పల్లపాడు

ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలోని గ్రామం

పల్లపాడు, గుంటూరు జిల్లా, వట్టిచెరుకూరు మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన వట్టిచెరుకూరు నుండి 7 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గుంటూరు నుండి 20 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1246 ఇళ్లతో, 4072 జనాభాతో 1454 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1992, ఆడవారి సంఖ్య 2080. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1065 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 115. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590317.[1]

పల్లపాడు
—  రెవెన్యూ గ్రామం  —
పల్లపాడు is located in Andhra Pradesh
పల్లపాడు
పల్లపాడు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°09′45″N 80°23′54″E / 16.162503°N 80.398319°E / 16.162503; 80.398319
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం వట్టిచెరుకూరు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ పల్లపాటి పౌలు
జనాభా (2011)
 - మొత్తం 4,072
 - పురుషుల సంఖ్య 1,992
 - స్త్రీల సంఖ్య 2,080
 - గృహాల సంఖ్య 1,246
పిన్ కోడ్ 522017
ఎస్.టి.డి కోడ్ 0863

సమీప గ్రామాలు మార్చు

యామర్రు 3 కి.మీ, వట్టిచెరుకూరు 4 కి.మీ, పాతమల్లాయపాలెం 4 కి.మీ, లింగంగుంటపాలెం 4 కి.మీ, మల్లాయపాలెం 4 కి.మీ

గ్రామ చరిత్ర మార్చు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[2]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు మార్చు

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

విద్యా సౌకర్యాలు మార్చు

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి వట్టిచెరుకూరులో ఉంది. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల గుంటూరులోను, ఇంజనీరింగ్ కళాశాల కొర్నెపాడులోనూ ఉన్నాయి. సమీప మేనేజిమెంటు కళాశాల కొర్నెపాడులోను, వైద్య కళాశాల, పాలీటెక్నిక్‌లు గుంటూరులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరులో ఉన్నాయి.

వైద్య సౌకర్యం మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం మార్చు

పల్లపాడులో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. డిస్పెన్సరీ, పశు వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం మార్చు

గ్రామంలో4 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.

తాగు నీరు మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం మార్చు

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామం సంపూర్ణ పారిశుధ్య పథకం కిందకు రావట్లేదు. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు మార్చు

పల్లపాడులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు మార్చు

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రోజువారీ మార్కెట్, వారం వారం సంత గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు మార్చు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో పబ్లిక్ రీడింగ్ రూం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 20 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం మార్చు

పల్లపాడులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 171 హెక్టార్లు
  • బంజరు భూమి: 89 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1192 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 681 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 600 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు మార్చు

పల్లపాడులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 600 హెక్టార్లు

ఉత్పత్తి మార్చు

పల్లపాడులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు మార్చు

వరి, ప్రత్తి, మిరప

పారిశ్రామిక ఉత్పత్తులు మార్చు

బియ్యం

గ్రామ పంచాయతీ మార్చు

ప్రముఖులు మార్చు

  1. 1.కొర్రపాటి వెంకటసుబ్బయ్య పల్లపాడు గ్రామ పంచాయతీ 1932 లో ఏర్పడింది. 1936లోనూ మరియూ 1939లోనూ సర్పంచి పదవిని ఏకగ్రీవంగా చేపట్టిన శ్రీ కొర్రపాటి వెంకటసుబ్బయ్య, 1956 వరకూ, 3 సార్లు ఏకగ్రీవంగానూ, ఒకసారి ఎన్నికల ద్వారానూ, సర్పంచి పదవిని చేపట్టారు. ఆయన తన పదవీ కాలంలో గ్రామసేవక్లే అంకితమైనారు. సౌపాడు గ్రామానికి వెళ్ళే మార్గంలో లెవెల్ చప్టా నిర్మాణం, తాగునీటి చెరువులో పూడీకతీత, ఇసుకతో అంతర్గత రహదారుల నిర్మాణం తదితర పనులు చేశారు. వెంటసుబ్బయ్య రాజకీయవారసుడుగా ఆయన తమ్ముడు వెంకటేశ్వర్లు 1956లో సర్పంచిగా బాధ్యతలు చేపట్టి, 1987 జూన్ వరకూ 5 సార్లు ఏకగ్రీవంగా, ఒకసారి ఎన్నికల ద్వారానూ, సర్పంచి అయినారు. ఆయన హయాంలో గ్రామంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ఏర్పాటైనవి. గ్రామానికి విద్యుత్తు సౌకర్యం ఏర్పడింది. తన స్థిరాస్థులను అమ్మి, ఎస్.సీ.వర్గాలవారికి 50 పక్కా ఇళ్ళు నిర్మించారు. 1977 నవంబరులో వచ్చిన తుఫానులో, ప్రజలంతా సురక్షితంగా ఆయన నిర్మించిన గృహాలలో తలదాచుకోవడంతో, అప్పటి కలెక్టరు జయభారతరెడ్డి, స్వయంగా పల్లపాడు గ్రామానికి వచ్చి, వెంకటేశ్వర్లుని అభినందించారు. ప్రజల విరాళలతో, పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణం, ఈయన హయాంలోనే జరిగింది. 120 మంది పేదలకు ఇళ్ళస్థలాలు ఇప్పించారు. 1960లో రక్షిత మంచినీటి పథకాలను ఏర్పాటు చేశారు. కొండవాగు నుండి మంచినీటి చెరువునకు నీరు రావదానికీ, పోవడానికీ మార్గం ఏర్పాటుచేశారు. కొండవాగుమీదుగా గుంటూరు వెళ్ళేటందుకు ప్రత్యేక వంతెనతోపాటు, యామర్రు. గారపాడు, చింతపల్లిపాడు గ్రామాలమీదుగా గుంటూరు నగరానికి రహదారి నిర్మాణానికి కృషిచేశారు. గ్రామభివృద్ధికి ప్రభుత్వం నుండి నిధులు రాకపోవడంతో, ఆస్తులు అమ్మి, గ్రామాన్ని అభివృద్ధి చేశారు. సర్పంచి పదవీకాలం పూర్తి అయ్యేనాటికి, తనకున్న 35 ఎకరాల పొలంలో కేవలం మూడు ఎకరాలు మాత్రమే మిగిలినది. ప్రస్తుతం ఆయన పల్లెపాడు గ్రామానికి ప్రవాస భారత ఫౌండేషనుకి అధ్యక్షులిగా ఉన్నారు. 1987లో మేడూరి శివరామయ్య, 1995లో తాటి ప్రమీల సర్పంచులుగా సేవలందించారు. 2001లో వెంకటేశ్వర్లు అన్న కుమారుడు, సాంబశివరావు సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఆయన హయాంలో గ్రామంలో 70% సిమెంటు రహదారులు, ఇంటింటికీ మరుగుదొడ్లు, అధునాతన పంచాయతీ భవనం, తాగునీటి పైపులైనులూ, కొండవాగుపై వంతెన నిర్మాణం జరిగినవి. ఆయన సేవలకు, అభివృద్ధికీ మెచ్చి, ప్రభుత్వం, గ్రామాన్ని నిర్మల్ పురస్కార గ్రామంగా ఎంపికచేసి, సర్పంచిని సన్మానం చేసి, ప్రశంసాపత్రంతోపాటు, గ్రామ పంచాయతీ అభివృద్ధికి, రెండులక్షల రూపాయల నిధులు అందించింది.#2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ పల్లపాటి పౌలు, సర్పంచిగా ఎన్నికైనారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

