పింజల సుబ్బారావు
పింజల సుబ్బారావు ప్రసిద్ధి చెందిన చలనచిత్ర నిర్మాత. ఇతని స్వస్థలం మచిలీపట్నం.
సినిమారంగం
మార్చు1957లో ఇతడు సినిమాలలో నటించాలని మద్రాసు చేరుకున్నాడు. ఐదేళ్లపాటు పలు చిత్రాలలో చిన్నచిన్న వేషాలు వేశాడు. ఆ తర్వాత శ్రీకృష్ణా ఫిలిమ్స్ సంస్థలో ప్రొడక్షన్ అసిస్టెంట్‌గా చేరి రామాంజనేయ యుద్ధం, సతీ సుకన్య చిత్రాలకు పనిచేశాడు. తరువాత కొంతకాలం చిత్రాల క్రయవిక్రయాది వ్యాపారాలు చేశాడు. పిమ్మట చలనచిత్ర నిర్మాణరంగంలో ప్రవేశించాడు[1].
ఇతడు నిర్మించిన సినిమాలు:
- రాజద్రోహి
- హంతకులొస్తున్నారు జాగర్త
- రణభేరి
- పేదరాశి పెద్దమ్మ కథ
- లక్ష్మీ కటాక్షం
- సుగుణసుందరి కథ
- విక్రమార్క విజయం
- రౌడీలకు రౌడీలు
- పిల్లా? పిడుగా?
- సీతాకళ్యాణం
- సీతారామ వనవాసం
- అడవి మనుషులు
- లక్ష్మీపూజ
- మహాశక్తి
- త్రిలోక సుందరి
- రాణీ ఔర్ జాని (హిందీ)
- యే రిస్తీ నా తుహై (హిందీ)
మూలాలు
మార్చు- ↑ "సినిమారంగం- జి.వి.జి. - ఆంధ్రపత్రిక - దినపత్రిక - తేదీ: జూన్ 14,1981 - పేజీ: 4". Archived from the original on 2016-03-05. Retrieved 2015-12-12.