పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం, 2013

పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం, సంస్కరణ) చట్టం, 2013 అనేది భారతదేశంలో మహిళలకు కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నించి రక్షణ కలిగించటానికి ఏర్పడ్డ చట్టం.[1] ఇది 2012 సెప్టెంబరు 3న లోక్ సభ (భారత పార్లమెంటు దిగువ సభ) ఆమోదం పొందింది. తర్వాత రాజ్య సభ (పార్లమెంటు ఎగువ సభ)లో 2013 ఫిబ్రవరి 26న ఆమోదం పొందింది.[2] ఈ బిల్లుకు ప్రధాని చే 2013 ఏప్రిల్ 23న అమోదం పొందింది.[3] ఈ చట్టం 2013 డిసెంబరు 9న అమలులోకి వచ్చింది.[4] లైంగిక వేధింపుల నివారణకు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా జారీచేసిన విశాఖ మార్గదర్శకాలను ఈ శాసనం పాటిస్తుంది. అతి కొద్దిమంది భారతీయ యజమానులు మాత్రమే ఈ శాసనానికి కట్టుబడి ఉన్నారని అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదించింది.[5][ఆధారం యివ్వలేదు][6] చాలా మంది ఉద్యోగులు ఈ చట్టాన్ని పాటిస్తున్నారు, అయినప్పటికీ, ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. వారు మరింత పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది..[7] నవంబరు 2015 లో ఎఫ్‌ఐసిసిఐ-ఈవై నివేదిక ప్రకారం, లైంగిక వేధింపుల చట్టం, 2013ను 36% భారత కంపెనీలు,25% బహుళజాతి సంస్థలు పాటించటం లేదు .[8] ఈ చట్టానికి లొంగని ఏ ఉద్యోగిపై అయినా కఠిన చర్యలు తీసుకుంటాం అని ప్రభుత్వం వెల్లడి చేసింది.[9]

ప్రవేశిక, నేపథ్యం మార్చు

కార్యాలయంలో మహిళల లైంగిక వేధింపుల నుండి రక్షణ కల్పించే ఒక చట్టం. లైంగిక వేధింపులను నివారించడం, ఫిర్యాదులకు న్యాయం చేసి వారి బాధ పోగొట్టడం, సంబంధిత అంశాలు, సందర్భాలతో వ్యవహరించడం ఇందులో భాగం.

భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ 14, 15 ప్రకారం లైంగిక వేధింపు అనేది స్త్రీ ప్రాథమిక సమాన హక్కులను ఉల్లంఘిస్తుంది. అంతేకాక ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు, హుందా గా జీవించే హక్కు, ఏ వృత్తి, ఉద్యోగం, వాణిజ్యం లేదా వ్యాపారం అయినా చేపట్టే హక్కులలో నే లైంగిక వేధింపులు లేని వాతావరణం లో పని చేసే హక్కు కూడా ఉంది.;

లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా రక్షణ, గౌరవప్రదంగా పనిచేయడానికి గల హక్కులను మానవహక్కులుగా అంతర్జాతీయ సమావేశాలు, 1993 జూన్ 25న భారత ప్రభుత్వం ధృవీకరించిన "మహిళలకు వ్యతిరేకంగా అన్నిరకాల వివక్షల నిర్మూలనక ఒడంబడిక" అంగీకరిస్తున్నాయి. ;

కార్యాలయంలో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా స్త్రీల రక్షణ కోసం అటువంటి ఒడంబడికను ఆచరణలోకి తీసుకువచ్చేందుకు ఇలాచట్టం ద్వారా ఏర్పాట్లు చేయడం సముచితం, ఆవశ్యకం..
[10]

కార్యాచరణ మార్చు

ఈ చట్టం అసలు దేని కోసం?

