద్దే రామారావు
రచన సత్యానద్, తాతినేని రామారావు
తారాగణం కృష్ణ,
శ్రీదేవి,
జగ్గయ్య
సంగీతం కె. చక్రవర్తి
ఛాయాగ్రహణం ఎ. వెంకట్
కూర్పు డి. వెంకటరత్నం
నిర్మాణ సంస్థ శ్రీ రాజ్యలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

ఈ చిత్ర సౌండ్‌ట్రాక్‌ను చక్రవర్తి స్కోర్ చేసి, కంపోజ్ చేశాడు. ఈ చిత్రం 1985 సెప్టెంబరు 6 న విడుదలై సానుకూల సమీక్షలు పొందింది. ఇది బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించింది.[2]

తారాగణం మార్చు

పాటలు మార్చు

  1. కొత్తగా మత్తుగా - కె.జె. యేసుదాస్, ఎస్.జానకి
  2. ముక్కు మీధ కోపం - పి. సుశీల
  3. వెన్నెలైనా చీకటైనా ("మగ") - కెజె యేసుదాస్
  4. వెన్నెలైనా చీకటైనా ("ఆడ") - ఎస్.జానకి
  5. వెన్నెలైనా చీకటైనా ("యుగళగీతం") - ఎస్.జానకి, కె.జె. యేసుదాస్
  6. నా ప్రేమ రాగం - కె.జె. యేసుదాస్, ఎస్.జానకి

మూలాలు మార్చు

  1. "Pachani Kapuram Cast and Crew". Archived from the original on 2020-07-27. Retrieved 2020-08-25.
  2. Murali Krishna CH (26 February 2018). "Sridevi, the darling of Telugu Cinema". Archived from the original on 8 జూలై 2020. Retrieved 28 July 2020.