పర్వేజ్ రసూల్

జమ్మూ - కాశ్మీర్ కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు

పర్వేజ్ గులాం రసూల్ జర్గర్, జమ్మూ - కాశ్మీర్ కు చెందిన క్రికెటర్. ఆల్ రౌండర్‌గా గుర్తింపు పొందాడు.[1] కుడిచేతి వాటంబ్యాట్స్‌మన్, ఆఫ్‌బ్రేక్ బౌలర్. జమ్మూ-కాశ్మీర్ జట్టుకు కెప్టెన్ గా, భారతదేశం ఎ ఆటగాడిగా కొనసాగాడు. 2014 ఐపిఎల్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ద్వారా 95 lakh (US$1,20,000) కొనుగోలు చేశారు.[2] జమ్మూ-కాశ్మీర్‌కు చెందిన మిథున్ మన్హాస్ తర్వాత ఐపిఎల్ లో ఆడిన రెండవ క్రికెటర్ గా వన్డేలు, టీ20లలో భారత జాతీయ జట్టుకు ఆడిన రాష్ట్రం నుండి మొదటి క్రికెటర్ గా నిలిచాడు. తన అంతర్జాతీయ కెరీర్‌లో 1 టీ20, ఒక వన్డే మాత్రమే ఆడాడు.

పర్వేజ్ రసూల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
పర్వేజ్ గులాం రసూల్ జర్గర్
పుట్టిన తేదీ (1989-02-13) 1989 ఫిబ్రవరి 13 (వయసు 35)
బిజ్‌బెహరా, అనంత్‌నాగ్ జిల్లా, కాశ్మీర్‌
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక వన్‌డే (క్యాప్ 18)2014 జూన్ 15 - బంగ్లాదేశ్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.18
ఏకైక T20I (క్యాప్ 67)2017 జనవరి 26 - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2009–ప్రస్తుతంజమ్మూ - కాశ్మీర్
2013పుణె వారియర్స్ ఇండియా (స్క్వాడ్ నం. 21)
2014–2015సన్‌రైజర్స్ హైదరాబాద్ (స్క్వాడ్ నం. 21)
2016రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (స్క్వాడ్ నం. 1)
కెరీర్ గణాంకాలు
పోటీ వన్ డే ట్వంటీ20 ఫస్ట్-క్లాస్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 1 1 85 143
చేసిన పరుగులు 5 4,886 3,550
బ్యాటింగు సగటు 5.00 37.00 33.20
100లు/50లు 0/0 12/20 1/28
అత్యుత్తమ స్కోరు 5 182 118*
వేసిన బంతులు 60 24 16,429 6,489
వికెట్లు 2 1 282 171
బౌలింగు సగటు 30.00 32.0 28.31 33.94
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 18 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 4 0
అత్యుత్తమ బౌలింగు 2/60 1/32 8/85 5/29
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 0/– 49/– 41/–
మూలం: Cricinfo, 2022 జూలై 9

2013లో జింబాబ్వే పర్యటన కోసం జాతీయ జట్టుకు తన తొలి కాల్-అప్ అందుకున్నాడు. 2014 జూన్ 15న మీర్పూర్‌లో బంగ్లాదేశ్‌పై జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2017లో ఇంగ్లాండ్‌పై తన తొలి టీ20 ఆడే అవకాశాన్ని పొందాడు, అక్కడ ఇయాన్ మోర్గాన్‌ను అవుట్ చేసి, మొదటి టీ20 అంతర్జాతీయ వికెట్‌ను పొందాడు. ఇతని బౌలింగ్ గణాంకాలు 4 ఓవర్లలో 1/32గా ఉన్నాయి.

తొలి జీవితం

మార్చు

రసూల్ 1989, ఫిబ్రవరి 13న కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని బిజ్‌బెహరాలో జన్మించాడు. జమ్మూ-కాశ్మీర్‌కు ఆడటానికి ముందు జమ్మూ-కాశ్మీర్‌కు మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అబ్దుల్ ఖయూమ్ శిక్షణ ఇచ్చాడు. రసూల్ తండ్రి గులాం రసూల్, సోదరుడు ఆసిఫ్ రసూల్ కూడా పోటీ క్రికెట్ ఆడారు.[3][4][5]

అంతర్జాతీయ క్రికెట్

మార్చు

2013లో జింబాబ్వే పర్యటన కోసం జాతీయ జట్టుకు తన తొలి కాల్-అప్ పొందాడు. జమ్మూ-కాశ్మీర్ నుండి వివేక్ రజ్దాన్ తర్వాత జాతీయ జట్టుకు ఎంపికైన రెండవ క్రికెటర్ గా నిలిచాడు, కానీ ఆ పర్యటనలో ఏ మ్యాచ్ లో కూడా ఆడలేదు.[6][7]

2014 జూన్ లో మిర్పూర్‌లో బంగ్లాదేశ్‌పై భారత్‌కు ప్రాతినిధ్యం వహించి 10 ఓవర్లలో 60 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.[8] ఇద్దరు సాధారణ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు విశ్రాంతి ఇచ్చిన తర్వాత 2017 జనవరిలో ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు.[9] కాన్పూర్‌లో 2017 జనవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు, అక్కడ 4 ఓవర్లలో ఒక వికెట్ తీశాడు. బ్యాటింగ్ లో 5 పరుగులు కూడా చేశాడు.

వ్యక్తిగత జీవితం

మార్చు

2017 ఆగస్టులో షోపియాన్ జిల్లాలోని శ్రీనగర్-షోపియాన్ హైవేపై ఉన్న రాణిపోరా అనే గ్రామానికి చెందిన అమ్మాయిని రసూల్ వివాహం చేసుకున్నాడు.[10][11][12] ఇతని భార్య కాశ్మీర్ విశ్వవిద్యాలయ విద్యార్థిని, అరబిక్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.[13]

మూలాలు

మార్చు
  1. "Meet Parvez Rasool, Jammu and Kashmir's first player in Team India". NDTV.com. 6 July 2013.
  2. "Archived copy". Archived from the original on 24 February 2014. Retrieved 2023-08-16.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  3. "Valley angry, but Rasool's family keeps calm". The Hindu. Chennai, India. 3 August 2013.
  4. "No shortage of talent in J&K: Rasool". Wisden India. 18 February 2013. Archived from the original on 11 August 2013. Retrieved 2023-08-16.
  5. "J&K spinner Parvez Rassol pins hopes on IPL, wishes to play for India | India vs Australia 2013". Sports.ndtv.com. 12 February 2013. Archived from the original on 2013-02-15. Retrieved 2023-08-16.
  6. "Rasool, Mohit get maiden call-ups; Kohli to lead". ESPNcricinfo. 5 July 2013. Retrieved 2023-08-16.
  7. "I am confident of representing my country: Parvez Rasool". NDTVSports.com.
  8. "Parvez Rasool breaks jinx for Jammu & Kashmir". ESPNcricinfo.
  9. "I am an improved bowler now - Rasool". ESPNcricinfo. Retrieved 2023-08-16.
  10. "Kashmiri cricketer Parvez Rasool married – State Observer". www.stateobserver.com. Archived from the original on 2017-08-25.
  11. "Parvez Rasool ties his knots with a post graduate from the University of Kanpur". 8 August 2017.
  12. "Parvez Rasool not to shift State, will play for JK in Ranji trophy". Archived from the original on 15 December 2018. Retrieved 2023-08-16.
  13. Network, KL News (2017-08-07). "Kashmiri cricketer Parvez Rasool married". Kashmir Life. Retrieved 2023-08-16.

బయటి లింకులు

మార్చు