పాతాళ భైరవి (నాటకం)

పాతాళ భైరవి జానపద నాటకం. శారదా విజయ నాట్యమండలి కోసం సురభి లీలాపాపారావు నాటకకీరణ చేసిన పాతాళ భైరవి నాటకం సురభి నాటక సమాజాలన్నింటిచే ప్రదర్శించబడింది.

విశాఖపట్నంలో సురభి వారిచే పాతాళభైరవి నాటక ప్రదర్శన

ఉజ్జయిని నగర మహారాజు కుమార్తె ఇందుమతిని, ఉద్యానవన తోటమాలి శాంతమ్మ కొడుకు తోటరాముడు ప్రేమిస్తాడు. మహారాజు తోటరాముని బంధిస్తాడు. కుమార్తె ఇందుమతి విడిచి పెట్టమని కోరగా, తన స్థాయికి తగిన వాడుగా ధనవంతుడవై వస్తే వివాహం చేస్తానని షరత్తు విధిస్తాడు. సమస్త భూమండల సార్వభౌమత్వం కోసం క్షుద్రశక్తులను ఆశ్రయించిన నేపాళ మాంత్రికుడు, తారసిల్లిడం, తోటరాముడు, మాంత్రికుని మోసబుద్ధిని తెలుసుకొని యక్షిణ చెప్పిన ఉపాయం ప్రకారం మాంత్రికుని బలి ఇచ్చి పాతాళభైరవి అనుగ్రహంతో రాజ్యానికి చేరుకుని మహారాజుకు కనిపిస్తాడు. తన కుమార్తెను తోటరామునికిచ్చి వివాహం చేయడానికి అంగీకరిస్తాడు. రాజకుమారిని వివాహం చేసుకున్న తోటరాముడు పాతాళభైరవిని దేవికి సమర్పించి కృతజ్ఞత తెలుపుతాడు.

కథామూలం

మార్చు

1951లో ఎన్.టి.ఆర్. కథానాయకుడిగా వచ్చిన పాతాళ భైరవి ఆధారంగా ఈ నాటకం రూపొందించబడింది. అరేబియన్‌ నైట్స్‌ కథల్లోని అల్లావుద్దీన్ అద్భుతదీపం ప్రేరణతో మధిర సుబ్బన్న దీక్షితులు వ్రాసిన కాశీ మజిలీ కథలు ధోరణిలో దీని కథ తయారయింది.

పాత్రలు

మార్చు
 • తోటరాముడు
 • నేపాళ మాంత్రికుడు
 • ఇందుమతి
 • రాజు
 • పాతాళ భైరవి
 • శాంతమ్మ
 • యక్షిణ
 • అంజి
 • శ్రీను
 • డింగిరి

ఇతర విషయాలు

మార్చు
 1. సురభి నాటక సమాజం ఆధ్వర్యంలోని వివిధ నాటక సంస్థలు ఈ నాటకాన్ని విరివిగా ప్రదర్శిస్తున్నాయి.[1][2]
 2. ఫ్రాన్స్‌లో 2013 మే 4 వ తేదీ నుంచి 18 వరకు జరిగిన అంతర్జాతీయ ఉత్సవాలలో 44 మందితో కూడిన శ్రీవెంకటేశ్వర నాట్య మండలి ఈ నాటకం ప్రదర్శించబడింది.

మూలాలు

మార్చు
 1. ఆంధ్రజ్యోతి, సాహిత్యం. "విశాఖలో మైమరిపించిన జై పాతాళ భైరవి". lit.andhrajyothy.com. Archived from the original on 20 ఏప్రిల్ 2020. Retrieved 20 April 2020.
 2. ప్రజాశక్తి, విజయవాడ (4 February 2017). "ఆకట్టుకున్న 'పాతాళ భైరవి'". www.prajasakti.com. Retrieved 20 April 2020.[permanent dead link]