లక్ష్మీ కటాక్షం యన్టీ రామారావు, కె.ఆర్.విజయ కాంబినేషన్‌లో పింజల సుబ్బారావు రూపొందించిన చిత్రం. బి. విఠలాచార్య దర్శకత్వం వహించిన ఈ సినిమా 1970 ఫిబ్రవరి 12న విడుదలయ్యింది.

లక్ష్మీ కటాక్షం
(1970 తెలుగు సినిమా)
Lakshmikataksham.jpg
దర్శకత్వం బి. విఠలాచార్య
నిర్మాణం పింజల సుబ్బారావు
తారాగణం నందమూరి తారక రామారావు ,
కె.ఆర్.విజయ,
రాజశ్రీ,
సత్యనారాయణ,
బాలయ్య
సంగీతం ఎస్.పి. కోదండపాణి
నేపథ్య గానం ఘంటసాల, పి.సుశీల, ఎస్.జానకి
గీతరచన సి.నారాయణ రెడ్డి, చిల్లర భావనారాయణరావు, కొసరాజు
నిర్మాణ సంస్థ పి.ఎస్.ఆర్.పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులుసవరించు

సాంకేతికబృందంసవరించు

కథసవరించు

మహాతపోనిధి కోదండపాణేశ్వరుడు, అతని శిష్యులైన ప్రచండుడు, వినయానందకు అష్టైశ్వర్యాలతో కూడిన లక్ష్మీభాండాగారం గురించి చెబుతాడు. ఆ సంపద లోకకల్యాణం కోసం వినియోగించాలంటాడు. దురాశాపరుడైన ప్రచండుడు నిధిని పొందాలనుకుంటాడు. ఆ నిధి శృంగారపు రాకుమారుని వలనే సాధ్యమవుతుందని గ్రహిస్తాడు. మహారాణి ప్రసవించిన బిడ్డను తస్కరించి తనవద్ద కులవర్ధనుడనే పేరుతో పెంచి పెద్ద చేస్తాడు. నిధిని సాధించటానికి తొలుత అష్ట అండాలు యువరాజుతో సేకరింపచేసి, అతన్ని విసరికొడతాడు. ఈ చర్యకు అడ్డుపడిన వినయుని కుక్కగా మార్చేస్తాడు. వినయానందుని వలన తన విద్యలు, జ్ఞానం తిరిగి గ్రహించిన కులవర్ధనుడు, ప్రచండుని కలుసుకుంటాడు. అతనితో కలిసి లక్ష్మీభాండాగారం కోసం బయలుదేరతాడు. పురంధర రాజ్యంలో ఆ నిధి ఉందని తెలుసుకుంటారు. ఆ దేశపు మహారాణి హేమమాలిని, కులవర్ధనుని పరాక్రమం మెచ్చి అతని సాయంతో నిధి సాధించాలని అనుకుంటుంది. పలు ఆటంకాలు ఎదుర్కొని కులవర్ధనుడు నిధిని సాధిస్తాడు. మాతాపితలను హింసించి.. హేమమాలినిని, నిధిని పొందాలని పన్నాగం పన్నిన ప్రచండుని కులవర్ధనుడు ఓడించటం, అదే సమయంలో గురువు ప్రచండుని శపించటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది[1].

పాటలు, పద్యాలుసవరించు

 1. అందాల బొమ్మను నేను చెలికాడ
 2. అమ్మమ్మమ్మమ్మ తెలిసిందిలే గుట్టు తెలిసిందిలే - ఘంటసాల, పి.సుశీల - రచన: డా॥ సి.నారాయణ రెడ్డి
 3. కిలకిల బుల్లెమ్మో కిలాడి బుల్లెమ్మో - ఘంటసాల, ఎస్.జానకి - రచన: కొసరాజు
 4. గత సువిఙ్ఞానప్రకాశమ్ము మరల కల్పించితివి తల్లి - ఘంటసాల, ఎస్.జానకి - రచన: చిల్లర భావనారాయణరావు
 5. ధన్యోస్మి ధన్యోస్మి త్రైలోక్య మాతా.. శ్రీమన్‌మహాసర్వ (దండకం) - ఘంటసాల - రచన: చిల్లర భావనారాయణరావు
 6. నా వయసు సుమగంధం, నా మనసు మకరందం - పి. సుశీల -
 7. నాదు గురుదేవు కార్యార్ధినవుచు నేడు వచ్చితిని (పద్యం) - ఘంటసాల - రచన: చిల్లర భావనారాయణరావు
 8. పొన్న చెట్టు మాటున పొద్దు వాలిపోతుంది - ఎస్. జానకి
 9. రా వెన్నెల దొరా కన్నియను చేర రా కను చెదర - పి.సుశీల, ఘంటసాల - రచన: డా॥ సి.నారాయణ రెడ్డి
 10. సకల విద్యామయీ ఘనశారదేందురమ్య (పద్యం) - ఘంటసాల - రచన: చిల్లర భావనారాయణరావు
 11. స్వాగతం స్వాగతం క్షాత్రవజనజైత స్వాగతం - ఎస్. జానకి బృందం
 12. శుక్రవారపు పొద్దు సిరిని విడువొద్దు

శుక్రవారపు పొద్దు సిరిని విడువొద్దు పాటసవరించు

హిందూ సంప్రదాయాల్లో కొన్ని ముఖ్యమైన విషయాలు, ముఖ్యంగా మహాలక్ష్మీదేవి మనందరి ఇల్లల్లో స్థిరంగా ఉండడానికి ప్రాచీన శాస్త్రాలలో తెలియజేయబడ్డాయి. వాటిని వివరిస్తున్న పాట.[2]

శుక్రవారపు పొద్దు సిరిని విడువొద్దు
దివ్వెనూదగ వద్దు, బువ్వనెట్టొద్దు
తోబుట్టువుల మనసు కష్టపెట్టద్దు
తొలిసంజ మలిసంజ నిదురపోవద్దు
మా తల్లి వరలక్ష్మి నినువీడదపుడు
ఇల్లాలు కంటతడి పెట్టని ఇంట
కల్లలాడని ఇంట, గోమాత వెంట
ముంగిళ్ళ ముగ్గుల్లొ, పసుపు గడపల్లో
పూలల్లో, పాలల్లో, ధాన్యరాశుల్లో
మా తల్లి మహాలక్ష్మి స్థిరముగానుండు

మూలాలుసవరించు

 1. సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి (25 January 2020). "ఫ్లాష్ బ్యాక్ @ 50 లక్ష్మీకటాక్షం". ఆంధ్రభూమి దినపత్రిక. Archived from the original on 25 ఫిబ్రవరి 2020. Retrieved 13 June 2020. Check date values in: |archive-date= (help)
 2. [1]
 • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
 • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.
 • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.

బయటిలింకులుసవరించు