మంచి మిత్రులు (ఆంగ్లం: Good Friends) చిత్రం తొలుత తమిళంలో 1967లో ఏవీయం సంస్థ ‘పందియము’గా నిర్మించింది. జెమినీ గణేశన్, ఏఎం రాజన్, వెన్నిరాడై నిర్మల ప్రధాన పాత్రలు పోషించారు. ఆ చిత్రానికి కాశీలింగం దర్శకత్వం వహించారు. సంగీతం టి.ఆర్.పాపయ్య, నిర్మాత ఎం.కె.ఎం.వేణు. తరువాత ఈ చిత్రాన్ని తెలుగులోనూ, హిందీలోనూ రూపొందించారు. 1969లో మంచి మిత్రులు తెలుగులో విడుదలైంది. It is remade in Malayalam as inyam kaanaam with Prem Nazeer and Vincent, హిందీలో ‘సచ్చాయి’ టైటిల్‌తో వచ్చిన చిత్రానికి కె.శంకర్ దర్శకత్వం వహించాడు. శంకర్ జైకిషన్ సంగీతం సమకూర్చగా సంజీవ్‌కుమార్, షమీకపూర్, సాధన ముఖ్య పాత్రలు పోషించారు. ఎం.సి.రామమూర్తి హిందీ చిత్రాన్ని నిర్మించాడు[1].

మంచి మిత్రులు
(1968 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం టి.రామారావు
నిర్మాణం పి. మల్లికార్జునరావు
తారాగణం కృష్ణ,
విజయనిర్మల,
నాగభూషణం,
చలం,
గీతాంజలి
శోభన్ బాబు
సంగీతం ఎస్.పీ. కోదండపాణి
నిర్మాణ సంస్థ మధు పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

గోపి (కృష్ణ), శ్రీను (శోభన్‌బాబు) స్నేహితులు. ఒకే రూములో కలిసి జీవిస్తుంటారు. గోపికి ఆవేశం ఎక్కువ. శ్రీను సమయానుకూలంగా సర్దుకుపోతుంటాడు. ఒకనాడు ఆఫీసర్‌తో వచ్చిన చిన్న తగాదా కారణంగా గోపి ఉద్యోగం పోగొట్టుకుంటాడు. ఈ సంఘటన గోపి, శ్రీను మధ్య మాట పట్టింపునకు కారణమవుతుంది. దీంతో ఐదేళ్లపాటు ఇరువురూ విడివిడిగా జీవించి, ఆ తరువాత కలుసుకుందామని నిర్ణయించుకుంటారు. పట్నం చేరిన గోపి ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలుడవుతాడు. మంచికి పోగా చెడు ఎదురవటంతో అనుకోకుండా ఓ నేరంలో చిక్కుకోబోవటం, దాన్నించి తనను రక్షించిన గజదొంగ పశుపతి (నాగభూషణం)ని విడిపించే ప్రయత్నంలో తానే పెద్ద నేరస్తుడిగా, గజదొంగ గంగారాంగా మారడం జరుగుతుంది. పశుపతి చెల్లెలు మీనా (గీతాంజలి) గంగారాంను ఇష్టపడుతుంది. వేరే వూరుచేరిన శ్రీను అనుకోకుండా గోపి తల్లిని, చెల్లెలు ఇందిర (విజయనిర్మల)ను కలుసుకుంటాడు. వాళ్లింట అవుట్‌హౌవుస్‌లో ఉంటున్న మాలోకం (చలం) గదిలో ఆశ్రయం పొందుతాడు. అలా ఇందిర ప్రేమను, ఇన్‌స్పెక్టరుగా ఉద్యోగాన్ని సంపాదిస్తాడు. గంగారాంను అరెస్ట్ చేయటానికి స్పెషల్ డ్యూటీమీద శ్రీను హైద్రాబాదు వస్తాడు. అయితే, తల్లి మరణించటంతో ఇందిర కూడా హైద్రాబాదులోని గంగారాం వద్దకు చేరుకుంటుంది. గంగారాం ప్రయత్నాలను శ్రీనివాస్‌గా విఫలం చేస్తుంటాడు. ఆక్రమంలో ఐదేళ్ల అనంతరం తమ సంకేత స్థలంలో కలుసుకున్నపుడు, ఎవరెవరో నిజం తెలిసికోవటం జరుగుతుంది. తరువాత గంగారాంను బంధించాలని శ్రీనివాస్, శ్రీనివాస్‌ను అంతం చేయాలని గంగారాం.. ఇద్దరూ బుల్లెట్ లేని తుపాకీలతో రావటం, మరో పోలీసు కాల్చిన తూటాతో గంగారాం గాయపడగా, మిత్రులిద్దరూ ఒకరినొకరు కౌగలించుకొని దుఃఖించటం, గంగారాం మరణించటంతో చిత్రం ముగుస్తుంది[1]. Hero Krishna getup and action are highlight in this movie.

పాటలు

మార్చు
  1. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురౌతుంటే- ఇన్నినాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసి పోతుంటే - ఘంటసాల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: సినారె
  2. ఎంతో వున్నది అంతు తెలియనిది తెలియాలంటే కలుసుకొమ్మన్నది - పి.సుశీల
  3. ఓరచూపులు చూడకముందే ఒళ్ళు ఎందుకే ఝల్లుమనే చేతితో - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన:ఆరుద్ర
  4. నాలుగువైపులు గిరిగీసి ఆపై సన్నని తెరవేసి ఎదురు ఎదురుగా - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
  5. అరె నిషా నిషా మజామజా నీకు కావాలా - పి.సుశీల

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి (19 January 2019). "ఫ్లాష్ బ్యాక్ @ 50 మంచి మిత్రులు". ఆంధ్రభూమి దినపత్రిక. Retrieved 25 January 2019.
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.