పాషాణ భేది
పాషాణ భేది లేదా కోలియస్ (Indian Coleus) ఒక రకమైన ఔషధ మొక్క. దీని శాస్త్రీయనామం కోలియస్ ఫోర్స్ కోలి (Coleus forskohlii). ఇది లామియేసి కుటుంబానికి చెందినది.
పాషాణ భేది | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | P. barbatus
|
Binomial name | |
Plectranthus barbatus | |
Synonyms | |
Coleus barbatus |
లక్షణాలు
మార్చు- ఇది నిటారుగా పెరిగే నూగు కలిగిన మొక్క.
- దీని మెత్తని కాండం శాఖాయుతంగా ఉంటుంది.
- పత్రాలు అభిముఖంగా, పొడవుగా కేశయుతంగా ఉంటాయి.
- పుష్పాలు నీలిరంగులో ఉంటాయి.
- దుంపవేర్లు సుమారు 20 సెం.మీ. పొడవు, 1-3 సెం.మీ. మందం కలిగివుంటాయి. ఇవి పసుపు-నారింజ రంగును కలిగి అల్లం వంటి సువాసనను ఇస్తాయి.
ఉపయోగాలు
మార్చు- ఈ మొక్క దుంపలలో ఫోర్స్ కోలిన్ (Forskolin) అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. దీనిని అధిక రక్తపోటు, ఊబకాయం, గ్లాకోమా, ఉబ్బసం, గుండె జబ్బులు మొదలయిన వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదంలో దీనిని తీవ్రమైన నొప్పి నుండి, మూత్ర సంబంధ వ్యాధులలో ఉపయోగిస్తున్నారు.[1]
మూలాలు
మార్చు- ↑ Dubey MP, Srimal RC, Nityanand S et al. (1981). "Pharmacological studies on coleonol, a hypotensive diterpene from Coleus forskohlii." J Ethnopharmacol. 3:1-13.
బయటి లింకులు
మార్చు- Research on suntanning effect of forskolin Archived 2010-10-14 at the Wayback Machine