పత్తిగింజల నూనె

పలురకాల పత్తి విత్తనాల నుండి తీసిన వంటనూనె

పత్తిగింజల నూనె (Cottonseed oil)పత్తి గింజల నుండి తీయు శాకఖాద్యతైలం (vegetable edible oil).[1] పత్తిని ప్రధానంగా దూది (cotton) కై సాగు చెయ్యడం మొదలైనప్పటికి, ప్రస్తుతం పత్తిగింజల నూనెకు కూడా ప్రాధాన్యం పెరిగింది. భారతదేశంలో ప్రత్తిగింజల నుండి నూనెను ఉత్పత్తి చెయ్యడం క్రమంగా పెరుగుచున్నది.1669 సంవత్సరంలో 1.7 లక్షల టన్నుల ముడినూనె ఉత్పత్తిచెయ్యబడగా, అది 2012కు 12.20 లక్షల టన్నులకు పెరిగింది.2013లో 12.53లక్షలుగా అంచనావెయ్యబడింది.[2]

పత్తి మొక్క
పత్తి పూవు
పత్తిగింజలు

భారతీయభాషలలో ప్రతియొక్క సాధారణ పేరు[3]సవరించు

పత్తి మొక్కసవరించు

ప్రపంచంలో ఉష్ణమండల, ఉపౌష్ణమండల దేశాలలో ప్రత్తిమొక్క వ్యాపించివున్నది. పత్తిమొక్క మాల్వేసి కుటుంబం, గాస్పియం ప్రజాతికి చెందినది. గాస్పియంలో చాలాజాతులున్నాయి.[4] ఆంధ్రప్రదేశ్‌లో ఒకమిలియన్ హెక్టారులలో పత్తిసాగు అవుచున్నది.ప్రపంచదేశాల పత్తిదిగుబడితో పోల్చిన ఇండియలో తక్కువదిగుబడి వచ్చుచున్నది. విదేశాలలో హెక్టారుకు 3 టన్నుల పత్తిదిగుబడి వుండగా, ఇండియాలో 1.5-2.0 టన్నుల పత్తిదిగుబడి ఉంది.పత్తిలో 35-45% దూది వుండగా, విత్తనం 55-64-5% వరకు వుండును. పత్తికి చేడపీడల, క్రిమి, కీటాకాలదాడి ఎక్కువ, అందుచే మిగతా పైరుల కన్న రసాయనిక క్రిమిసంహరకమందుల వాడకం చాలాఎక్కువ.ఈ రసాయనిక క్రిమి సంహరక మందులను మోతాదుకు మించి ఎక్కువగా వాడటం వలన, మందుల విషఅవశేషాలు పత్తిగింజలోని పోషక పదార్థాలలో, నూనెలో పెరిగే ప్రమాదమున్నది.

పత్తిగింజసవరించు

పత్తినుండి దూదిని, గింజలను జిన్నింగ్‌ మిల్లులో వేరుచెయ్యుదురు. పత్తినుండి దూదిని వేరుచేసిన తరువాత కూడా విత్తనంపై సన్నని నూగు పదార్థం వుండును. దీనిని 'లింటర్స్', అంటారు. డిలింటింగ్‌ మెషిన్‌ ద్వారా ఈ లింటరును తొలగించెదరు.[5] ఈ లింటరుకు కూడా మార్కెటింగ్‌ ఉంది. విత్తనం నల్లని, గట్టి పెంకును (hull) కల్గి లోపల మొత్తటి పసుపు వర్ణంలో వున్న గింక/పిక్కను కల్గివుండును. విత్తనంలో 5% వరకు లింటరు, 40-45% వరకు పెంకు కల్గివుండును. విత్తనం అండాకారంగా వుండి, 7-9 మి.మీ. పొడవు,3-5 మి.మీ. వెడల్పు వుండును. మొత్తం విత్తనంలో 20-25% వరకు నూనె వుండును. పెంకు తొలగించిన గింజ/పిక్కలో 40-45% వరకు నూనె వుండును. విత్తనం నుండి నూనెను పై పెంకును తొలగించి (decorticated), లేదా ఆలాగే మొత్తం విత్తనాన్ని (non decorticated) మిల్లులో ఆడించి నూనె తీస్తారు. మొత్తం విత్తనాన్ని మిల్లింగ్‌ చేసిన 13-15% వరకు నూనె వచ్చును, 6-8% వరకు నూనె ఆయిల్‌కేకులో వుండిపోవును. పెంకు తొలగించిన గింజలను ఆడించిన 35-45% వరకు నూనె దిగుబడి వచ్చును. మొత్తం విత్తనాన్ని మిల్లింగ్‌ చేయగా వచ్చిన కేకులో ప్రొటీన్‌ శాతం 20-22% వుండగా, పెంకు తొలగించిన గింజల నుండి వచ్చు కేకులో ప్రోటిన్‌ శాతం 35-40% వుండును[3].

