పన్నా (మధ్య ప్రదేశ్)

మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం

పన్నా మధ్య ప్రదేశ్‌ రాష్ట్రం, పన్నా జిల్లా లోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. ఇది వజ్రాల గనులకు ప్రసిద్ధి చెందింది.

పన్నా
పట్టణం
పన్నా is located in Madhya Pradesh
పన్నా
పన్నా
మధ్య ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 24°16′N 80°10′E / 24.27°N 80.17°E / 24.27; 80.17
దేశం India
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లాపన్నా
Elevation
410 మీ (1,350 అ.)
Population
 (2011)
 • Total59,091
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
ISO 3166 codeIN-MP
Vehicle registrationMP-35

మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటుకు నాయకత్వం వహించిన బుండేలా రాజ్‌పుత్ నాయకుడు ఛత్రసాల్, పన్నా రాజధానిగా చేసుకుని పాలించాడు. 1732 లో ఆయన మరణించిన తరువాత, అతని రాజ్యం అతని కొడుకులు విభజించుకున్నారు. రాజ్యంలో మూడింట ఒక వంతు అతని మిత్రపక్షమైన మరాఠా పేష్వా బాజీ రావు I కి వెళ్ళింది .

పన్నా రాజ్యం ఛత్రసాల్ పెద్ద కుమారుడు హార్డే సాహ్ వద్దకు వెళ్ళింది. 19 వ శతాబ్దం ప్రారంభంలో, పన్నా బ్రిటిష్ ఇండియాలో సంస్థానంగా మారింది. నాగోడ్, సోహవాల్ సంస్థానాలపై నియంత్రణ పొందింది. 1857 నాటి తిరుగుబాటులో రాజా నిర్పత్ సింగ్ బ్రిటిషు వారికి సహాయం చేసాడు. అందుకు ప్రతిగా బ్రిటిష్ వారు అతనికి మహారాజా అనే బిరుదును బహుమతిగా ఇచ్చారు. మహారాజా మహేంద్ర యాదవేంద్ర సింగ్ 1950 జనవరి 1 న తన సంస్థానాన్ని భారత దేసంలో కలిపేసాడు. ఈ రాజ్యం కొత్త భారత రాష్ట్రమైన వింధ్య ప్రదేశ్ లో పన్నా జిల్లాగా మారింది. వింధ్య ప్రదేశ్ 1956 నవంబరు 1 న మధ్యప్రదేశ్‌లో విలీనమైంది.