శ్రీ కోదండరామస్వామివారి ఆలయం మార్చు

ఇక్కడ దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు కనుల పండువగా నిర్వహించెదరు. ఈ ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం, వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో ఐదు రోజులపాటు కన్నులపండువగా నిర్వహించెదరు. ఈ ఉత్సవాలలో భాగంగా, శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించెదరు. అనంతరం స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించెదరు. ఒక రోజున స్వామివారికి పట్టాభిషేకం నిర్వహించెదరు. అనంతరం, విచ్చేసిన భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించెదరు. [8]&[10]

శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం మార్చు

ఈ ఆలయంలో స్వామివారి ఆరాధనోత్సవాలు, ప్రతి సంవత్సరం, వైశాఖ మాసంలో శుక్ల దశమి నాడు వైభవంగా నిర్వహించెదరు. [9]

గ్రామంలో ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ విశేషాలు మార్చు

  1. ఈ గ్రామానికి చెందిన శ్రీ జాగర్లమూడి సింగారావు గతంలో భారత వాలీబాల్ జట్టుకి నాయకత్వం వహించారు. ఇప్పుడు ఇదే గ్రామానికి చెందిన యస్.శ్రీనివాసరావు JNTU (K) వాలీబాల్ జట్టులో 5 వ స్థానం సంపాదించాడు. ఇదివరకే జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం, ANU జట్టులో 4 వ స్థానం సంపాదించాడు.
  2. ఈ గ్రామానికి చెందిన Dr. కొర్రపాటి రఘుబాబు M.Sc., MBA., P.hd. 1991 నుండి అమెరికాలో ఉంటున్నారు. వీరు 108 Pearls of wisdom అను ఆంగ్ల నవలా రచయిత. వీరు కంప్యూటర్ "సైన్సెస్ వింగ్" అను సంస్థకు డైరెక్టరు. వీరు JNTU లో ఇంజనీరింగ్ లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు బంగారు పతకం స్పాన్ సర్ చేస్తున్నారు. వీరు అమెరికాలోని సౌత్ కరోలీనా, కొలంబియా రాష్ట్రాల ఉన్నత విద్యా కమిషన్ లో సభ్యులు. [
  3. హైదరాబాదులో ఉంటున్న ఈ గ్రామస్థులు, ఇప్పటికి 8 సంవత్సరముల నుండి ప్రతి సంవత్సరం కార్తీకమాసం ఆత్మీయ సమావేశంలో కలుసుకొని వనభోజనాలు చేస్తున్నారు. భారతదేశంలోని ఆరులక్షల ముఫ్ఫైవేల గ్రామాలలో, ఈ పేరుగల గ్రామం ఇదొక్కటేనని వీరు చెప్పుచున్నారు.
  4. 2005లో అప్పటి గ్రామ సర్పంచి శ్రీ కొర్రపాటి సంబశివరావు నాయకత్వంలో, పంచాయతీ పాలకవర్గం గ్రామంలో మద్యనిషేధాన్ని విధిస్తూ తీర్మానం చేసింది. అప్పటినుండి ఈ గ్రామములో సంపూర్ణ మద్యనిషేధం అమలులో ఉంది.

గణాంకాలు మార్చు

  • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం జనాభా 4192, పురుషుల సంఖ్య 2071, మహిళలు 2121, నివాస గృహాలు 1213, విస్తీర్ణం 1454 హెక్టారులు

మూలాలు మార్చు

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.
"https://te.wikipedia.org/w/index.php?title=పల్లపాడు&oldid=4130766" నుండి వెలికితీశారు