పని ప్రాంతంలో మహిళల పైన లైంగిక వేధింపులను పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం, సంస్కరణ) చట్టం, 2013 చట్టవిరుద్ధం చేస్తుంది . ఒకరు ఏ విధంగా లైంగిక వేధింపులకు గురి అవ్వొచ్చు ఇంకా ఆ బాధితులు ఎలా ఇటువంటి ప్రవర్తనను ఫిర్యాదు చేయొచ్చు అనే దాని గురించి ఈ చట్టం మాట్లాడుతుంది.

ఈ చట్టం కేవలం మహిళలకేనా?

అవును, ఈ చట్టం కేవలం పని ప్రాంతంలో లైంగిక వేధింపులకు గురి అయ్యిన మహిళలకు మాత్రమే.

ఈ చట్టం కేవలం పని చేసే మహిళలకేనా?

లేదు, ఈ చట్టం పని ప్రాంతంలో లైంగిక వేధింపుకు గురి అయ్యిన ప్రతి మహిళకు వర్తిస్తుంది. అయితే, లైంగిక వేధింపుకు గురి అయ్యిన మహిళ ఎక్కడైతే వేధించబడిందో అక్కడ ఉద్యోగి అయ్యి ఉండనక్కరలేదు.ఆ పని ప్రాంతం ఏదైనా ప్రభుత్వ లేక ప్రైవేట్ ఆఫీసు కావొచ్చు.

మా ఆఫీసులో ఎటువంటి లైంగిక వేధీంపులు లేవు. అయినా కానీ అంతర్గత ఫిర్యాదు కమిటీ ఏర్పరచే సూచనలను పాఠించాలా ?

అవును, ఇప్పటి వరకూ ఎటువంటి లైంగిక వేధింపుల ఫిర్యాదులు లేకపోయినా, కమిటీ ఏర్పరచటం అవశ్యం (ఒకవేళ 10 మంది కంటే ఎక్కువ మంది కార్మికులు ఉంటే), అన్ని నియమాలు పాఠించవలసిందే.

చట్టం నేను పోలీసులను, కోర్టును ఆశ్రయించేందుకు అనుమతించదా ?

అదేమీ కాదు,ఈ చట్టం మీరు ఆఫీసులోనే నిందితుడితో వ్యవహరించడం లేక కోర్టును ఆశ్రయించడం అన్న రెండిటి మధ్య ఎంచుకునే వీలు కల్పిస్తుంది. మీరు కావాలంటే, మీరు మీ అంతర్గత /స్థానిక ఫిర్యాదుల కమిటీని చేరుకోకుండానే ఒక క్రిమినల్ ఫిర్యాదుని ఫైల్ చేయవచ్చు.

నేపథ్యం, నిబంధనలు మార్చు

భారత ప్రభుత్వం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రకారం:

ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, ప్రైవేటు పనిప్రదేశాలు కావచ్చు, అన్ని పని ప్రదేశాలలో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మహిళలు రక్షణ పొందేట్లు చట్టం చూస్తుంది. ఇది ఏ పని ప్రదేశంలో అయినా వారి లింగ సమానత్వ హక్కు, జీవించే హక్కు, స్వేచ్చ, సమానత్వాన్ని పొందడానికి దోహద పడుతుంది. తమకి భద్రత ఉందనే భావన పని ప్రదేశంలో మహిళల భాగస్వామ్యం పెరిగేందుకు దోహద పడుతుంది, తద్వారా వారి ఆర్థిక స్తోమతకి, ఉన్నతికి సహాయ పడుతుంది.[11]

