పర్వతనేని మల్లిఖార్జునరావు

సినీ నిర్మాత

పర్వతనేని మల్లిఖార్జునరావు సుప్రసిద్ధ సినిమా నిర్మాత.ఆయన 70వ దశకంలో తెలుగులో అనేక మంచి చిత్రాలను నిర్మించారు.

పర్వతనేని మల్లిఖార్జునరావు
పర్వతనేని మల్లిఖార్జునరావు
జననంపర్వతనేని మల్లిఖార్జునరావు
1935, జులై 27
కృష్ణా జిల్లా
మరణంఫిబ్రవరి 21 2012
హైదరాబాద్‌,మెడ్విన్‌ ఆసుపత్రి
ప్రసిద్ధితెలుగు సినిమా నిర్మాత

జీవిత విశేషాలు మార్చు

ఆయన 1935 జూలై 27న కృష్ణా జిల్లాలో జన్మించారు.

సినిమా ప్రస్థానం మార్చు

ఆయన సినిమాలపై మక్కువతో మధుపిక్చర్‌, భారతీ ఇంటర్‌, నేషనల్‌, సునందిని పిక్చర్స్‌ పతాకంపై పలు తెలుగు, హిందీ చిత్రాలను నిర్మించారు. 1965లో జ్వాలాద్వీప రహస్యం (కాంతారావు- విఠలాచార్య)..ఆయన తొలి చిత్రం. ఆ తర్వాత ఇద్దరు మొనగాళ్ళు, మంచి కుటుంబం, మంచి మిత్రులు, ఇంటి గౌరవం, ఇంటికోడలు, మహాబలుడు, నేనంటే నేనే తదితర చిత్రాలను నిర్మించారు. హిందీలో హిమ్మత్‌ (జితేంద్రతో), కీమత్‌ (ధర్మేంద్ర, రేఖ), మౌసుమ్‌ (సంజరుకుమార్‌) చిత్రాలను నిర్మించారు. 1976లో ఈ చిత్రానికి రాష్ట్రపతి ప్రశంసలు లభించాయి. ఇవికాక సంజోగ్‌, ఆగాడిన్‌ ఆదిరాత్‌, ఏతో ఖనాల్‌ హోగయా, ఏ దేశ్‌, ఈశ్వర్‌ తదితర చిత్రాలు నిర్మించారు. జ్వాలాద్వీప రహస్యం, ఇద్దరు మొనగాళ్లు, మంచి కుటుంబం, మంచి మిత్రులు, ఇంటి గౌరవం, ఇంటి కోడలు, మహాబలుడు, నేనంటే నేనే లాంటి చిత్రాలను నిర్మించి తెలుగు ప్రేక్షకుల అభిమానం పొందారు. బాలీవుడ్‌ లో కూడా హిమ్మత్, కీమత్, వౌసమ్, సంజోగ్, ఏతో ఖమాల్ హోగయా, ఏ దేశ్, ఈశ్వర్ వంటి చిత్రాలను నిర్మించి తెలుగు పతాకాన్ని ముంబాయిలో ఎగురవేశారు. 1976లో రాష్ట్రపతి ప్రశంసలు అందుకున్నారు.[1]

వ్యక్తిగత జీవితం మార్చు

ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

మరణం మార్చు

పర్వతనేని మల్లిఖార్జునరావు (76) 2012 ఫిబ్రవరి 21 న హైదరాబాద్‌లోని మెడ్విన్‌ ఆసుపత్రిలో అనారోగ్యంతో మృతి చెందారు.

మూలాలు మార్చు

ఇతర లింకులు మార్చు