పనంబూరు బీచ్

పనంబూర్ బీచ్ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు నగరంలోని ఒక బీచ్.

పనంబూర్ బీచ్ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు నగరంలోని ఒక సముద్ర తీరం. ఇది అరేబియా సముద్రం ఒడ్డున ఉంది. భారతదేశంలోని సురక్షితమైన సముద్ర తీర ప్రాంతాల్లో ఒకటిగా ఇది పేరు పొందింది.[1]. ఇది కర్ణాటకలో అత్యంత ఎక్కువగా సందర్శకులు వచ్చే ప్రసిద్ధమైన స్థలం. ఇది మంగుళూరు సిటీ కార్పోరేషన్ పరిపాలనలో ఉన్న సిటీ సెంటర్ కి ఉత్తరాన 10 కి.మీ దూరంలో పనంబూర్ అనే ప్రదేశంలో ఉంది. ప్రస్తుతం ఈ బీచ్ పనంబూర్ బీచ్ టూరిజం డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ బ్యానర్ క్రింద ఒక ప్రైవేట్ సంస్థచే నిర్వహించబడుతోంది. ఈ బీచ్ లో జెట్ స్కీ రైడ్‌లు, బోటింగ్, డాల్ఫిన్ వీక్షణ, ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ సూర్యాస్తమయాలకు ఎక్కువ మంది వీక్షకులు వస్తుంటారు.[2], ఓడరేవు ప్రాంతం, పర్యాటకులకు, స్థానికులకు ఇది ఒక పిక్నిక్ స్పాట్.  బీచ్ నగరానికి దగ్గరగా ఉండటం వల్ల ఎక్కువగా సందర్శకులు వస్తారు. సముద్రంలో లంగరు వేసిన ఓడలను బీచ్ నుండి చూడవచ్చు.[3]

పనంబూరు బీచ్
బీచ్
పనంబూరు బీచ్ బోర్డు
పనంబూరు బీచ్ బోర్డు
Locationపనంబూరు
Cityమంగుళూరు
CountryIndiaభారతదేశం
Lifeguard Availableఉంది
Important Events
  • బీచ్ ఫెస్టివల్
  • కైట్ ఫెస్టివల్
Activities
  • ఈత
  • పారాసైలింగ్
  • బోట్ రైడ్స్
  • సర్ఫింగ్
  • వాటర్ స్కూటర్స్
  • క్యామెల్ రైడ్స్
  • హార్స్ రైడింగ్
  • బగ్గీ
Government
 • Bodyమంగుళూరు సిటీ కార్పొరేషన్
Websitehttp://www.panamburbeach.com/

సౌకర్యాలు

మార్చు

బీచ్‌లో జెట్ స్కీయింగ్, బోటింగ్ ఇంకా మరెన్నో కార్యకలాపాలు ఉన్నాయి.[4]. ఒంటె, గుర్రపు స్వారీలు కూడా ఉంటాయి. చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. పిల్లల కోసం ఎక్కువగా జాయ్ రైడ్‌ కూడా ఉంటాయి. సందర్శకులు రుసుము చెల్లించి పార్కింగ్ సౌకర్యాన్ని పొందవచ్చు.

కార్యక్రమాలు

మార్చు

బీచ్ ఫెస్టివల్స్, కైట్ ఫెస్టివల్స్ వంటి అనేక కార్యక్రమాలు ఇక్కడ అప్పుడప్పుడు నిర్వహించబడతాయి. ఉత్సవాల్లో పడవ పోటీలు, ఎయిర్ షోలు, ఇసుక శిల్పాల వంటి పోటీలు ఉంటాయి.

గాలిపటాల పండుగ

మార్చు
 
పనంబూరు బీచ్ ఎంట్రెన్స్

అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవం ఈ బీచ్‌లోని ప్రధాన పర్యాటక ఆకర్షణ, ప్రపంచం నలుమూలల నుండి జట్లు గాలిపటాలతో ఉత్సవంలో పాల్గొంటారు. ఇంగ్లండ్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, జర్మనీ, కువైట్, థాయిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, టర్కీ వంటి వివిధ దేశాల జట్లు గతంలో చురుకుగా పాల్గొన్నాయి. ఓఎన్జిసి, ఎంఆర్పీఎల్ మొదలైన పారిశ్రామిక సంస్థల మద్దతుతో "టీమ్ మంగళూరు" పేరుతో ఈ బీచ్‌లో పతంగుల ఔత్సాహికులు ఎప్పుడూ గాలిపటాల పండుగను నిర్వహిస్తుంటారు. దక్షిణ కన్నడ జిల్లా అడ్మినిస్ట్రేషన్ ప్రసిద్ధ " కరావళి ఉత్సవ్" లో భాగంగా బీచ్ ఫెస్టివల్‌ని కూడా నిర్వహిస్తుంది.

 
పనంబూరు బీచ్ లో గాలిపటం

రవాణా సౌకర్యాలు

మార్చు

స్టేట్‌బ్యాంక్‌లోని ప్రధాన బస్ స్టాప్ నుండి ఇక్కడికి అనేక సిటీ బస్సులు ఉంటాయి. జాతీయ రహదారి జాతీయ రహదారి 66 (పాత నంబర్: 17) లో పనంబూర్ బీచ్ రోడ్డులో పనంబూర్ బీచ్‌కు స్టాప్ కు వచ్చే నాన్-ఎక్స్‌ప్రెస్ సర్వీస్ బస్సులలో కూడా ఇక్కడికి రావొచ్చు. బస్సు దిగిన తర్వాత, 1 కిలోమీటర్ నడక మార్గం ద్వారా బీచ్‌కు చేరుకోవచ్చు.

  • మంగళూరు - 8 కి.మీ.
  • బెంగళూరు - 355 కి.మీ.
  • మణిపాల్ - 56 కి.మీ.
  • కన్నూర్ - 150 కి.మీ.
  • మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ( భారతదేశం ) - 12 కి.మీ.

వాతావరణం

మార్చు

మంగళూరు ఉష్ణమండల ఋతుపవన వాతావరణాన్ని కలిగి ఉంటుంది.

గ్యాలరీ

మార్చు

మూలాలు

మార్చు
  1. "Panambur Beach Mangalore | Things to do in Mangalore Beach". Karnataka Tourism. Retrieved 2023-05-01.
  2. Hegde, Pradeep. "An evening at Panambur Beach". Trayaan. Retrieved 2023-05-01.
  3. "Panambur Beach, Mangalore - Timings, Water sports, Best time to visit". Trawell.in. Retrieved 2023-05-01.
  4. "Panambur Beach (Mangalore) - All You Need to Know BEFORE You Go". Tripadvisor. Retrieved 2023-05-01.