ఈ చట్టం విశాఖ వర్సెస్ రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం కేసు (1997)లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో లైంగిక వేధింపుల నిర్వచనాన్ని స్వీకరించింది.[12] భారత రాజ్యాంగం 19 (1) అధికరణం పౌరులు అందరికీ ఏ వారు ఎంచుకున్న ఏ వృత్తిలో అయినా పనిచేసేందుకు లేదా వారి స్వంత వ్యాపారమో, వాణిజ్యమో చేసుకునేందుకు హక్కుని ఇస్తోంది. విశాఖ వర్సెస్ రాజస్థాన్ రాష్ట్రప్రభుత్వం కేసు తీర్పు - లింగ సమానత్వాన్ని, జీవించే హక్కును, స్వేచ్ఛని భంగపరిచే చర్యలు బాధితుల ప్రాథమిక హక్కులను 19 (1) జి అధికరణం ప్రకారం హరిస్తున్నట్టేనని నిర్ధారిచింది. ఈ తీర్పు పనిప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు అన్నవి కేవలం పనిప్రదేశాల్లో మహిళల హక్కులకు భంగం కలిగించి వృత్తిపరంగా నష్టం మాత్రమే కలుగజేసినట్టు కాదనీ, అంతకుమించి మహిళల ప్రాథమిక హక్కులకు భంగమనీ నిర్ధారించింది.[13]

ఈ చట్టం పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు, ఆసుపత్రుల్లో రోగులకు కూడా వర్తిస్తుంది. దీని కింద వచ్చే ఫిర్యాదులను విచారించడానికి అంతర్గతంగా ఒక కమిటీని ఏర్పాటుచేయడం తప్పనిసరి. ఈ చట్టాన్ని అనుసరించని ఉద్యోగులకు 50 వేల రూపాయల వరకూ జరిమానా విధించవచ్చు.

ఈ శాసనం రూపొందడానికి అవసరమైన ప్రక్రియ చాలా సుదీర్ఘంగా సాగింది. 2007లో మహిళా, శిశు సంక్షేమ మంత్రి కృష్ణ తీర్థ్ ఈ బిల్లును ప్రవేశ పెట్టగా, 2010 జనవరిలో కేంద్ర మంత్రిమండలిలో ఆమోదం పొందింది. 2010 డిసెంబరులో లోక్‌సభకు ఈ బిల్లును సమర్పించగా, మానవ వనరుల అభివృద్ధికి పార్లమెంటు స్థాయీసంఘం పరిశీలనకు పంపారు. 2011 నవంబరు 30న కమిటీ నివేదిక ప్రచురించింది.[14][15] 2012 మేలో కేంద్ర మంత్రిమండలి ఇంటిపనులు చేసేవారిని ఇందులో చేర్చేందుకు ఉద్దేశించిన సవరణను ఆమోదించింది.[16] 2012 సెప్టెంబరు 3న బిల్లు లోక్‌సభ ఆమోదం పొందగా,[17] 2013 ఫిబ్రవరి 26న ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందింది. భారత రాష్ట్రపతి సమ్మతి పొంది, 2013 ఏప్రిల్ 23న ప్రచురించిన గెజెట్ ఆఫ్ ఇండియాలో ఎక్స్ట్రాఆర్డినరీ, రెండో విభాగం, మొదటి సెక్షన్‌లో 2013లో 14వ చట్టంగా ప్రచురితమైంది.

