పామిడి శమంతకమణి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు & మాజీ మంత్రి

పామిడి శమంతకమణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు & మాజీ మంత్రి. ఆమె 1989లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో శింగనమల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది. శమంతకమణి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యురాలిగా ఉంది.

శమంతకమణి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
11 మార్చి 2019 - ప్రస్తుతం
నియోజకవర్గం గవర్నర్ కోటా ఎమ్మెల్సీ

వ్యక్తిగత వివరాలు

జననం 25 జూన్ 1946
గుత్తి, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
వృత్తి రాజకీయ నాయకురాలు

జననం, విద్యాభాస్యం

మార్చు

శమంతకమణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా, గుత్తిలో 1946 జూన్ 25లో పి.మోసెస్, లిలీపుసుపమ్మ దంపతులకు జన్మించింది. ఆమె కర్నూల్ లోని కేవీఆర్ ప్రభుత్వ మహిళా కళాశాలలో బీఎస్సీ పూర్తి చేసింది.

రాజకీయ జీవితం

మార్చు

శమంతకమణి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చింది. ఆమె ఉదయాద్రి మహిళా మండలిని స్థాపించి దాని ద్వారా అనేక సామజిక, సేవ కార్యక్రమాలు నిర్వహించింది. ఆమె 1980లో అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసింది. శమంతకమణి 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కె.జయరాం చేతిలో 14212 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యింది. 1989లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన శమంతకమణి రాష్ట్ర విద్య శాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసింది. ఆమె 1989లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరింది.[1]

శమంతకమణి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యే కోటాలో 2013 మార్చి 10న ఎమ్మెల్సీగా ఎన్నికయ్యింది.[2] ఆమె ఈ పదవిలో 2019 మార్చి 14 వరకు కొనసాగింది.ఆమె 2019లో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యే కోటాలో రెండవసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యింది.[3] శమంతకమణి 2020 మార్చి 18న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది.[4]

శమంతకమణి 2024లో శింగనమల నియోజకవర్గం వైసీపీ టికెట్‌ను ఆశించగా టికెట్‌ను వీరాంజనేయులుకు కేటాయించడంతో అసంతృప్తిగా ఉన్న ఆమె ఏప్రిల్ 08న వైసీపీ పార్టీకి రాజీనామా చేసింది.[5]

శాసనసభకు పోటీ
సంవత్సరం నియోజకవర్గం పేరు నియోజకవర్గం రకం ఓడిన అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు మెజారిటీ ఫలితం
1985 శింగనమల ఎస్సీ రిజర్వుడు పామిడి శమంతకమణి కాంగ్రెస్ పార్టీ 00 కె.జయరాం తెలుగుదేశం పార్టీ 00 14212 ఓటమి
1989 శింగనమల ఎస్సీ రిజర్వుడు బీ.సీ.గోవిందప్ప తెలుగుదేశం పార్టీ 00 పామిడి శమంతకమణి కాంగ్రెస్ పార్టీ 0000 7079 గెలుపు
1994 శింగనమల ఎస్సీ రిజర్వుడు పామిడి శమంతకమణి కాంగ్రెస్ పార్టీ 00 కె.జయరాం తెలుగుదేశం పార్టీ 00 47198 ఓటమి
2004 శింగనమల ఎస్సీ రిజర్వుడు పామిడి శమంతకమణి తెలుగుదేశం పార్టీ 00 సాకే శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీ 00 8586 ఓటమి
2009 శింగనమల ఎస్సీ రిజర్వుడు పామిడి శమంతకమణి తెలుగుదేశం పార్టీ 00 సాకే శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీ 00 3176 ఓటమి

మూలాలు

మార్చు
  1. Sakshi (14 March 2019). "శింగనమల సీటు..ప్రభుత్వ ఏర్పాటుకు రూటు!". Archived from the original on 10 July 2021. Retrieved 10 July 2021.
  2. Zee News (14 March 2013). "Ten candidates for AP Council elected unopposed" (in ఇంగ్లీష్). Archived from the original on 10 జూలై 2021. Retrieved 10 July 2021.
  3. Suryaa (2019). "ఎమ్మెల్సీగా శమంతకమణి ప్రమాణస్వీకారం". Archived from the original on 15 January 2022. Retrieved 15 January 2022.
  4. Sakshi (19 March 2020). "వైఎస్సార్‌సీపీలో చేరిన ఎమ్మెల్సీ శమంతకమణి". Sakshi. Archived from the original on 10 July 2021. Retrieved 10 July 2021.
  5. NTV Telugu (8 April 2024). "వైసీపీకి మరో షాక్‌.. పార్టీకి మాజీ మంత్రి రాజీనామా". Archived from the original on 8 April 2024. Retrieved 8 April 2024.