పఠాన్‌కోట్ జిల్లా

పంజాబ్ రాష్ట్రంలోని జిల్లా

పంజాబు రాష్ట్రం లోని 22 జిల్లాలలో పఠాన్‌కోట్ (పంజాబీ: ਪਠਾਣਕੋਟ ਜ਼ਿਲ੍ਹਾ) జిల్లా ఒకటి. ఈ జిల్లా 2011 జూలై 27న ఏర్పాటైంది.

పఠాన్ కోట్ జిల్లా
ਪਠਾਣਕੋਟ ਜ਼ਿਲ੍ਹਾ
జిల్లా
డునెరా సమీపంలో ప్రకృతి దృశ్యం
డునెరా సమీపంలో ప్రకృతి దృశ్యం
Located in the northwest part of the state
Location in Punjab, India
దేశం India
రాష్ట్రంపంజాబ్
జిల్లాపఠాన్‌కోట్
Named forపఠానియా రాజపుత్రుల కోట పేరిట
ముఖ్య పట్టణంపఠాన్‌కోట్
భాషలు
 • అధికారికగుర్ముఖి
 • ప్రాంతీయపంజాబీ
 • ఇతరఇంగ్లీషు
Time zoneUTC+5:30 (IST)
145001
145001
Vehicle registrationPB35

భౌగోళికం మార్చు

పఠాన్‌కోట్ శివాలిక్ పర్వతశ్రేణి పాదాల వద్ద ఉంది. జిల్లా పాకిస్తాన్ దేశానికి చెందిన నరోవల్ జిల్లాతో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటుంది. అంతేకాక జిల్లా సరిహద్దులలో హిమాచల్ ప్రదేశ్ లోని చంబా, కాంగ్ర, జమ్మూ కాశ్మీర్ లోని కథువా జిల్లాలు ఉన్నాయి. జిల్లాలో ప్రధానంగా బియాస్, రావి నదులు ప్రవహిస్తున్నాయి.

చరిత్ర మార్చు

పఠాన్‌కోట్ పాటియాలా రాజపుత్రులు పాలించిన నూర్పూర్ రాజాస్థానానికి రాజధానిగా ఉంటూ వచ్చింది. ముగల్ చరిత్రకారులు దీనిని పైఠాన్ (ప్రతిష్ఠానపురం ) అనేవారు. రాజా వాసుదేవ్ కాలంలో (1580-1613) లో రాజధాని పఠాన్‌కోట నుండి ధమేరికి తరలించాడు.[1][2] సిఖ్ఖుల 12 మంది మిస్లులలో ఒకరైన కన్హయ్యా మిస్ల్ ఈ ప్రాంతాన్ని 1781-1796 వరకు పాలించాడు. తరువాత గుజ్రన్‌వాలాకు చెందిన రంజిత్ సింగ్ ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. 1849 వరకు ఇది సిఖ్ఖుల ఆధీనంలో ఉంది. తరువాత ఇది బ్రిటిష్ ఆధీనంలోకి వచ్చింది. జిల్లాలోని ధరివాల్, జపువాల్, గురుదాస్ నంగల్ గ్రామాలు సిఖ్ఖుల చరిత్రతో సంబంధితమై ఉన్నాయి.

ప్రస్తుత జిల్లా మార్చు

పఠాన్‌కోట్ మునుపు గురుదాస్పూర్ జిల్లాలో భాగంగా ఉండేది. 2011 జూలై 27న దీన్ని పంజాబు రాష్ట్రంలో 22వ జిల్లాగా ఏర్పాటు చేసారు. [3][4] పఠాన్‌కోట్ జిల్లాలో పఠాన్‌కోట్, ధర్ కలన్ అనే 2 విభాగాలున్నాయి. నార్‌కోట్ జైమల్ సింగ్, బమియల్ అనే 2 తాలూకాలున్నాయి. [4] జిల్లాలో 421 గ్రామాలు ఉన్నాయి. జిల్లాకు కేంద్రంగా పఠాన్‌కోట్ ఉంది. ఇది సైనికుల నగరంగా పేరు పొందింది.

ప్రముఖులు మార్చు

పేరు వృత్తి
మాస్టర్ మోహన్ లాల్ రవాణా మంత్రి
దేవ్ ఆనంద్ నటుడు
తేజి గ్రోవర్ కవయిత్రి

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. The Princely and Noble Families of the Former Indian Empire: Himachal Pradesh V. 1 By Mark Brentnall, Indus Publishing, p. 350
  2. History of the Panjab Hill States By J. Hutchison, J.P. Vogel, Asian Educational Services, p. 213
  3. Naveen S. Garewal (27 July 2011). "Eye on urban voter, Fazilka, Pathankot made districts". The Tribune, Chandigarh. Retrieved 23 January 2012.
  4. 4.0 4.1 News services (28 July 2011). "The state gets Fazilka and Pathankot districts". Indian Express. Retrieved 23 January 2012.

వెలుపలి లంకెలు మార్చు