ప్రధాన లక్షణాలు మార్చు

  • ఈ చట్టం పని ప్రదేశంలో లైంగిక వేధింపులను నిర్వచిస్తుంది, ఫిర్యాదుల పరిష్కారం కోసం ఒక యంత్రాంగాన్ని సృష్టిస్తుంది. అలాగే తప్పుడు లేదా హానికరమైన ఆరోపణలకు వ్యతిరేకంగా రక్షణను అందిస్తుంది.
  • ఒకవేళ ఒకవేళ లైంగిక చేష్టలు, లైంగిక వేధింపులకు దగ్గరగా ఉన్న పనులతో సంబంధం ఉంటే 'క్విడ్ ప్రో కో' (నీకది నాకిది), 'ప్రతికూల పని వాతావరణం'లను ఇతర లైంగిక వేధింపుల రూపాలుగా పరిగణిస్తుంది.[18]
  • ఈ చట్టం సంరక్షించే బాధిత మహిళను బాగా విస్తృతమైనది, ప్రైవేట్ రంగాల్లోనూ, ప్రభుత్వ రంగాల్లోనూ పనిచేసేవారు, వ్యవస్థీకృత రంగంలో పనిచేసేవారు, అసంఘటిత రంగంవారు, అన్ని వయసుల వారూ, ఉద్యోగ, ఉపాధి హోదాతో సంబంధం లేకుండా క్లయింట్లు, కస్టమర్లు, ఇంటిపనిచేసేవారిని కూడా ఈ చట్టం బాధిత మహిళల పరిధిలో పరిగణిస్తోంది.
  • అయితే విశాఖ మార్గదర్శకాల ప్రకారం "పని ప్రదేశం" అంటే మనం అనుకునే మామూలు ఆఫీస్, అంటే యాజమాన్యం-ఉద్యోగి సంబంధం వరకే ఉంది,కానీ ఈ చట్టం కాస్త దూరం ఆలోచించి సంస్థలను,శాఖలను, ఆఫీసు,బ్రాంచీ యునిట్ తదితర ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగంలో వ్యవస్థీకృత, అసంఘటిత, ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లు, విద్య సంస్థలు, క్రీడా వ్యవస్థలు, స్టేడియం,క్రీడా మైదానాలఉ ఇంకా ఉద్యోగి పయనించిన స్థలాలన్నింటిని కలుపుకుంటుంది. అంతే కాదు, టెలి-రాకపోకలు సాగించే సాంప్రదాయేతర పని ప్రదేశాలు అవి కూడా ఈ చట్టం కిందకే వస్తాయి.[19]
  • 90 రోజుల వ్యవధిలోనే కమిటీ విచారణను పూర్తి చేయాలి. విచారణ పూర్తయిన తరువాత, నివేదిక యజమాని లేదా జిల్లా అధికారికి పంపబడుతుంది, కేసు ఎలాగుందో అలాగ, వారు 60 రోజుల లోపల నివేదికపై చర్య తీసుకోవటం తప్పనిసరి.
  • ప్రతి కార్యాలయం లేదా బ్రాంచీ లేదా 10 లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉద్యోగులతో ఉన్న ప్రతీ పనిప్రదేశం ఒక అంతర్గత ఫిర్యాదులు కమిటీని ఏర్పాటు చేయడం యజమానికీ తప్పనిసరి. జిల్లా ఆఫీసర్ ప్రతి జిల్లాలో స్థానిక ఫిర్యాదులు కమిటీని ఏర్పాటు చేయవలసి ఉంటుంది, అవసరమైతే బ్లాక్ స్థాయికి కూడా .
  • ఈ ఫిర్యాదుల కమిటీలకు సాక్ష్యాలను సేకరించేందుకు పౌర న్యాయస్థానాలకి ఉండే అధికారాలున్నాయి.
  • ఒక వేళ ఫిర్యాదు చేసిన వారు కోరితే, విచారణ మొదలు పెట్టే ముందు ఫిర్యాదు కమిటీ వారికి రాజీ పడేందుకు సహాయం చేయాలి.
  • ఈ చట్టం ప్రకారం విచారణ ప్రక్రియ గోప్యంగా ఉంచాలి, గోప్యత ఉల్లంఘించిన వ్యక్తిపై చట్టం రూ.5000 జరిమానా విధిస్తుంది.
  • ఈ చట్టం ప్రకారం యాజమాన్యాలు లింగ వ్యవక్ష పట్ల సున్నితత్వాన్ని మేలుకొలిపే శిక్షణను, సంబంధిత కార్యక్రమాలను సంస్థలో నిర్వహించాలని నిర్దేశిస్తుంది.
  • యాజమాన్యాలకు జరిమానాలూ చట్టంలో సూచించారు. చట్ట నిబంధనలు అనుసరించని వారికి రూ.50,000 వరకు జరిమానా విధించబడుతుంది.. ఉల్లంఘనలు పునరావృతమైతే అధిక జరిమానాలకు దారి తీయవచ్చు, వ్యాపారాన్ని నిర్వహించేందుకు ఇచ్చిన లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయవచ్చు.[20]
  • ఏ సంస్థలోను లైంగిక వేధింపులకు సంబంధించి కార్యాలయాలను, రికార్డులను తనిఖీ చేయమని ప్రభుత్వం ఒక అధికారిని ఆదేశించవచ్చు.