పత్తి విత్తనంలోని సమ్మేళన పదార్థాలు[6]

పత్తిగింజలోని పదార్థం లింట్ వున్న గింజ లింట్ తొలగించిన విత్తనం
మాంసకృత్తులు 23.0 25.0
నూనె 20.0 23.8
కాల్సియం .2 0.12
ఫాస్పారస్ 0.64 0.54
మెగ్నిసియం 0.46 0.41
ఆసిడ్డిటెర్జంట్ ఫైబరు 34.0 24.0
నార రహిత కార్బొహైడ్రేట్స్ 8.2 9

.

నూనెను సంగ్రహించుటసవరించు

పత్తి/ప్రత్తి గింజలనుండి నూనెను సాధారణంగా ఎక్సుపెల్లరు [7] అను స్క్రూప్రెస్సును ఉపయోగించి తీయుదురు. ఎక్స్పెల్లరుకు విత్తనాన్నిపంపె ముందు స్టీమ్ ద్వారా కెటిల్‌లో కుకింగ్‌ చేసి, పంపెదరు. ఎక్స్‌పెల్లరు నుండి వచ్చు కేకు 2-4 మి.మీ మందంతో, 10-12 సెం.మీ. పరిమాణంలో వుండును. కేకులోమిగిలివున్న నూనెను సాల్వెంట్‌ ప్లాంట్‌ ద్వారా తీయుదురు. విత్తనం పైన్నున పొట్టును తొలగించి.లేదా విత్తానాన్ని నేరుగా ఎక్సుపెల్లరులోక్రషింగ్ చేసి నూనెను తీయుదురు. పత్తి విత్తనాలను ఎక్సుపెల్లరు యంత్రంలో నడిపినప్పుడు, ఇంకను పిండిలో 6-8% వరకు నూనె వుండి పోవును. పిండిలో (Oil cake) వున్ననూనెను పొందుటకై, ఈ పిండిని తిరిగి సాల్వెంట్ ఎక్సుట్రాక్షన్ ప్లాంటు[8]లో నడిపి పిండిలోనిమొత్తం నూనెను తీయుట జరుగును.

నూనెసవరించు

పత్తిగింజల నుండి తీసిన నూనె నేరుగా వంటనూనెగా పనికిరాదు. రిపైనరిలో రిపైండ్‌ చేసిన తరువాత మాత్రమే ఖాద్యతైలంగా పనిచేయును. ఎక్స్‌పెల్లరుల ద్వారా వచ్చిన నూనె నలుపు, నీలపు ఛాయ వున్న పచ్చ రంగులో వుండును. నూనెలో ఫ్రీఫ్యాటి ఆమ్లాల శాతం3-6% వరకు వుండును. మలినాలు, గమ్స్‌, గొసిపొల్ అధిక మొత్తంలో వుండును. వీటన్నింటిని తొలగించాలి. నూనెలోని గమ్స్, ఫ్రీఫ్యాటి ఆసిడులను, గొసిపొల్‌ను కెమికల్‌ రిపైనింగ్‌ పద్ధతిలో కాస్టిక్‌ నుపయోగించి తొలగించెదరు. నూనెలోని ఫ్రీఫ్యాటి ఆసిడులు కాస్టిక్‌తో కలసి సబ్బుగా మారి వేరు పడును. ఇలా ఏర్పడిన సబ్బును తొలగించిన నూనెకు బ్లిచింగ్‌ ఎర్తును (బ్లిచింగ్‌ పౌడరు కాదు) కలిపి, బ్లిచరులో ప్రాసెస్‌ చేసి నూనె రంగును తగ్గించెదరు. తుదిదశలో ఫ్రిఫ్యాటి ఆసిడులు, మలినాలు తొలగింపబడి, రంగు తగ్గింపబడిన నూనెను డొవోడరైజరుకు పంపి, నూనెను నిర్గంధికరించెదరు. రిపైండు చేసిన నూనె వర్ణరహితంగా లేదా లేతపసుపు వర్ణంలో వుండును. పత్తిగింజల నూనెలోని ఫ్యాటి ఆమ్లాల సమ్మేళనం, శాతం, భౌతిక ధర్మాలు, వేరుశనగ నూనె, పొద్దుతిరుగుడు నూనెల రెండికి మధ్యస్తంగా వుండును. కొన్నిసార్లు పత్తిగింజల నూనెను ఈ రెండు నూనెలలో కల్తి చెయ్యడంకూడా జరుగుతున్నది[3].

