విలేజ్ లో వినాయకుడు

విలేజ్ లో వినాయకుడు 2009 లో వచ్చిన తెలుగు కామెడీ చిత్రం. మూన్ వాటర్ పిక్చర్స్ పతాకంపై మహి వి రాఘవ్ నిర్మించాడు. సాయి కిరణ్ ఆదివి రచన, దర్శకత్వం చేసాడు. ఈ చిత్రం 2008 లో వచ్చి విజయవంతమైన వినాయకుడికి సీక్వెల్. ఈ చిత్రంలో కృష్ణుడి పాత్రలో కృష్ణుడు తిరిగి నటించగా, శరణ్య మోహన్ ప్రధాన స్త్రీపాత్రలోను, రావు రమేష్ ఆమె తండ్రి పాత్రలోనూ నటించారు. తెలుగు నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ఓ కీలక పాత్రలో నటించాడు. ఈ చిత్రం 2009 నవంబరు 5 న విడుదలై బాగా ఆడింది. 75 రోజులు నడిచింది. మంచి సమీక్షలు వచ్చాయి. ఇది బాక్సాఫీస్ వద్ద హిట్టైంది.

విలేజ్ లో వినాయకుడు
(2009 తెలుగు సినిమా)
దర్శకత్వం సాయికిరణ్ అడవి
తారాగణం కృష్ణుడు (నటుడు)
శరణ్య మోహన్
యండమూరి వీరేంద్రనాథ్
రావు రమేష్
సంభాషణలు సాయికిరణ్ అడవి
నిర్మాణ సంస్థ మూన్ వాటర్ పిక్చర్స్
విడుదల తేదీ 5 నవంబర్ 2009
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కార్తీక్ (కృష్ణుడు) వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు, లావుపాటి వ్యక్తి. మెడికల్ విద్యార్థి కావ్య (శరణ్య మోహన్) తో ప్రేమలో పడతాడు. కావ్య తండ్రి కల్నల్ లక్ష్మీపతి (రావు రమేష్) తన సోదరులు, కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలోని ఫామ్‌హౌస్‌లో నివసిస్తున్న రిటైర్డ్ ఆర్మీ అధికారి. కావ్య చిన్న వయస్సులోనే తల్లిని కోల్పోతుంది. ఆమె తండ్రి ఆమె కోరికలను ఎప్పుడూ తిరస్కరించలేదు. తన ప్రేమ గురించి తన తండ్రికి చెప్పడానికి ఆమె ధైర్యం చెప్పినప్పుడు, కార్తీక్ అకస్మాత్తుగా వాళ్ళ ఇంటికి వస్తాడు. అతను తన కుమార్తెను ప్రేమిస్తున్నాడని లక్ష్మీపతికి చెబుతాడు. లక్ష్మీపతి వాళ్ళ పెళ్ళికి బద్ధ వ్యతిరేకి. ఇలాంటి లావాటి వ్యక్తి తనకు అల్లుడుగా ఇష్టం లేదు. లక్ష్మీపతి స్నేహితుడు భాస్కరం (యండమూరి) తన వెర్రి మొర్రి ఆలోచనలతో కార్తిక్ అవకాశాలను మరింత క్లిష్టతరం చేస్తాడు. కృష్ణుడు లక్ష్మీపతి హృదయాన్ని ఎలా గెలుచుకుంటాడనేది మిగిలిన కథ.

నటీనటులు

మార్చు

ప్రచారం

మార్చు

చలనచిత్ర నిర్మాతలతో భాగస్వాములుగా రేడియో మిర్చి, TV9, జెమిని సంగీతం, MERAUX యానిమేషన్లు, APTDC, కళామందిర్, రిలయన్స్ మొబైల్ కలిసాయి. 2009 అక్టోబరు 29 న, ఈ చిత్ర బృందం హైదరాబాద్ నుండి విశాఖపట్నం నుండి విజయవాడ వరకు ప్రచారయాత్ర చేసి, ఈ చిత్రాన్ని ప్రజలకు దగ్గర చేసింది. [1]

పాటలు

మార్చు

పాటలకు స్వరరచన మణికాంత్ కద్రీ చేసాడు. ఈ సంగీతం 2009 సెప్టెంబరు 15 న హైదరాబాద్ కూకట్‌పల్లిలోని కళామందిర్‌లో విడుదలైంది. ఆడియో హక్కులను మధుర ఎంటర్టైన్మెంట్ కొనుగోలు చేసింది. ప్రతి సిడితో రిలయన్స్ జిఎస్ఎమ్ సిమ్ కార్డు ఉచితంగా ఇచ్చారు. [2]

All tracks are written by వనమాలి.

పాఅటల జాబితా
సం.పాటగాయనీ గాయకులుపాట నిడివి
1."చినుకై వరదై"హరిహరన్, శ్వేతా మోహన్04:49
2."అహ నా పెళ్ళంట"బాబా సెహగల్, మణికాంత్ కాద్రి, సౌమ్య, కోలిన్ టెరెన్స్02:42
3."ముద్దుగారే"గురు ప్రియ03:39
4."నీలి మేఘమా"కార్తిక్04:28
5."తీసే ప్రతి శ్వాసా"హరిచరణ్03:08
6."సూపర్‌మ్యాన్"బెన్నీ దయాళ్03:07
7."తీం సంగీతం"కార్తిక్ అయ్యర్02:59
8."ముద్దుగారే"సూరజ్03:36
మొత్తం నిడివి:28:28

మూలాలు

మార్చు
  1. http://www.idlebrain.com/news/functions/vlvinyakudu-roadtrip1.html
  2. http://idlebrain.com/news/functions/audio-villagelovinayakudu.html