శిక్షా స్మృతి మార్చు

క్రిమినల్ లా (సవరణ) చట్టం,2013 ద్వారా భారత పీనల్ కోడ్ లో సెక్షన్ 354 చేర్చబడింది. లైంగిక వేధింపుల నేరం, సంబంధిత నేరం చేసిన వ్యక్తికి ఎటువంటి శిక్ష వేయాలి అన్నది ఈ చట్టమే నిర్ధారిస్తుంది. ఈ శిక్ష ఒకటి నొంచి మూడు ఏళ్ళ జైలు శిక్ష లేదా జరిమానా అయ్యి ఉంటుంది.అదనంగా, లైంగిక వేధింపు అనే ఈ నేరాన్ని, నివేదించే బాధ్యత యాజమాన్యాల పైన ఉంది..[21]

విమర్శ మార్చు

పశ్చిమ బెంగాల్ కు చెందిన కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) సభ్యురాలిగా రాజ్యసభలో పనిచేస్తున్న బృందా కారత్ ప్రారంభంలో ఈ చట్ట సవరణకు ఫిర్యాదు చేశారు. ఈ బిల్లు సాయుధ దళాలలో ఉన్న మహిళలకు, అలాగే మహిళ వ్యవసాయ కార్మికులకు కూడా వర్తించదని పేర్కొన్నారు.ఆవిడ మాటల్లో, "దేశంలో శ్రామిక శక్తిలో అతిపెద్ద మహిళా భాగం అయిన వ్యవసాయ కార్మికులకు తీవ్ర అన్యాయం." కాగా, తుది బిల్లు " ఏ మహిళ అయినా పని ప్రదేశంలో లైంగిక వేధింపుకు గురి కాకూడదు" అనే అంశాన్ని చేర్చింది (క్లాజ్ 3.1)..[22] మే 2012 డ్రాఫ్ట్ బిల్లు ప్రకారం, ఫిర్యాదు చేసిన మహిళ పైనే నిరూపించ వలసిన బాధ్యత ఉంటుంది. ఈ ప్రక్రియలో తప్పుడు ఫిర్యాదు చేయడం లేదా తప్పుడు సాక్ష్యాలు ఇచ్చినట్టు గుర్తించినట్లయితే, ఫిర్యాదు చేసిన మహిళని విచారణ చేయవచ్చు, దీని వల్ల మహిళలు నేరాలను నివేదించడానికి మరింత భయపడుతున్నారని ఆందోళన వ్యక్తం అయింది. ఈ బిల్లు చివరి సంస్కరణ జరగడానికి ముందు, న్యాయవాది, సామాజిక కార్యకర్త వ్రిందా గ్రోవర్ ఇలా తన మాటలలో " తప్పుడు ఫిర్యాదులు చేశారంటూ ఫిర్యాదుదారులను శిక్షించే వీలు ఈ బిల్లులో ఉండదని నేను ఆశిస్తున్నాను. ఇది చాలా తక్కువ నివేదించబడే నేరం. ఇటువంటి నిబంధన ఒక స్త్రీ ముందుకు వచ్చి ఫిర్యాదు చేయడాన్ని అరికడుతుంది." [23]జైకా సోమన్ అనే మహిళా హక్కుల కార్యకర్త ఆక్షన్ ఎయిడ్ ఇండియాలో ఇలా అన్నది, "ఈ విషయంలో ఒక చట్టం ఉండడానికి ఇది సహాయపడుతోంది. మేము దీన్ని స్వాగతిస్తున్నాం. కానీ, దీని  కీలకం చట్టాన్ని అమలు చేయటంలోనే ఉంది. "[24]

