పాతుమ్ నిస్సాంక

శ్రీలంక క్రికెటర్

పాతుమ్ నిస్సంక సిల్వా, శ్రీలంక క్రికెటర్. శ్రీలంక తరపున క్రికెట్ లోని మూడు ఫార్మాట్‌లలో ఆడుతున్నాడు.[1] 2021 మార్చిలో శ్రీలంక క్రికెట్ జట్టు కోసం అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం శాశ్వత ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా స్లాట్ అయ్యాడు.[2]

పాతుమ్ నిస్సంక
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
పాతుమ్ నిస్సంక సిల్వా
పుట్టిన తేదీ (1998-05-18) 1998 మే 18 (వయసు 26)
గాల్లే, శ్రీలంక
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రTop-order batter
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 155)2021 మార్చి 21 - వెస్టిండీస్ తో
చివరి టెస్టు2022 జూలై 8 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 194)2021 మార్చి 10 - వెస్టిండీస్ తో
చివరి వన్‌డే2023 జూలై 7 - వెస్టిండీస్ తో
తొలి T20I (క్యాప్ 86)2021 మార్చి 3 - వెస్టిండీస్ తో
చివరి T20I2023 ఏప్రిల్ 8 - న్యూజీలాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2017–2018Badureliya
2019–presentNondescripts Cricket Club
2021Colombo Stars
2022Kandy Falcons
2023Rangpur Riders
2023Colombo Strikers
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు టి20 ఫక్లా
మ్యాచ్‌లు 9 33 39 42
చేసిన పరుగులు 537 1,241 1,098 3,982
బ్యాటింగు సగటు 38.36 41.37 28.75 61.26
100లు/50లు 1/5 3/9 0/9 14/18
అత్యుత్తమ స్కోరు 103 137 75 217
క్యాచ్‌లు/స్టంపింగులు 3/– 12/– 9/– 21/–
మూలం: Cricinfo, 02 June 2023

ప్రారంభ జీవితం

మార్చు

పాతుమ్ నిస్సంక 1998, మే 18న శ్రీలంకలోని గాలెలో జన్మించాడు. ఇతని తండ్రి సునీల్ సిల్వా గ్రౌండ్ బాయ్‌గా పనిచేశాడు. తల్లి కలుతర గుడి దగ్గర పూలు అమ్మేది. చిన్నతనంలో పేద కుటుంబ నేపథ్యంలో పెరిగాడు.[3] కలుతర విద్యాలయంలో తన క్రికెట్ జీవితాన్ని ప్రారంభించాడు.[4]

దేశీయ క్రికెట్

మార్చు

స్కూల్ క్రికెట్ ఛాంపియన్‌షిప్‌లో అతను కొలంబోలోని కోల్ట్స్ మైదానంలో రాజగిరియలోని ప్రెసిడెంట్స్ కాలేజ్‌పై 190 బంతుల్లో అజేయ డబుల్ సెంచరీ (205) చేశాడు.[5] 2017 మార్చి 17న 2016–17 డిస్ట్రిక్ట్స్ వన్ డే టోర్నమెంట్‌లో హంబన్‌తోట డిస్ట్రిక్ట్ తరపున తన లిస్ట్ ఎ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[6] 2018 ఫిబ్రవరి 24న 2017–18 ఎస్ఎల్సీ ట్వంటీ 20 టోర్నమెంట్‌లో బదురెలియా స్పోర్ట్స్ క్లబ్‌కు తన తొలి ట్వంటీ20 క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[7]

అంతర్జాతీయ క్రికెట్

మార్చు

2019 జనవరిలో ఐర్లాండ్ ఎతో జరిగిన ఫస్ట్-క్లాస్ సిరీస్ కోసం శ్రీలంక ఎ జట్టులో ఎంపికయ్యాడు. శ్రీలంక ఎ తరపున రెండు మ్యాచ్‌లలో 258 పరుగులతో అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు.[8] 2019 ఫిబ్రవరిలో 2018–19 ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో తన 1,000వ పరుగును సాధించాడు, కొలంబో క్రికెట్ క్లబ్‌కు వ్యతిరేకంగా నాన్‌డిస్క్రిప్ట్ క్రికెట్ క్లబ్ తరపున బ్యాటింగ్ చేశాడు.[9] ఏడు మ్యాచ్‌ల్లో 1,088 పరుగులతో నాన్‌డెస్క్రిప్ట్ క్రికెట్ క్లబ్‌కు అత్యధిక పరుగుల స్కోరర్‌గా టోర్నమెంట్‌ను ముగించాడు.[10]

2023 జూలై 7న వెస్టిండీస్‌తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో పాతుమ్ నిస్సాంక తన మూడవ (వరుసగా రెండవ) వన్డే సెంచరీ సాధించాడు. 243 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నిస్సాంక 113 బంతుల్లో 14 బౌండరీలతో 104 పరుగులు చేశాడు. పాతుమ్, దిముత్ కరుణరత్నే తొలి వికెట్‌కు 190 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివరకు శ్రీలంక 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.[11]

మూలాలు

మార్చు
  1. Fernando, Andrew Fidel (17 July 2021). "Five lesser-known Sri Lanka players who can make a difference against India". ESPNcricinfo. ESPN Inc. Retrieved 2023-08-23.
  2. "Pathum Nissanka". ESPNcricinfo. ESPN Inc. Retrieved 2023-08-23.
  3. "SPORTSPathum Nissanka story brings tears to your eyes". The Island (Sri Lanka). 26 March 2021. Retrieved 2023-08-23.
  4. Weerasinghe, Damith (15 September 2016). "U19 Schools' Cricketer of the Week – Pathum Nissanka". The Papare. Retrieved 2023-08-23.
  5. Thawfeeq, Sa'adi (18 January 2019). "Pathum Nissanka can be our next Test opener says coach Avishka Gunawardene:". Daily News (Sri Lanka). Retrieved 2023-08-23.
  6. "Districts One Day Tournament, Southern Group: Matara District v Hambantota District at Colombo (Bloomfield), Mar 17, 2017". ESPNcricinfo. ESPN Inc. 17 March 2017. Retrieved 2023-08-23.
  7. "Group D, SLC Twenty-20 Tournament at Katunayake, Feb 24 2018". ESPNcricinfo. ESPN Inc. 24 February 2018. Retrieved 2023-08-23.
  8. "Ireland A tour of Sri Lanka: Most runs in first-class matches". ESPNcricinfo. ESPN Inc. Retrieved 2023-08-23.[permanent dead link]
  9. Thattil, Roscoe (10 February 2019). "Pathum Nissanka reaches magical 1000 run mark". The Papare. Retrieved 2023-08-23.
  10. "Premier League Tournament Tier A, 2018/19 - Nondescripts Cricket Club: Batting and bowling averages". ESPNcricinfo. ESPN Inc. Retrieved 2023-08-23.
  11. "Nissanka, Theekshana lead Sri Lanka to dominant win over West Indies". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-23.

బాహ్య లింకులు

మార్చు