భగవంత్‌ కేసరి 2023లో విడుదలైన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గార‌పాటి నిర్మించిన ఈ సినిమాకు అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించాడు.[1] నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్‌, అర్జున్‌ రాంపాల్‌శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా 2023 జూన్ 10న చిత్ర యూనిట్ విడుదల చేశారు.[2] ‘భగవంత్ కేసరి’ సినిమా  దసరా సందర్బంగా అక్టోబర్ 19న థియేటర్లలో విడుదలై, నవంబర్ 23 నుండి ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌ ప్రారంభమైంది.[3]

భగవంత్ కేసరి
దర్శకత్వంఅనిల్ రావిపూడి
రచనఅనిల్ రావిపూడి
నిర్మాతసాహు గార‌పాటి
హరీష్ పెద్ది
తారాగణంనందమూరి బాలకృష్ణ
కాజల్ అగర్వాల్‌
అర్జున్‌ రాంపాల్‌
శ్రీలీల
ఛాయాగ్రహణంరామ్ ప్రసాద్
కూర్పుతమ్మిరాజు
సంగీతంఎస్.ఎస్. థమన్
నిర్మాణ
సంస్థ
షైన్ స్క్రీన్స్
విడుదల తేదీ
2023 అక్టోబరు 19 (2023-10-19)
దేశంభారతదేశం
భాషతెలుగు

భగవంత్ కేసరి విడుదలైన ఆరు రోజుల్లోనే 104 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన‌ట్లు వంద కోట్ల పోస్ట‌ర్‌ను సినిమా యూనిట్ విడుదల చేసింది.[4]

నటీనటులు మార్చు

కథ మార్చు

వ‌రంగ‌ల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ భగవంత్‌ కేసరి (బాలకృష్ణ). ఆ జైల‌ర్ శ్రీకాంత్ (శ‌ర‌త్‌కుమార్‌) ఓ ప్రమాదంలో చ‌నిపోతాడు. ఆ జైల‌ర్‌ చేసిన సాయానికి కృతజ్ఞతగా జైలు అధికారికి కూతురు విజ్జి పాప (శ్రీలీల) ను ఆర్మీ ఆఫీసర్‌ చేయాలనే తన కోరికను భగవంత్‌ కేసరికి చెబుతాడు. విజ్జీని చంపేందుకు బిజినెస్‌మెన్ రాహుల్ సంఘ్వీ (అర్జున్ రాంపాల్‌) ప్ర‌య‌త్నిస్తుంటాడు? విజ్జీని అత‌డు ఎందుకు చంపాల‌ని అనుకున్నాడు? భగవంత్‌ కేసరి రాహుల్ సంఘ్వీ నుండి విజ్జుని ఎలా కాపాడాడు? విజ్జుని సైన్యంలోకి పంపాలన్న భగవంత్ కేసరి లక్ష్యం నెరవేరిందా? అడ్డంకులను దాటి భగవంత్ కేసరి ఆమెను ఆర్మీ ఆఫీసర్‌ చేయగలిగాడా? అనేదే మిగతా సినిమా కథ.[9][10]

పాటలు మార్చు

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."ఉయ్యాలో ఉయ్యాలో"అనంత్ శ్రీరామ్ఎస్. పి. చరణ్4:15
2."గణేష్ అంథెం"కాసర్ల శ్యామ్కరీముల్లా, మనీషా పంద్రకి4:38
3."మాను మాకు"అనంత శ్రీరామ్కీర్తన శ్రీనివాస్ 
4."రోర్ ఆఫ్ కేసరి"కాసర్ల శ్యామ్కోరస్3:20

సాంకేతిక నిపుణులు మార్చు

 • బ్యానర్: షైన్ స్క్రీన్
 • నిర్మాత: హరీష్‌ పెద్ది, సాహు గారపాటి
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్ రావిపూడి[11]
 • సంగీతం: ఎస్.ఎస్. థమన్
 • సినిమాటోగ్రఫీ: సి. రామ్ ప్రసాద్
 • ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎస్. కృష్ణ
 • ఎడిటర్: తమ్మి రాజు
 • ప్రొడక్షన్ డిజైనర్: రాజీవన్
 • ఫైట్స్: వీ. వెంకట్[12]

మూలాలు మార్చు

 1. Eenadu (8 June 2023). "బాలకృష్ణ-అనిల్‌ రావిపూడి చిత్రానికి అదిరిపోయే టైటిల్‌". Archived from the original on 10 June 2023. Retrieved 10 June 2023.
 2. Eenadu (10 June 2023). "'భగవంత్‌ కేసరి' మాస్‌ టీజర్‌ చూశారా?". Archived from the original on 10 June 2023. Retrieved 10 June 2023.
 3. TV9 Telugu (1 November 2023). "ఓటీటీలోకి వచ్చేస్తోన్న బాలయ్య భగవంత్ కేసరి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే". Archived from the original on 2 November 2023. Retrieved 2 November 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 4. Andhrajyothy (25 October 2023). "100 కోట్ల క్లబ్‌లోకి.. ప్రపంచవ్యాప్తంగా 6 రోజుల కలెక్షన్ల వివరాలివే." Archived from the original on 25 October 2023. Retrieved 25 October 2023.
 5. Namasthe Telangana (10 June 2023). "అడవి బిడ్డ .. నేలకొండ భగవంత్ కేసరి వచ్చేశాడు". Archived from the original on 10 June 2023. Retrieved 10 June 2023.
 6. Sakshi (21 March 2023). "బాలయ్యకు జోడీగా కాజల్‌ అగర్వాల్‌.. షూటింగ్‌ షురూ". Archived from the original on 10 June 2023. Retrieved 10 June 2023.
 7. Mana Telangana (10 May 2023). "#NBK108లో అర్జున్ రాంపాల్". Archived from the original on 10 June 2023. Retrieved 10 June 2023.
 8. Namasthe Telangana (23 May 2022). "బాల‌కృష్ణ కూతురిగా 'పెళ్లిసంద‌D' హీరోయిన్‌..!". Archived from the original on 10 June 2023. Retrieved 10 June 2023.
 9. Eenadu (19 October 2023). "రివ్యూ: భగవంత్‌ కేసరి.. బాలకృష్ణ యాక్షన్‌ డ్రామా ఎలా ఉంది?". Archived from the original on 25 October 2023. Retrieved 25 October 2023.
 10. ABP (19 October 2023). "భగవంత్ కేసరి రివ్యూ: బాలకృష్ణ నయా అవతార్ ఎలా ఉంది? అనిల్ రావిపూడి మళ్లీ హిట్టు కొట్టాడా?". Archived from the original on 25 October 2023. Retrieved 25 October 2023.
 11. NTV Telugu (9 June 2023). "బాలయ్య తో సినిమా నాకు లైఫ్ లో గుర్తుండి పోతుంది..!!". Archived from the original on 10 June 2023. Retrieved 10 June 2023.
 12. Namasthe Telangana (12 October 2023). "అందుకే అందరికీ అభిమానపాత్రడయ్యాడు". Archived from the original on 12 October 2023. Retrieved 12 October 2023.