టైమ్స్ ఆఫ్ ఇండియా‌కు చెందిన మనోజ్ మిట్టా ఈ చట్టం పురుషులకు రక్షణ కల్పించదు అని అంటూ, " ఇది మహిళా ఉద్యోగులను మాత్రమే  కాపాడటానికి అవసరమైన ఆవరణలో ఆధారంగా ఉంది."[25] నిశిత్ దేశాయ్ అసోసియేట్స్ అనే లా గ్రూప్, లైంగిక వేధింపుల కేసులలో యాజమాన్య విధి విధానాల ఆందోళనను క్లుప్త విశ్లేషణ వ్రాసింది.అలాగే,ఇతర దేశాల్లో ఉన్న మాదిరి, ఉద్యోగి-ఉద్యోగి వేధింపులకు యాజమాన్యానికి ఎటువంటి  బాధ్యత లేదన్న వాస్తవాన్ని కూడా పేర్కొనింది.సహకరించే ఉద్యోగులు ఉండని కారణంగా కార్యాలయంలో సమయానుసారంగా సమస్యలను పరిష్కరించేందుకు యజమానులు బాధ్యత వహించే నిబంధనను వారు కూడా పేర్కొన్నారు. ఇంకా, మూడవ-పార్టీ ప్రభుత్వేతర సంస్థలు కలిగి ఉండటం వల్ల, వారి గోప్యత కారణంగా, యాజమాన్యాలు వారి వేధింపులను నివేదించటంలో ఇబ్బంది కలుగుతుంది.

ఈ శాసనం అమలు ఇప్పటివరకూ యజమానుల్లో మార్పుకే వదిలివేశారు, ఇప్పటి వరకు చట్టం అమలు చేయడానికి ఎలాంటి ముఖ్యమైన చర్య తీసుకోలేదు. ఉదాహరణకి,చట్టం అమలులోకి ఒచ్చిన 6 నెలల తర్వాత, లైంగిక వేధింపుల కారణంగా మహిళలు శ్రామికులుగా పనిలో పాల్గొనలేకపోవడం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో భయాందోళనలకు కారణమైంది.[26]