పత్తిగింజలనూనె బౌతికలక్షనాలు

భౌతిక గుణాలు మితి
సాంద్రత 0.915-0.921
వక్రీభవన సూచిక (400C) వద్ద 1.463-1.466
అయోడిన్ విలువ 109-120
సపొనిఫికెసను విలువ 190-198
స్మోక్‌ పాయింట్ 2320C
అన్‌సఫొనిపియబుల్ పధార్దం 1.5%max

ఫ్యాటి ఆమ్లాల శాతం

కొవ్వు ఆమ్లాలు కార్బనుల సంఖ్య:బంధాలు శాతం
మిరిస్టిక్ ఆమ్లం C14:0 0.5-2.0
పామిటిక్ ఆమ్లం C16:0 17-29
పామిటొలిక్ ఆమ్లం C16:1 <1.5
స్టియరిక్ ఆమ్లం C18:0 1.04.0
ఒలిక్ ఆమ్లం C18:1 13-44
లినొలిక్ ఆమ్లం C18:2 40-60
లినొలెనిక్‌ ఆమ్లం C18:3 0.1-2.0
  • ఐయోడిన్‌విలువ:ప్రయోగశాలలో 100 గ్రాములనూనెచే శోషింపబడిన (గ్రహింపబడిన) ఐయోడిన్ గ్రాముల సంఖ్య.ప్రయోగసమయంలో నూనెలోని, ఫ్యాటి ఆమ్లంల ద్విబంధంవున్న కార్బనులతో ఐయోడిన్ సంయోగం చెంది, ద్విబంధాలను తొలగించును.ఐయోడిన్‌విలువ నూనెలోని అసంతృప్త కొవ్వుఆమ్లంల వునికిని తెలుపును.నూనె ఐయోడిన్‌విలువ పెరుగు కొలది, నూనెలోని అసంతృప్త కొవ్వుఆమ్లంల శాతం పెరుగును.
  • సపొనిఫికెసన్‌విలువ:ఒక గ్రాము నూనెలో వున్న కొవ్వుఆమ్లాలన్నింటిని సబ్బుగా (సపొనిఫికెసను) మార్చుటకు అవసరమగు పొటాషియం హైడ్రాక్సైడు, మి.గ్రాములలో.
  • అన్‌సపొనిఫియబుల్ మేటరు: నూనెలో వుండియు, పోటాషియంహైడ్రాక్సైడ్‌తో చర్యచెందని పదార్థములు.ఇవి అలిఫాటిక్‌ఆల్కహల్‌లు, స్టెరొలులు (sterols, వర్ణకారకములు (pigments, హైడ్రోకార్బనులు, రెసినస్ (resinous) పదార్థములు.

నూనె ఉపయోగాలుసవరించు

  • రిపైండ్‌ ఆయిల్‌ను వంటనూనెగా వాడెదరు.[9]
  • మర్గరిన్‌ల తయారిలో వాడెదరు. మార్గరిన్‌ లనగా 12-15%, నీటిని,80% వరకు వనస్పతిని, రిపైండ్‌నూనెలనుకలిపి మరికొన్నిఉత్పేరకాలను కలిపి వెన్నను పోలి వుండేలా చెసినది. మార్గరినులను విస్తారంగా బేకరిలో కేకులు, తినిబండారాలల తయారిలో వినియోగిస్తారు.
  • వనస్పతి తయారిలోకూడా వినియోగిస్తారు.

ఇవికూడా చూడండిసవరించు

మూలాలు/ఆధారాలుసవరించు

  1. "cottonseed oil". merriam-webster.com. Retrieved 2015-03-11.
  2. "India Cottonseed Oil Production by Year". indexmundi.com. Retrieved 2015-03-11.
  3. 3.0 3.1 3.2 SEA HandBook-2009,By The Solvent Extractors' Association of India
  4. "THE COTTON PLANT". cottonaustralia.com.au. Archived from the original on 2015-03-12. Retrieved 2015-03-11.
  5. "Cotton Seed Delinting Plant". padsons.com. Archived from the original on 2015-08-04. Retrieved 2015-03-11.
  6. "Whole Cottonseed" (PDF). learningstore.uwex.edu. Archived from the original (PDF) on 2016-03-08. Retrieved 2015-03-11.
  7. "Oil Expeller". biodieseltechnologiesindia.com. Retrieved 2015-03-11.
  8. "Cottonseed extraction with a new solvent system: Isohexane and alcohol mixtures". link.springer.com. Retrieved 2015-03-11.
  9. "cottonseed oil". thefreedictionary.com. Retrieved 2015-03-11.