వజ్రాల గనులు మార్చు

వింధ్య పర్వత శ్రేణిలో ఈశాన్యదిశలో 240 కి.మీ. ఊరం పాటు విస్తరించి ఉన్న పన్నా సమూహాలలో వజ్రాల నిక్షేపాలున్నాయి. [1] వీటి మొత్తం విస్తీర్ణం 20 ఎకరాలకు మించదు. వజ్రాల కోసం 25 అడుగుల వ్యాసం, 30 అడుగుల లోతు ఉండే పెద్ద గుంటలను తవ్వారు. చాలా సందర్భాలలో వజ్రాలు దొరికేది చాలా సన్నని పొర లోనే. [2] జీన్-బాప్టిస్ట్ టావెర్నియర్ యొక్క 1676 'ట్రావెల్స్ ఇన్ ఇండియా' ను కూర్పు చేసిన వాలెంటైన్ బాల్ ప్రకారం, 1765 లో ఈ గనులను సందర్శించిన మొట్టమొదటి యూరోపియన్, టిఫెంటాలర్. పన్నా వజ్రాలు భారతదేశంలోని ఇతర ప్రదేశాలలో దొరికే వాటితో పోలిస్తే కాఠిన్యం, అగ్ని తక్కువని పేర్కొన్నాడు. ఈ ప్రాంతం నుండి పెద్ద వజ్రాలేమీ రాలేదు. అత్యంత ఉత్పాదక గనులు 1860 లలో, పన్నా నుండి 32 కి.మీ. దూరంలో ఉన్న సకారియాలో కనుగొన్నారు. పన్నా వజ్రాలకు నాలుగు వర్గీకరణలు ఇవ్వబడ్డాయి: మొదటిది, మోటిచుల్, స్పష్టమైనవి, మెరిసేవి; 2 వది, మాణిక్, మందమైన నారింజ రంగుతో; 3 వది పన్నా, ఆకుపచ్చ రంగులో ఉంటుంది; 4 వది బన్స్పుట్, సేపియా రంగు. పన్నాలోని వజ్రాల గనులను భారత ప్రభుత్వ జాతీయ ఖనిజ అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండిసి లిమిటెడ్) యొక్క డైమండ్ మైనింగ్ ప్రాజెక్ట్ కింద నిర్వహిస్తున్నారు. ఇతర గనులలో ప్రభుత్వ సంస్థ ప్రతి సంవత్సరం భూమిని కాబోయే మైనర్లకు లీజుకు ఇస్తుంది. వెలికితీసిన వజ్రాలన్నీ పన్నా జిల్లా మేజిస్ట్రేట్ సేకరించి జనవరి నెలలో వేలం వేస్తారు. రూ. 5000 డిపాజిట్ కట్టివేలంలో ప్రజలు పాల్గొనవచ్చు. వేర్వేరు క్యారెట్లు, వేర్వేరు రంగుల వజ్రాలు 100 కు పైగా వేలానికొస్తాయి.

పన్నా సంస్థానం మార్చు

  • బుండేలా రాజపుత్ర రాజా ఛత్రసాల్ (4 మే 1649 - 20 డిసెంబర్ 1731)
  • రాజా హార్డే సాహ్ (1731-1739)
  • రాజసభ సింగ్ (1739-1752)
  • రాజా అమన్ సింగ్ (1752-1758)
  • రాజా హిందూపత్ సింగ్ (1758–1778)
  • రాజా అనిరుధ్ సింగ్ (1778–1779)
  • మధ్యంతర స్థితి (1779–1785)
  • రాజా ధోకల్ సింగ్ (1785–1798)
  • రాజా కిషోర్ సింగ్ (1798-1834)
  • రాజా హర్బన్స్ రాయ్ (1834-1849)
  • మహారాజా మహేంద్ర నిర్పత్ సింగ్ (1849-1870)
  • మహారాజా రుద్ర ప్రతాప్ సింగ్ (1870-1893) 1848 లో జన్మించారు.
  • మహారాజా మహేంద్ర లోక్పాల్ సింగ్ (1893-1898)
  • మహారాజా మహేంద్ర మాధో సింగ్ (1898-1902)
  • మహారాజా మహేంద్ర యాద్వేంద్ర సింగ్ (1902-1 జనవరి 1950)

భౌగోళికం మార్చు

ఉంది.పన్నా 24°43′N 80°12′E / 24.72°N 80.2°E / 24.72; 80.2 వద్ద, [3] సముద్ర మట్ట్ం నుండి 406 మీటర్ల ఎత్తున

శీతోష్ణస్థితి మార్చు

పన్నాలో వేడి వేసవి, కొంత చల్లటి రుతుపవనాలు, చల్లటి శీతాకాలాలతో తేమతో కూడిన ఉపఉష్ణమండల శీతోష్ణస్థితి ( కొప్పెన్ క్లైమేట్ వర్గీకరణ Cwa ) ఉంది. జూన్ నుండి సెప్టెంబరు వరకు ఉండే వర్షాకాలంలో భారీ వర్షాలు కురుస్తాయి.