కొన్ని ట్రిబ్యునల్స్ చట్టంలోని కొన్ని నిబంధనల, ముఖ్యంగా విభాగం 4, సెక్షన్ 7 రాజ్యాంగబద్ధతపై వ్యాఖ్యానించాయి.[27]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. Book – Behind Closed Cubicles – by Viji Hari Archived 2018-05-22 at the Wayback Machine, collection of true stories at Indian workplaces, provides guidance on how to deal with Sexual Harassment for HR, employers and employees
  2. ""The Sexual Harassment Bill undermines the innovative spirit of Vishaka" – Naina Kapur, Lawyer and Equality Consultant". Bar and Bench. 1 March 2013. Archived from the original on 2 డిసెంబరు 2013. Retrieved 2 March 2013.
  3. "The Sexual Harassment of Women at Workplace (Prevention, Prohibition and Redressal) Act, 2013 Published in The Gazette of India". Press Information Bureau. Retrieved 26 April 2013.
  4. "Law against sexual harassment at workplace comes into effect". Times of India. Retrieved 14 December 2013.
  5. "India must have zero tolerance for workplace sexual harassment". Retrieved 11 November 2014.
  6. "Action against sexual harassment at workplace in the Asia and the Pacific" (PDF). Retrieved 12 November 2014.
  7. "Indian firms take little notice of law against sexual harassment". Retrieved 12 November 2014.
  8. "Fostering safe workplaces" (PDF). FICCI-EY. Archived from the original (PDF) on 8 డిసెంబరు 2015. Retrieved 29 November 2015.
  9. "Serious legal action against organisations without a sexual harassment committee, says Maneka Gandhi". DNA. 2014-09-18. Retrieved 2014-11-13.
  10. "The Sexual Harassment of Women at Workplace (Prevention, Prohibition and Redressal) Act, 2013" (PDF). PRS Legislative Research. Archived from the original (PDF) on 3 ఏప్రిల్ 2018. Retrieved 26 April 2013.
  11. Press Information Bureau, Government of India (4 November 2010). Protection of Women against Sexual Harassment at Workplace Bill, 2010. Retrieved 13 September 2012.
  12. Chakrabarty, Rakhi (4 September 2012) "Sexual harassment at workplace Bill passed" Archived 2013-12-03 at the Wayback Machine. Times of India. Retrieved 13 September 2012.
  13. Lawyer's Collective, Sexual harassment of women at workplace bill 2012 passed by Lok Sabha Archived 2016-10-21 at the Wayback Machine, 6 September 2012.
  14. The Telegraph (Calcutta) (18 April 2012). "Watch what you say" Archived 2016-03-04 at the Wayback Machine. Retrieved 13 September 2012.
  15. Thorpe, Edgar (ed.) (2012). The Pearson Current Event Digest 2011-2012, pp. 3-4. Pearson Education India. ISBN 8131761789
  16. Polanki, Pallavi (28 August 2012). "Bill against sexual harassment a boost to domestic workers" Archived 2015-09-24 at the Wayback Machine. First Post. Retrieved 13 September 2012.
  17. New York Daily News (3 September 2012). "Lok Sabha passes bill against sexual harassment in the workplace" Archived 2013-01-27 at the Wayback Machine. Retrieved 13 September 2012.
  18. Handbook on the Law of Sexual Harassment at Workplace by Shivangi Prasad and Attreyi Mukherjee, available at amazon.in and bigbookshop.com
  19. "Is your " workplace" covered under the new sexual harassment law?". Retrieved 4 December 2014.
  20. "The Protection of Women Against Sexual Harassment at Work Place Bill, 2010". PRS Legislative Research. Retrieved 19 March 2013.
  21. Nishith Desai Associates, Veena Gopalakrishnan, Ajay Singh Solanki and Vikram Shroff, India’s new labour law - prevention of sexual harassment at the workplace Archived 2016-03-04 at the Wayback Machine, Lexology, 30 April 2013
  22. The Hindu Parliament passes Bill to prevent sexual harassment at workplace 26 February 2013
  23. Shajan Perappadan, Bindu (4 September 2012). "Safety net at hand". The Hindu. Retrieved 13 September 2012.
  24. CNN-IBN (5 September 2012). "India moves to protect women from sexual harassment at work" Archived 2012-10-23 at the Wayback Machine. Retrieved 13 September 2012.
  25. Manoj Mitta, Indian men can be raped, not sexually harassed Archived 2012-12-02 at the Wayback Machine, Times of India, 16 August 2012.
  26. Vikas Dhoot, http://articles.economictimes.indiatimes.com/2014-04-11/news/49058555_1_sexual-harassment-indian-women-male-harassment Abnormally high levels of sexual harassment for women at work places in UP, Times of India, 4 April 2014
  27. Trivedi, Anushka. "Sexual Harassment Law in India and Constitutional Challenges". iPleaders. Retrieved 9 October 2015.

బాహ్య లంకెలు మార్చు

బిల్లు టెక్స్ట్

ప్రెస్ వ్యాసాలు

ప్రసారాలు

పవర్ పాయింట్ ప్రెజెంటేషన్

కోర్సెస్

  • పశ్చిమ బెంగాల్ న్యాయ విశ్వవిద్యాలయం సమర్పించే ఆన్లైన్ ఎక్జెక్యుటివ్ ట్రైనింగ్ ఫర్ ఎచ్‌ఆర్ ప్రఫెషనల్స్, ఎక్స్టర్నల్ ఎక్స్పర్ట్స్ గురించి ఇక్కడ చూడండి .here