పర్దీప్ చౌదరి హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009, 2019 శాసనసభ ఎన్నికలలో కల్కా నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

పర్దీప్ చౌదరి

పదవీ కాలం
2019 – 2024
ముందు లతికా శర్మ
తరువాత శక్తి రాణి శర్మ
నియోజకవర్గం కల్కా
పదవీ కాలం
2009 – 2014
ముందు చందర్ మోహన్ బిష్ణోయ్
తరువాత లతికా శర్మ
నియోజకవర్గం కల్కా

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్

రాజకీయ జీవితం

మార్చు

పర్దీప్ చౌదరి ఇండియన్ నేషనల్ లోక్ దళ్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2005 శాసనసభ ఎన్నికలలో కల్కా నుండి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2009 శాసనసభ ఎన్నికలలో ఐఎన్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సత్వీందర్ సింగ్ రాణాపై 21,187 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

పర్దీప్ చౌదరి 2014 శాసనసభ ఎన్నికలలో కల్కా నుండి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి లతికా శర్మ చేతిలో ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి 2019 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి లతికా శర్మపై 5,931 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3] పర్దీప్ చౌదరి 2024 శాసనసభ ఎన్నికలలో కల్కా నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి శక్తి రాణి శర్మ చేతిలో ఓడిపోయాడు.[4]

మూలాలు

మార్చు
  1. Hindustantimes (11 September 2024). "Report card: Kalka ignored, MLA Pradeep Chaudhary shares blame for slow progress". Archived from the original on 12 November 2024. Retrieved 12 November 2024.
  2. India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  3. India TV (24 October 2019). "Haryana Election Results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 7 November 2024. Retrieved 7 November 2024.
  4. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Kalka". Archived from the original on 12 November 2024. Retrieved 12 November 2024.