శీతోష్ణస్థితి డేటా - Panna (1981–2010, extremes 1970–2007)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 35.0
(95.0)
37.1
(98.8)
40.2
(104.4)
46.8
(116.2)
46.2
(115.2)
47.0
(116.6)
42.8
(109.0)
38.8
(101.8)
37.6
(99.7)
36.9
(98.4)
34.5
(94.1)
32.0
(89.6)
47.0
(116.6)
సగటు అధిక °C (°F) 23.0
(73.4)
25.8
(78.4)
31.5
(88.7)
37.3
(99.1)
40.8
(105.4)
38.5
(101.3)
32.3
(90.1)
30.4
(86.7)
30.6
(87.1)
31.0
(87.8)
27.8
(82.0)
24.1
(75.4)
31.1
(88.0)
సగటు అల్ప °C (°F) 8.2
(46.8)
9.9
(49.8)
15.5
(59.9)
20.6
(69.1)
25.0
(77.0)
24.6
(76.3)
21.8
(71.2)
20.9
(69.6)
20.4
(68.7)
17.2
(63.0)
12.5
(54.5)
9.4
(48.9)
17.1
(62.8)
అత్యల్ప రికార్డు °C (°F) −0.4
(31.3)
2.2
(36.0)
2.2
(36.0)
11.6
(52.9)
14.3
(57.7)
13.0
(55.4)
13.5
(56.3)
10.0
(50.0)
14.5
(58.1)
9.6
(49.3)
3.3
(37.9)
2.6
(36.7)
−0.4
(31.3)
సగటు వర్షపాతం mm (inches) 17.3
(0.68)
18.2
(0.72)
13.7
(0.54)
7.0
(0.28)
7.9
(0.31)
126.5
(4.98)
358.1
(14.10)
382.9
(15.07)
264.8
(10.43)
33.6
(1.32)
4.3
(0.17)
3.7
(0.15)
1,238.1
(48.74)
సగటు వర్షపాతపు రోజులు 1.3 1.4 1.4 1.0 0.6 6.2 13.4 15.0 9.5 1.7 0.5 0.7 52.8
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) 55 46 36 25 27 46 73 81 76 59 53 55 52
Source: India Meteorological Department[4][5]

రవాణా సౌకర్యాలు మార్చు

పన్నా విమానాశ్రయం ప్రస్తుతం పనిచేయడం లేదు. సమీపంలోని విమానాశ్రయం ఖాజురాహోలో ఉంది సమీప రైల్వేస్టేషను సత్నా. ఇది 75 కి.మీ దూరంలో ఉంది. ఖాజురహో 45 కి.మీ దూరంలో ఉంది. మధ్యప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలకు, న్యూ ఢిల్లీ, ఫరీదాబాద్, ఆగ్రా, కాన్పూర్, ఝాన్సీ, గ్వాలియర్, నాగ్‌పూర్, అలహాబాద్ వంటి కొన్ని ప్రదేశాలకు బస్సు సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇండోర్, గ్వాలియర్, జబల్పూర్, భోపాల్ స్లీపర్ / లగ్జరీ / ఎసి బస్సులు అందుబాటులో ఉన్నాయి.

జనాభా మార్చు

2011 జనగణన ప్రకారం, [6] పన్నా జనాభా 59,091. పన్నా అక్షరాస్యత 64.79%, ఇది జాతీయ సగటు 74.04% కన్నా తక్కువ: పురుషుల అక్షరాస్యత 74.14%, స్త్రీ అక్షరాస్యత 54..44%. పన్నా జనాభాలో 16.10% మంది ఆరేళ్ళ లోపు పిల్లలు.

మూలాలు మార్చు

  1. See for a more extensive geological explanation: Goodchild: Precious Stones (1908) Page 113 Archived 2014-08-19 at the Wayback Machine
  2. "Streeter: Precious Stones and Gems, (1899) on Indian Diamonds". Archived from the original on 22 May 2011. Retrieved 16 December 2006.
  3. Falling Rain Genomics, Inc - Panna
  4. "Station: Panna Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 587–588. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 6 January 2021.
  5. "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M126. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 6 January 2021.
  6. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.