పాఠశాల (2014 సినిమా)

మహి వి. రాఘవ్ దర్శకత్వంలో 2014లో విడుదలైన తెలుగు చలనచిత్రం

పాఠశాల 2014, అక్టోబరు 10న విడుదలైన తెలుగు చలనచిత్రం. మహి. వి. రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి రొనాక్, నందు, శశాంక్, శిరీష, అను ప్రియా తదితరులు నటించగా, రాహుల్ రాజ్ సంగీతం అందించాడు.[1]

పాఠశాల
దర్శకత్వంమహి. వి. రాఘవ్
రచనమహి. వి. రాఘవ్
రాజశేఖర్ పివిఆర్ (మాటలు)
నిర్మాతరాకేష్ మహంకాళి
పవన్ కుమార్ రెడ్డి
తారాగణంసాయి రొనాక్, నందు, శశాంక్, శిరీష, అను ప్రియా
ఛాయాగ్రహణంసుధీర్ సురేంద్రన్
కూర్పుశ్రవణ్ కటికనేని
సంగీతంరాహుల్ రాజ్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
2014 అక్టోబరు 10 (2014-10-10)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా సారాంశం సవరించు

ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన సూర్య (శివ), సాల్మా (శిరీష), సంధ్య (అనుప్రియ), రాజు (నందు), ఆది (సాయి కిరణ్) కలిసి టూర్ కు వెళ్తారు. ఈ ప్రయాణంలో తమ స్నేహితుల గురించి తమకే తెలియని కొత్త సంగతులు తెలుస్తాయి. వారు జీవితంలో ఎదగడానికి ఈ ప్రయాణం ఎలా ఉపయోగపడిందన్నది మిగతా కథ.

నటవర్గం సవరించు

సాంకేతికవర్గం సవరించు

  • రచన, దర్శకత్వం: మహి. వి. రాఘవ్
  • నిర్మాత: రాకేష్ మహంకాళి, పవన్ కుమార్ రెడ్డి
  • మాటలు: రాజశేఖర్ పివిఆర్
  • సంగీతం: రాహుల్ రాజ్
  • ఛాయాగ్రహణం: సుధీర్ సురేంద్రన్
  • కూర్పు: శ్రవణ్ కటికనేని
  • నిర్మాణ సంస్థ: మూన్ వాటర్ పిక్చర్స్

పాటలు సవరించు

ఈ చిత్రానికి రాహుల్ రాజ్ సంగీతం అందించాడు.[2][3]

పాఠశాల
పాటలు by
రాహుల్ రాజ్
Released2014 (2014)
Producerరాహుల్ రాజ్
సం.పాటగాయకులుపాట నిడివి
1."ఫ్రెండ్షిప్ గీతం"సూరజ్ సంతోష్, ఎల్వీస్ డాన్ రాజా 
2."మెరిసే మెరిసే"రాహుల్ రాజ్ 
3."సూర్యోదయం"నిజాం అర్షద్ 
4."స్వేచ్ఛ వర్షం"రాహుల్ రాజ్ 
5."శూన్యమయి"నిఖిల్ మ్యాథ్ 

ఇతర వివరాలు సవరించు

  1. అమలాపురం, రాజోలు, కడప దగ్గర గండికోట, హార్స్‌లీ హిల్స్‌ వంటి ప్రాంతాలలో చిత్రీకరణ జరుపుకుంది.[4]
  2. వినాయకుడు సినిమాతో రచయితగా సినిమారంగానికి వచ్చి, విలేజ్ లో వినాయకుడు, కుదిరితే కప్పు కాఫీ వంటి సినిమాలను నిర్మించిన మహి.వి. రాఘవ్ తొలిసారిగా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

మూలాలు సవరించు

  1. "First look of Paathasala". idlebrain. Retrieved 13 March 2020.
  2. 123Telugu, Reviews (2 September 2014). "Audio Review : Paathshala – Meaningful Album". 123telugu.com. Retrieved 13 March 2020.
  3. Idlebrain, Reviews (5 September 2014). "Paathshala music review". www.idlebrain.com. Retrieved 13 March 2020.
  4. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (5 October 2014). "'పాఠశాల'... పక్కా రోడ్‌ సినిమా! - మహి వి. రాఘవ్‌". Archived from the original on 13 March 2020. Retrieved 13 March 2020.