పాప కోసం విజయ సురేష్ కంబైన్స్ పతాకంపై జి.వి.ఆర్.శేషగిరిరావు దర్శకత్వంలో 1968, మార్చి 15న వెలువడిన తెలుగు సినిమా.

పాప కోసం
(1968 తెలుగు సినిమా)
దర్శకత్వం జి.వి.ఆర్.శేషగిరిరావు
తారాగణం ఎస్.వీ.రంగారావు, మిక్కిలినేని, శ్రీదేవి
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నేపథ్య గానం ఘంటశాల
గీతరచన శ్రీ శ్రీ, ఆత్రేయ సి.నారయణ రెడ్డి
విడుదల తేదీ 1968
భాష తెలుగు

నటీనటులు మార్చు

  • జగ్గయ్య - డాక్టర్
  • దేవిక - గౌరి (ఆయా)
  • త్యాగరాజు - కిష్టయ్య
  • సత్యనారాయణ - జోసెఫ్
  • రామదాసు - హుస్సేన్
  • బేబి రాణి - పాప
  • పద్మనాభం
  • రావి కొండలరావు - సోమయాజులు
  • అల్లు రామలింగయ్య - శాస్త్రి
  • ప్రభాకర్‌రెడ్డి - ఇన్‌స్పెక్టర్
  • ధూళిపాళ - కమీషనర్
  • పి.రామానాయుడు - శేఖర్
  • విజయనిర్మల - గీత
  • కృష్ణ
  • లక్ష్మి
  • లక్ష్మీకాంతమ్మ
  • ఋష్యేంద్రమణి
  • రాజబాబు
  • తారామతి
  • కుమార్
  • నిర్మల తదితరులు

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: జి.వి.ఆర్. శేషగిరిరావు
  • సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
  • పాటలు: ఆచార్య ఆత్రేయ, సి.నారాయణరెడ్డి
  • మాటలు: ఆచార్య ఆత్రేయ
  • గాయనీగాయకులు: ఘంటసాల, పి.సుశీల, మాధవపెద్ది, జె.వి.రాఘవులు, ఎల్.ఆర్.ఈశ్వరి
  • కథ: కె.మూర్తి
  • ఛాయాగ్రహణం: యస్.వెంకటరత్నం
  • కళ: రాజేంద్రకుమార్
  • కూర్పు: కె.ఎ.మార్తాండ్
  • నిర్మాత:డి.రామానాయుడు

పాటలు మార్చు

ఈ చిత్రంలోని పాటలకు పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం అందించాడు.

క్ర.సం పాట గాయనీగాయకులు గీత రచయిత
1 ఉల్లిపూల పడవా గట్టి మావా మల్లెపూల తెరను దించి పి.సుశీల ఆత్రేయ
2 కొండలపైన కోనలలోన గోగుల ఘంటసాల,
పి.సుశీల,
మాధవపెద్ది,
జె.వి.రాఘవులు
ఆత్రేయ
3 కొండలపైన కోనలలోన గోగుల పూసే జాబిలి పి.సుశీల ఆత్రేయ
4 నన్నే నన్నే చూడు ఉన్నాను సైదోడు ఎల్.ఆర్.ఈశ్వరి సి.నా.రె
5 మనిషి మనిషి కి తేడా ఉంది తేడాలో ఒక పోలిక ఉంది ఘంటసాల ఆత్రేయ
6 రాముడెందుకు పుట్టాడు మంచి ఘంటసాల,
మాధవపెద్ది,
జె.వి.రాఘవులు
ఆత్రేయ

సంక్షిప్త కథ మార్చు

కిష్టయ్య, జోసెఫ్, హుస్సేన్ ముగ్గురూ తోడుదొంగలు. వారు దారుణమైన ఒక హత్య జరిపిన ఫలితంగా వారికి ఒక పాప దొరుకుతుంది. పాప వారి మనసుల్లో ప్రవేశించి వారికి భగవంతున్ని చూపిస్తుంది. పాపకోసం ప్రాణాలనైనా ఇవ్వగల పరివర్తనను వారిలో కలిగజేస్తుంది. పాపకోసం పోలీసుల కళ్ళుగప్పి కష్టపడి దాదీని తెస్తారు. సాహసంతో డాక్టర్‌ని తెస్తారు. ధైర్యంతో మందులు తెస్తారు. చివరకు ఆ పాపకోసమే తమంతట తామే పోలీసులకు లొంగి పోతారు. పాప గీతగా పెద్దదైన తర్వాత ఆమె పెళ్లికి ముందు జరిగిన ఫ్లాష్‌బ్యాక్ ఇది. ఆమె పెళ్లినాటికి మామయ్యలు ముగ్గురూ విడుదలై వచ్చి ఆమెను ఆశీర్వదించడంతో కథ ముగుస్తుంది[1].

విశేషాలు మార్చు

  • ఈ సినిమాను డి.రామానాయుడు నిర్మాతగా పి.మాధవన్ దర్శకత్వంలో తమిళభాషలో కుళంతైక్కాగ అనే పేరుతో పునర్మించారు. ఈ సినిమా 1968లో విడుదలయ్యింది.
  • హిందీలో తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో నన్హా ఫరిస్తా పేరుతో విజయ సురేష్ కంబైన్స్ సంస్థ తీసింది.
  • ఇదే సినిమా మళయాలంలో ఒమనక్కుంజు పేరుతో వెలువడింది.

మూలాలు మార్చు

  1. సికరాజు (15 March 1968). "చిత్రసమీక్ష - పాపకోసం". ఆంధ్రపత్రిక దినపత్రిక. Retrieved 25 January 2020.[permanent dead link]

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=పాప_కోసం&oldid=3433866" నుండి వెలికితీశారు