పరదేశి (1998 సినిమా)
పరదేశి కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన తెలుగు కామెడీ చిత్రం . ఈ చిత్రంలో విశ్వాస్, మాధవ్ దల్వి, తనూజా, మొన్నెట్ నటించారు.[2] ఈ చిత్రాన్ని ప్రధానంగా USA లో 93 రోజుల షెడ్యూల్‌లో చిత్రీకరించారు.
పరదేశి | |
---|---|
దర్శకత్వం | కె.రాఘవేంద్రరావు |
నిర్మాత | సి. అశ్వనీ దత్ అల్లు అరవింద్ |
తారాగణం | మాధవ్, మోనా, తనూజ, విశ్వ |
ఛాయాగ్రహణం | వి. జయరామ్ |
కూర్పు | మార్తాండ్ కె వెంకటేష్ |
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | జనవరి 14, 1998[1] |
భాష | తెలుగు |
కథ
మార్చుజువ్వలపాలెం గ్రామంలో రాయుడు, నాయుడు అనే పెద్ద మనుషులు ఉంటారు. రాయుడు దండిగా పొలాలు ఉన్న మోతుబరి రైతు. నాయుడు మంచి పాడిసంపద ఉన్న వాడు. ఇద్దరూ ఒకప్పుడు స్నేహితులైనా చిన్న పంతాలకు పోయి ఒకరి మీద ఒకరు చెణుకులు విసురుకుంటూ ఉంటారు. వారిద్దరు కొడుకులు గోపాల్, కృష్ణ మాత్రం మంచి స్నేహితులు. రాయుడి చిన్ననాటి స్నేహితుడు బంగార్రాజు అమెరికాలో బాగా స్థిరపడిన ధనవంతుడు. అతనికి ఒకే కూతురు ఉంటుంది. బంగార్రాజు తన కూతురిని రాయుడి కొడుక్కిచ్చి పెళ్ళి చేయాలని అనుకుని అతన్ని తన దగ్గరకు పంపించమంటాడు. నాయుడు కూడా రాయుడి మీద పోటీగా తన కొడుకు కృష్ణను కూడా అమెరికాకు పంపించడానికి ఏర్పాట్లు చేస్తాడు. స్నేహితులిద్దరూ అమెరికా వెళుతున్నందుకు సంతోషిస్తారు. అయితే గోపాల్ కి మాత్రం బంగార్రాజు కూతురిని పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేక కృష్ణని తన స్థానంలో వెళ్ళమని, అతని స్థానంలో తను ఉంటానని చెప్పి ఒప్పిస్తాడు.
అమెరికా చేరగానే బంగార్రాజు కుటుంబానికి కూడా మార్చుకున్న పేర్లతోనే పరిచయమవుతారు. కృష్ణకు బంగార్రాజు కూతురు, కుటుంబం ఇద్దరూ నచ్చేస్తారు.
తారాగణం
మార్చు- కృష్ణుడిగా విశ్వ (సురేష్ నాయర్), నాయుడి కొడుకు
- గోపాల్ పాత్రలో మాధవ్ దల్వి, రాయుడి కొడుకు
- జ్యోతిగా తనూజ, బంగార్రాజు కూతురు
- కేథరీన్గా మొన్నెట్
- హార్మోనియం అప్పారావుగా బ్రహ్మానందం
- బూరెల బంగార్రాజుగా ఎ.వి.ఎస్
- రాయుడుగా తనికెళ్ళ భరణి
- నాయుడుగా బాబు మోహన్
- మనోరమ
- చిట్టిబాబు
- అనంత్
పాటలు
మార్చుసంగీతాన్ని పూర్తిగా సమకూర్చినవారు: ఎం.ఎం. కీరవాణి.
సం. | పాట | పాట రచయిత | గాయనీ గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
0. | Untitled | సాహిత్యం | ||
1. | "తెలుగింటి పెరటిలోన" | చంద్రబోస్ (రచయిత) | కె.ఎస్. చిత్ర, ఉన్నికృష్ణన్ | |
2. | "చందన చర్చిత" | వేటూరి సుందరరామమూర్తి | మనో, సంగీత, మాల్గాడి శుభ | |
3. | "బూరెల వారి అమ్మాయికి" | చంద్రబోస్ | మనో, స్వర్ణలత, సంగీత, కీరవాణి, చంద్రబోస్, మాల్గాడి శుభ | |
4. | "బొండుమల్లి బుగ్గ మీద" | చంద్రబోస్ | రాజేష్, సౌమ్య, మాల్గాడి శుభ, తబిత, ఉన్నికృష్ణన్, స్వర్ణలత | |
5. | "జగతి సిగలో" | వేటూరి సుందరరామమూర్తి | సుజాతా మోహన్, కీరవాణి | |
6. | "మైలీ మైలీ" | చంద్రబోస్ | కె.ఎస్. చిత్ర, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | |
7. | "చూసారా" | చంద్రబోస్ | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, మాల్గాడి శుభ | |
8. | "తణుకో అరకో" | చంద్రబోస్ | సుజాతా మోహన్, మనో | |
9. | "పరదేశీ" | చంద్రబోస్ | మనో, మాల్గాడి శుభ |