పరశురామక్షేత్రాలు

మహారాష్ట్రలోని కొంకణ తీరం,కర్ణాటక, కేరళ తీర ప్రాంతాలలోని కొన్ని క్షేత్రాలను పరశురామ క్షేత్రాలుగా పేర్కొంటారు. మన దేశంలో ఉడిపి, కొల్లూరు, గోకర్ణ, కుక్కే సుబ్రమణ్య/సుబ్రమణ్య, శంకరనారాయణ, కుంభాసి/ఆనేగడ్డ, కోటేశ్వర అనే 7 పరశురామ క్షేత్రాలున్నాయి. ఇవి కాక రాజస్థాన్‌లోని కుంభాల్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లోని జానా పావ్‌ ప్రాంతాల్లో కూడా అతని ఆలయాలున్నాయి. అరుణాచల్‌ప్రదేశ్‌లోని లోహిత్‌ జిల్లాలో పరశురామ కుండం ఉంది. ఈ కుండంలో స్నానం వల్ల పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా మకర సంక్రాంతి రోజున అక్కడ స్నానం చేస్తే ఎంతో పుణ్యప్రదమని భావిస్తారు.

కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం

విశేషాలుసవరించు

దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన పరశురామ క్షేత్రం కేరళలోని తిరువల్లంలో ఉంది. ఇది కేరళలో ఉన్న ఏకైక పరశురామ ఆలయం. తిరువల్లంలోని పరశురామాలయాన్ని 12, 13 శతాబ్దాల్లో పాండ్య రాజులు నిర్మించారని చెబుతారు. ఇది జాతీయ ప్రాధాన్యత గల వారసత్వ స్థలాల్లో ఒకటిగా గుర్తింపును పొందింది. ఈ ఆలయం కర్మా నది ఒడ్డున ఉంది. ఈ ఆలయాన్ని సందర్శించినవారు దానిలో స్నానం చేసి పితృ దేవతలను ఆరాధిస్తారు. కేరళలో పరశురాముని ఎక్కువగా ఆరాధిస్తారు. కేరళ పరశురాముని వల్లనే ఆవిర్భ వించిందని చెబుతారు. ఒకప్పుడు మదమెక్కిన రాజులందరినీ సంహరించిన పరశు రాముడు భూమండలంలో అటువంటివారు లేకుండా జైత్ర యాత్ర చేసి తనకు లభించిన భూభాగాన్నంతా మరొకరికి దానం చేశాడు. అయితే తాను భూమినంతా దానం చేసినందున, తాను ఆ దానం చేసిన భూమిలో ఉండకూడదని నిర్ణయించుకుని సముద్రుణ్ని వెనకకు వెళ్లిపొమ్మని చెబుతాడు. సముద్రుడు వెనుకకు పోయినపుడు ఏర్పడిన స్థానంలో తాను ఆశ్రమం ఏర్పరచుకున్నాడని, ఆ ప్రాంతమే కేరళ అని చెబుతారు.[1] ఇలా వెలువడ్డ భూమిలో గల 7 ముఖ్యమైన ప్రదేశాలను పరశురామక్షేత్రాలు అని అంటారు. ఈ క్షేత్రాలు అన్నీ కర్ణాటక రాష్ట్రం పశ్చిమ కనుమలలో ఉన్నాయి.

మూలాలుసవరించు

  1. "పుణ్య‌ప్ర‌దాలు ప‌ర‌శురామ క్షేత్రాలు… – Andhra Prabha Telugu Daily" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-06-27.[permanent dead link]

బాహ్య లంకెలుసవరించు