పలాస కాశీబుగ్గ

ఆంధ్ర ప్రదేశ్, శ్రీకాకుళం జిల్లా లోని పట్టణం
(పలాస నుండి దారిమార్పు చెందింది)

పలాస కాశీబుగ్గ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం, పలాస మండలానికి చెందిన పట్టణం, మండల కేంద్రం. ఇది శ్రీకాకుళం జిల్లాకి అనాదిగా వాణిజ్య కేంద్రం. పలాస జీడిపప్పు ఇక్కడి ప్రముఖ ఉత్పత్తి. పలాస రైల్వే స్టేషను శ్రీకాకుళం జిల్లాలో పెద్ద స్టేషను. సంక్రాంతి నాడు జరిగే డేకురు కొండ యాత్ర ఇక్కడి ప్రముఖ ఉత్సవం.

పలాస కాశీబుగ్గ
పట్నం
పలాస ప్రధాన రహదారి
పలాస ప్రధాన రహదారి
Nickname: 
White Gold City
పలాస కాశీబుగ్గ is located in ఆంధ్రప్రదేశ్
పలాస కాశీబుగ్గ
పలాస కాశీబుగ్గ
Location in Andhra Pradesh, India
Coordinates: 18°46′23″N 84°24′28″E / 18.773095°N 84.407830°E / 18.773095; 84.407830
Countryభారత దేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీకాకుళం
Government
 • Typeపురపాలకసంఘం
 • Bodyపలాస కాశీబుగ్గ పురపాలక సంఘం, SUDA
విస్తీర్ణం
 • Total42.75 కి.మీ2 (16.51 చ. మై)
Elevation
38 మీ (125 అ.)
జనాభా
 (2011)[2]
 • Total57,507
 • జనసాంద్రత1,300/కి.మీ2 (3,500/చ. మై.)
భాషలు
 • అధికారతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
532221,532222
టెలిఫోన్ కోడ్08945
Vehicle registrationAP–39
కాశీబుగ్గ వీధి

చరిత్ర

మార్చు
 
పలాస కాశీబుగ్గ ప్రధాన కూడలి

1995 వరకూ పలాస, కాశీబుగ్గ గ్రామ పంచాయితీలు. 1996, నవంబరు 22 న నగరపంచాయతీలుగా ఏర్పడ్డాయి. వీటితో పాటు, చుట్టుప్రక్క గ్రామాలు కొన్నింటిని కలిపి 2002లో మున్సిపాలిటీగా ఏర్పాటైంది.

భౌగోళికం

మార్చు

జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంకు ఈశాన్యంగా 81 కి.మీ దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు

మార్చు

2011 జనగణన ప్రకారం జనాభా 57,507.

పరిపాలన

మార్చు

పలాస కాశీబుగ్గ పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

విద్యా సౌకర్యాలు

మార్చు

ప్రధాన భాష తెలుగు అయ్యినప్పటికి ఒరియా కూడా బాగా ప్రాచుర్యంలో ఉంది. తెలుగు బడులతో సమానంగా ఒరియా బడులు కూడా ఉన్నాయి.

పర్యాటక ఆకర్షణలు

మార్చు

డేకురు కొండ యాత్ర

మార్చు
 

పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల సమీపంలోని డేకురుకొండ యాత్ర ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినాన జరుగుతుంది. పిల్లలు లేనివారు కొండపైనుంది జారితే పిల్లలు పుడతారని ఇక్కడ ప్రజల నమ్మకము. ఈ విదంగా పలువురు జారుతూ ఉంటారు. ఈ కొండపై ఈశ్వరాలయం, సంతోషిమాత, నాగదేవత ఆలయాలు ఉన్నాయి.

మూలాలు

మార్చు
  1. "STATISTICAL INFORMATION OF ULBs & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. p. 1. Archived from the original (PDF) on 17 జూలై 2019. Retrieved 24 April 2019.
  2. "Census of India Search details". censusindia.gov.in. Retrieved 10 May 2015.

వెలుపలి లంకెలు

మార్చు