పత్తిపాక మోహన్‌

తెలుగు రచయిత, సాహితీ విమర్శకుడు

పత్తిపాక మోహన్‌ నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ హైదరాబాద్‌ ప్రాంతీయ సంపాదకులు, బాల సాహితీవేత్త, కవి, సాహిత్య విమర్శకుడు. [1] అతను 14 అక్టోబర్‌, 2018 న "డా.వేదగిరి రాంబాబు బాల సాహిత్య పురస్కారం" అందుకున్నాడు.[2]

పత్తిపాక మోహన్‌ బాలల పుస్తకాల రచయిత

జీవిత విశేషాలుసవరించు

పత్తిపాక మోహన్ తెలంగాణ రాష్ట్రం,.కరీంనగర్ జిల్లాకు చెందిన సిరిసిల్ల గ్రామానికి చెందినవాడు. [3] వారి కుటుంబం పూర్వీకుల నుండి చేనేత వృత్తిని చేసేవారు. అతను వివిధ భాషల్లోని కథలు తెలుగులోకి అను వాదం చేశాడు. అతను నేషనల్ బుక్ ట్రస్టు తెలుగు సంపాదకులుగా వ్యవహరిస్తున్నాడు. వీరు ‘ముత్తుకలలు’ తోకలు, మంచి విత్తులు, టిప్పు సుల్తాన్, ప్రాణ స్నేహితులు మొ॥వి తెలుగులోనికి అనువదించాడు.

రచనలుసవరించు

అతను రచయితగా సుమారు 15 పుస్తకాలు రాసాడు.

  • 'ఆకుపచ్చని పాట': ఇది స్వచ్చ సర్వేక్షణ్‌లో భాగంగా పిల్లలకు పర్యావరణ స్పృహను తెలిపే 'బాలగీత'.
  • 'ఒక్కేసి పువ్వేసి చందమామ' : ఇది బాలల బతుకమ్మ గేయాల సంకలనం.
  • చందమామ రావే : బాలల గేయాల పుస్తకం[4]
  • పిల్లలకోసం మనకవులు

మూలాలుసవరించు

  1. "డాక్టర్‌ పత్తిపాక మోహన్‌".
  2. "'బాలగీత' పత్తిపాక మోహన్‌ 'ఆకుపచ్చని పాట'".
  3. "జాతీయ కవి సమ్మేళనాలకు పత్తిపాక మోహన్‌".
  4. "కరీంనగర్ జిల్లా బాలసాహిత్యం".

బయటి లంకెలుసవరించు