శక్తి రాణి శర్మ

హర్యానా రాజకీయ నాయకురాలు, శాసనసభ్యురాలు

శక్తి రాణి శర్మ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024లో జరిగిన హర్యానా శాసనసభ ఎన్నికలలో కల్కా నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1]

శక్తి రాణి శర్మ

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
ముందు పర్దీప్ చౌదరి
నియోజకవర్గం కల్కా

వ్యక్తిగత వివరాలు

జీవిత భాగస్వామి వినోద్ శర్మ
సంతానం కార్తికేయ శర్మ, సిద్ధార్థ్ వశిష్ట్ (మను శర్మ)
వృత్తి రాజకీయ నాయకురాలు

శక్తి రాణి శర్మ హర్యానా జనచేత్నా పార్టీ  టిక్కెట్‌పై డిసెంబర్ 2020లో అంబాలా సిటీ  మేయర్‌గా ఎన్నికైంది.[2]

రాజకీయ జీవితం

మార్చు

శక్తి రాణి శర్మ 2024లో జరిగిన హర్యానార్ శాసనసభ ఎన్నికలలో కల్కా నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి పర్దీప్ చౌదరిపై 10883 ఓట్లు మెజారిటీ గెలిచి మొదటిసారి శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైంది. శక్తి రాణి శర్మకు 60612 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి పర్దీప్ చౌదరికి 49729 ఓట్లు వచ్చాయి.[3][4][5]

మూలాలు

మార్చు
  1. The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. The Times of India (14 January 2021). "Shakti Rani takes oath as mayor of Ambala city municipal corporation, Congress elected member joins Haryana Jan Chetna Party". Retrieved 24 October 2024.
  3. ThePrint (2 September 2024). "Who is Shakti Rani Sharma, Ambala's 1st woman mayor, Manu Sharma's mother & now a BJP member". Retrieved 24 October 2024.
  4. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Kalka". Archived from the original on 12 November 2024. Retrieved 12 November 2024.
  5. Hindustantimes (9 October 2024). "Shakti Rani's parachute lands in Kalka, BJP wrests seat from Congress". Retrieved 24 October 2024.