పఠాన్ (సినిమా)
పఠాన్ అనేది సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రాబోతున్న భారతీయ హిందీ భాష యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. ఇందులో షారూఖ్ ఖాన్, దీపికా పదుకొణె, జాన్ అబ్రహం ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి ఆనంద్ కథ, శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లే కాగా యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మించారు.[1]
పఠాన్ | |
---|---|
దర్శకత్వం | సిద్ధార్థ్ ఆనంద్ |
స్క్రీన్ ప్లే | శ్రీధర్ రాఘవన్ |
కథ | సిద్ధార్థ్ ఆనంద్ |
నిర్మాత | ఆదిత్య చోప్రా |
తారాగణం | |
ఛాయాగ్రహణం | సచ్చిత్ పాలోస్ |
కూర్పు | ఆరిఫ్ షేక్ |
సంగీతం | విశాల్–శేఖర్ |
నిర్మాణ సంస్థ | యష్ రాజ్ ఫిల్మ్స్ |
పంపిణీదార్లు | యష్ రాజ్ ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 25 జనవరి 2023 |
దేశం | ఇండియా |
భాష | హిందీ |
ఈ చిత్రం 2023 జనవరి 25న తమిళం, తెలుగులో డబ్బింగ్ వెర్షన్‌లతో పాటు భారతదేశంలో విడుదల అయింది.[2] విడుదలైన మొదటి పదిరోజుల్లోనే రూ.729కోట్ల గ్రాస్ రాబట్టింది. దీంతో పఠాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లని సాధించిన ప్రథమ హిందీ చిత్రంగా నిలిచినట్టయింది.[3]
తారాగణం
మార్చు- షారుఖ్ ఖాన్
- దీపికా పదుకొణే
- జాన్ అబ్రహం
- అశుతోష్ రాణా
- గౌతమ్ రోడ్
- డింపుల్ కపాడియా
- సిద్ధాంత్ ఘెగద్మల్
- షాజీ చౌదరి
- ప్రకాష్ బెలవాడి
- విరాఫ్ పటేల్
- కీత్ సెక్వేరా
- గేవీ చాహల్
- సల్మాన్ ఖాన్ (అతిథి పాత్ర)
- హృతిక్ రోషన్ (అతిథి పాత్ర)
వివాదం
మార్చుపఠాన్ మూవీ నుంచి 2022 డిసెంబరు 12న రిలీజైన బేషరమ్ రంగ్.. సాంగ్ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ పాటలో దీపికా ధరించిన కాస్ట్యూమ్స్‌పై అభ్యంతరంతో పాటు అశ్లీలం మోతాదు మించిందని ఈ మూవీని బ్యాన్ చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.[4]
మూలాలు
మార్చు- ↑ "Pathaan: 'పఠాన్' ఫస్ట్‌లుక్". web.archive.org. 2022-12-15. Archived from the original on 2022-12-15. Retrieved 2022-12-15.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "షారుక్ ఖాన్ పఠాన్ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ విడుదల తేదీ వచ". web.archive.org. 2022-12-15. Archived from the original on 2022-12-15. Retrieved 2022-12-15.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "'పఠాన్' వసూళ్లు రూ.729కోట్లు". web.archive.org. 2023-02-05. Archived from the original on 2023-02-05. Retrieved 2023-02-05.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "షారుఖ్, దీపికాపై పెరుగుతున్న ట్రోలింగ్.. అసభ్యకరమైన సీన్లపై మంత్రి వార్నింగ్, సినిమానే తొలగిస్తాం". web.archive.org. 2022-12-15. Archived from the original on 2022-12-15. Retrieved 2022-12-15.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)