పత్తెపురం

ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లా, సంతమాగులూరు మండలంలోని గ్రామం


ఫత్తేపురం, బాపట్ల జిల్లా, సంతమాగులూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

పత్తెపురం
గ్రామం
పటం
పత్తెపురం is located in ఆంధ్రప్రదేశ్
పత్తెపురం
పత్తెపురం
అక్షాంశ రేఖాంశాలు: 16°5′44.268″N 79°58′55.596″E / 16.09563000°N 79.98211000°E / 16.09563000; 79.98211000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల
మండలంసంతమాగులూరు
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )

మౌలిక వసతులు

మార్చు

ఈ గ్రామంలో 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో, ప్రధాన రహదారి నుండి 680 మీటర్ల పొడవుతో, సిమెంటుతో నిర్మించనున్న రహదారికి, 2017, ఆగస్టు-9న శంకుస్థాపన నిర్వహించారు.

గ్రామ పంచాయతీ

మార్చు

2013, జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో కొల్లి రత్తాయమ్మ, సర్పంచ్‌గా ఎన్నికైంది.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు

శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం

మార్చు

ఫత్తేపురం గ్రామంలోని ప్రాచీన ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయంలో, శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం, శ్రీ సీతారాముల కళ్యాణం, వైభవంగా నిర్వహించెదరు. కళ్యాణం అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించెదరు.

శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయం

మార్చు

ఈ ఆలయంలో, 2015, మార్చి-5వ తేదీ, ఫాల్గుణ పౌర్ణమి, గురువారం రాత్రి, అమ్మవారి తిరునాళ్ళు వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారికి పూజలు చేసి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరిసర ప్రాంతాలనుండి భక్తులు అధికసంఖ్యలో విచ్చేసారు.

ప్రధాన వృత్తులు

మార్చు

ఈ గ్రామంలో ఎక్కువ మంది వ్యవసాయము మీద ఆధారపడి జీవిస్తున్నారు.

గ్రామ విశేషాలు

మార్చు

మండలంలోనే 100% అక్షరాస్యత ఉన్న గ్రామం ఫత్తేపురం గ్రామంలోని యువకులు, ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాలు చేయుచున్నవారు, "కాకతీయ యువసేన"గా ఏర్పడి, రు. రెండున్నర లక్షల ఆర్థిక సహాయంతో, గ్రామంలో ఒక నీటిశుద్ధి కేంద్రాన్ని ఏర్పాటుచేసారు. ఈ కేంద్రానికి, 2014, జూన్-29, ఆదివారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొని యువకులను అభినందించారు.

మూలాలు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు